న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

US Open 2020: భారత టెన్నిస్‌ యువ కెరటం సుమిత్‌ నగాల్‌ శుభారంభం.!

US Open 2020: Sumit Nagal Becomes 1st Indian in 7 Years to Win a Grand Slam Main Draw Match

న్యూయార్క్‌: భారత టెన్నిస్‌ యువ కెరటం సుమిత్‌ నగాల్‌ యూఎస్‌ ఓపెన్‌లో శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో 124 ర్యాంకర్ అయిన సుమిత్‌ 6-1, 6-3, 3-6, 6-1తో అమెరికా ఆటగాడు బ్రాడ్లీ క్లాన్‌పై విజయం సాధించి రెండోరౌండ్‌ చేరుకున్నాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో దాదాపు సమ ఉజ్జీలు (నాగల్‌ 124, క్లాన్‌ 129)గా ఉన్న ఇద్దరు ఆటగాళ్ల మధ్య 2 గంటల 12 నిమిషాల పాటు జరిగిన పోరులో చివరకు భారత ప్లేయర్‌దే పైచేయి అయింది. దీంతో ఏడేళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ సింగిల్స్‌ మెయిన్‌ డ్రా మ్యాచ్‌లో గెలిచిన భారత ఆటగాడిగా సుమిత్ గుర్తింపు పొందాడు. అంతకు ముందు 2013లో సోమ్‌దేవ్‌ ఈ ఘనతను అందుకున్నాడు.

జొకోవిచ్‌ 24వ విజయం..

జొకోవిచ్‌ 24వ విజయం..

తన కెరీర్‌లో 18వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ లక్ష్యంగా బరిలోకి దిగిన ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్(సెర్బియా) శుభారంభాన్ని అందుకున్నాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో మూడుసార్లు యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ 6-1, 6-4, 6-1తో దామిర్‌ జుమూర్‌ (బోస్నియా అండ్‌ హెర్జెగోవినా)పై గెలుపొందాడు. ఈ ఏడాది జొకోవిచ్‌కిది వరుసగా 24వ విజయం కావడం విశేషం. ఏటీపీ కప్‌ టీమ్‌ టోర్నీలో, దుబాయ్‌ ఓపెన్‌లో, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో, సిన్సినాటి మాస్టర్స్‌ టోర్నీలో జొకోవిచ్‌ అజేయంగా నిలిచాడు.

 ఇస్నెర్, ష్వార్ట్‌జ్‌మన్‌లకు షాక్‌...

ఇస్నెర్, ష్వార్ట్‌జ్‌మన్‌లకు షాక్‌...

పురుషుల సింగిల్స్‌ ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), ఏడో సీడ్‌ డేవిడ్‌ గాఫిన్‌ (బెల్జియం), నాలుగో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌) గెలుపొందారు. అయితే తొమ్మిదో సీడ్‌ డీగో ష్వార్ట్‌జ్‌మన్‌ (అర్జెంటీనా)... అమెరికా ఆజానుబాహుడు, 16వ సీడ్‌ జాన్‌ ఇస్నెర్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. వరుసగా 14వ ఏడాది ఈ టోర్నీలో ఆడుతున్న 35 ఏళ్ల ఇస్నెర్‌ తొలి రౌండ్‌లో 7-6 (7/5), 3-6, 7-6 (7/5), 3-6, 6-7 (3/7)తో అమెరికాకే చెందిన 64వ ర్యాంకర్‌ స్టీవ్‌ జాన్సన్‌ చేతిలో ఓడిపోయాడు. 2008 తర్వాత ఇస్నెర్‌ ఈ టోర్నీలో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించడం ఇదే తొలిసారి.

అన్‌సీడెడ్‌ కామెరన్‌ నోరి (బ్రిటన్‌) 3-6, 4-6, 6-2, 6-1, 7-5తో ష్వార్ట్‌జ్‌మన్‌ను ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో జ్వెరెవ్‌ 7-6 (7/2), 5-7, 6-3, 7-5తో 2017 రన్నరప్‌ కెవిన్‌ అండర్సన్‌ (దక్షిణాఫ్రికా)పై, సిట్సిపాస్‌ 6-2, 6-1, 6-1తో రామోస్‌ వినోలస్‌ (స్పెయిన్‌)పై, గాఫిన్‌ 7-6 (7/2), 3-6, 6-1, 6-4తో రీలీ ఒపెల్కా (అమెరికా)పై, 12వ సీడ్‌ షపోవలోవ్‌ (కెనడా) 6-4, 4-6, 6-3, 6-2తో సెబాస్టియన్‌ కోర్డా (అమెరికా)పై గెలిచారు.

టీనేజ్ సెన్సేషన్ గాఫ్‌ ఔట్..

టీనేజ్ సెన్సేషన్ గాఫ్‌ ఔట్..

సంచలనం సృష్టింస్తుందని భావించిన అమెరికా టీనేజ్‌ సంచలనం కోకో గాఫ్‌ 3-6, 7-5, 4-6తో 31వ సీడ్‌ అనస్తాసియా సెవస్తోవా (లాత్వియా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. 2 గంటల 2 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 16 ఏళ్ల గాఫ్‌ 13 డబుల్‌ ఫాల్ట్‌లు, 46 అనవసర తప్పిదాలు చేసింది. గతేడాది గాఫ్‌ వింబుల్డన్‌ టోర్నీలో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు, యూఎస్‌ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు, ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ వరకు చేరింది. అలాంటి గాఫ్ ఎన్నో అంచనాల మధ్య యూఎస్ ఓపెన్ బరిలోకి దిగి తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది.

శ్రమించిన ఒసాకా...

శ్రమించిన ఒసాకా...

మహిళల సింగిల్స్‌ విభాగంలో టైటిల్‌ ఫేవరెట్స్‌లో ఒకరైన జపాన్ స్టార్ ప్లేయర్, నాలుగో సీడ్‌ నవోమి ఒసాక మూడు సెట్‌ల పోరాటంలో శ్రమించి విజయాన్నందుకుంది. తొలి రౌండ్‌లో 2018 యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ ఒసాకా 6-2, 5-7, 6-2తో జపాన్‌కే చెందిన మిసాకి దోయిపై కష్టపడి గెలిచింది. యూఎస్‌ ఓపెన్‌లో ఏడు విజయాలు సాధిస్తే టైటిల్‌ సొంతమవుతుంది.

ఈ నేపథ్యంలో వర్ణ వివక్షపై అందరినీ చైతన్యపరిచేందుకు, నల్లజాతీయులపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచానికి చాటేందుకు ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో నల్లజాతీయుడి పేరు ఉన్న మాస్క్‌ను ధరించనున్నట్టు తెలిపింది. మొత్తంగా ఏడు మాస్క్‌లను సిద్ధం చేసుకున్నట్టు ఒసాకా చెప్పింది. గత మార్చిలో అమెరికా పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన నల్ల జాతీయురాలైన మెడికల్‌ టెక్నిషియన్‌ బ్రెనా టేలర్‌ పేరు ఉన్న మాస్క్‌ను మ్యాచ్‌కు ముందు, మ్యాచ్‌ తర్వాత ఒసాకా ధరించింది.

Story first published: Wednesday, September 2, 2020, 9:24 [IST]
Other articles published on Sep 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X