న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

US Open 2022‌లో సంచలనం.. రఫెల్ నాదల్‌కు భారీ షాక్!

 US Open 2022: Frances Tiafoe knocks out Rafael Nadal in pre quarter-finals

సిడ్నీ: ప్రతిష్టాత్మక టెన్నిస్ టోర్నీ యూఎస్ ఓపెన్‌ 2022లో పెను సంచలనం నమోదైంది. 22 గ్రాండ్ స్లామ్స్ విజేత, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌కు చుక్కెదురైంది. కెరీర్‌లో 23వ గ్రాండ్ స్లామ్ కోసం బరిలోకి దిగిన ఈ ప్రపంచ రెండో ర్యాంకర్‌కు నాలుగో రౌండ్‌లో అనూహ్య ఓటమి ఎదురైంది. మంగళవారం జరిగిన పురుషుల ప్రిక్వార్టర్స్‌లో రఫెల్ నాదల్ 4-6, 6-4, 4-6, 3-6 తేడాతో అమెరికాకు చెందిన ఫ్రాన్సిస్ టియఫో చేతిలో ఓటమిపాలయ్యాడు.

పేలవ ఆటతో..

పేలవ ఆటతో..

ఈ ఏడాది వరుసగా రెండు గ్రాండ్ స్లామ్స్ గెలిచి జోరు మీదున్న నాదల్‌‌కు ప్రధాన టోర్నీల్లో ఇదే తొలి ఒటమి. పేలవ సర్వీస్‌లతో పాటు అనవసర తప్పిదాలతో నాదల్ మూల్యం చెల్లించుకున్నాడు. తొలి సెట్‌నే కోల్పోయిన రఫెల్ నాదల్.. రెండో సెట్‌ గెలిచి సమం చేశాడు. కానీ మూడో సెట్‌లో ప్రత్యర్థి జోరు ముందు నిలవలేకపోయాడు. దాంతో ఐదోసారి నాదల్ సర్వీస్ బ్రేక్ చేసిన టియాఫో తన కెరీర్‌లో అతిపెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.

 సాకుల్లేవ్..

సాకుల్లేవ్..

ఇప్పటికే వయసు మీదపడి కెరీర్ చరమాంకంలో ఉన్న నాదల్.. తిరిగి వచ్చే ఏడాది జరగబోయే ఆస్ట్రేలియన్ ఓపెన్ వరకు ఆడగలడా..? అనేది అనుమానమే. వరుసగా గాయాల బారిన పడుతున్న నాదల్ శరీరం కూడా అందుకు సహకరించడం లేదు. ఇక తన ఓటమిపై స్పందించిన నాదల్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయానని, తన ఓటమికి సాకులు చెప్పాలనుకోవడం లేదన్నాడు. ప్రత్యర్థి తన కంటే మెరుగ్గా ఆడి విజయం సాధించాడని అభినందించాడు. యూఎస్ ఓపెన్ గెలిచి కెరీర్‌లో సెరెనా విలియమ్స్ (23 గ్రాండ్ స్లామ్‌లు) సరసన నిలవాలని భావించినా నాదల్ కల కలగానే ఉండిపోయింది.

 కలనా? నిజమా?

కలనా? నిజమా?

నాదల్‌‌పై విజయం సాధించడంతో టియఫో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అసలు ఏం జరుగుతుందో కూడా తనకు అర్థం కావడం లేదని.. ఇది కలనా? నిజమా తెలుసుకోలేకపోతున్నానని చెప్పాడు.'ఈ సమయంలో ఏం చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. నేను ఆనందం అనే భావనకు మించిన ఫీలింగ్ లో ఉన్నా. ఈ విజయంతో నా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అసలు నేను దీనిని ఇంకా నమ్మడం లేదు. ప్రపంచ గొప్ప ఆటగాళ్లల్లో ఒకడైన నాదల్‌ను నేను ఓడించాను. నా కెరీర్ మొత్తంలో ఇదో గొప్ప మ్యాచ్. మ్యాచ్‌లో ఏం జరిగిందో కూడా నాకు గుర్తులేదు.'అని భావోద్వేగానికి గురయ్యాడు.

Story first published: Tuesday, September 6, 2022, 18:29 [IST]
Other articles published on Sep 6, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X