న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo Olympics 2021: సానియా మీర్జా మెడల్ గెలిచెనా? ఈ సారైనా తన కల నెరవేరెనా?

Tennis Preview: Sania Mirza-Ankita Raina Indias biggest Olympic medal hope

హైదరాబాద్: భారత టెన్నిస్ చరిత్రలో మన హైదరాబాదీ సానియా మీర్జా ఓ సంచలనం. డబుల్స్‌లో ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించి దిగ్గజ టెన్నిస్ ప్లేయర్‌గా ఎదిగింది. ఎన్నో ప్రతిష్టాత్మక టోర్నీల్లో మరెన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్న సానియా.. 34 ఏళ్ల వయసులో నాలుగోసారి ఒలింపిక్స్ ఆడుతోంది. ఫలితంగా భారత్ తరఫున నాలుగోసారి ఒలింపిక్స్ ఆడుతున్న తొలి మహిళా అథ్లెట్‌గా అరుదైన ఘనతను అందుకోనుంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పటివరకు సానియా ఖాతాలో ఒలింపిక్ పతకం లేదు. రియోలో పతకానికి చేరువగా వచ్చినా.. పోడియం ఫినిష్ చేలయేకపోయింది.

ఈ సారైనా..?

ఈ సారైనా..?

దీంతో చాలా ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న ఒలింపిక్ పతకాన్ని ఈసారి ఎలాగైనా సాధించాలన్న ఏకైక టార్గెట్‌తో సానియా టోక్యో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతోంది. అయితే ఒలింపిక్స్‌లో భారత టెన్నిస్ చరిత్ర అంత బాగా లేదు. 1996 ఏథెన్స్‌లో లియాండర్ పేస్ మెన్స్ సింగిల్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచాడు. ఆ తర్వాత మళ్లీ పతకం ఆశలు చిగురించలేదు. ఇప్పుడు మహిళల డబుల్స్‌లో సానియా-అంకితా రైనా మెడల్ తెస్తారా? అనేది చూడాలి. సానియా ఒలింపిక్స్ చరిత్రను ఓసారి పరిశీలిస్తే.. బీజింగ్, లండన్, రియో గేమ్స్‌లో వరుసగా సునీతా రావు.. రష్మి చక్రవర్తి, ప్రార్థనా తోంబ్రేలతో కలిసి ఆడింది.

మూడుసార్లు విఫలం..

మూడుసార్లు విఫలం..

2008 బీజింగ్ గేమ్స్‌లో సింగిల్స్‌లోనూ ఆడిన సానియా.. మణికట్టు గాయంతో ఫస్ట్ రౌండ్‌లోనే రిటైర్డ్ అయ్యింది. డబుల్స్ ఫస్ట్ రౌండ్‌లో వాకోవర్ విక్టరీ దక్కినా.. సెకండ్ రౌండ్‌లో సానియా-సునీతా జోడీ కుజ్‌నెత్సోవా-డినారా సఫీనా(రష్యా) చేతిలో ఓడింది. నాలుగేళ్ల తర్వాత లండన్‌లో సానియా-రష్మీ ఫస్ట్ రౌండ్‌లోనే చువాంగ్ డై-సువీ(చైనా) చేతిలో కంగుతిన్నారు. రియో ఒలింపిక్స్ వచ్చేసరికి సానియా పెర్ఫామెన్స్ మరింత దిగజారింది. అప్పటికే గాయాలబారిన పడటంతో ఆటపై పట్టుకోల్పోయింది. దీంతో తొలి రౌండ్‌లోనే సానియా-ప్రార్థన జంట.. పెంగ్ షుయ్-జెంగ్ షుయ్(చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు.

అంకితా రైనాతో..

అంకితా రైనాతో..

ఇక టోక్యో ఒలింపిక్స్‌లో సానియా.. అంకితా రైనాతో కలిసి బరిలోకి దిగుతోంది. ఈ ఇద్దరు కలిసి ఒకే ఒక్కసారి ఫెడ్ కప్‌లో ఆడారు. మంచి సమన్వయంతో 5-0తో విజయం సాధించారు. అయితే పెద్దగా అంతర్జాతీయ అనుభవం లేని అంకితాతో కలిసి సానియా ఎన్ని విజయాలు సాధిస్తుందో చూడాలి.

The History Of Olympic Games | ఒలింపిక్ క్రీడలు దాని చరిత్ర | Oneindia Telugu
సుమిత్ నగాల్..

సుమిత్ నగాల్..

పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి సుమిత్ నగాల్.. ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అయితే చాలా గట్టి పోటీ ఉండే సింగిల్స్‌లో నగాల్ ఎంత వరకు వెళ్తాడన్నది ఆసక్తికరంగా మారింది. గతేడాది నగాల్ ఒకటి, రెండు అద్భుత విజయాలు అందుకున్నాడు. 2013లో సోమ్‌దేవ్ తర్వాత గ్రాండ్‌స్లామ్ మెయిన్ డ్రా సింగిల్స్ మ్యాచ్ గెలిచిన ఇండియన్ ప్లేయర్‌గా డొమ్నిక్ థీమ్‌ను ఓడించి సెకండ్ రౌండ్‌లోకి ప్రవేశించాడు. గత రెండేళ్లుగా నగాల్-పరాగ్వే చాలెంజ్, బ్యూనస్ ఎయిర్స్ ఓపెన్, హీల్ బ్రోస్ చాలెంజ్‌లో మంచి పెర్ఫామెన్స్ చూపెట్టాడు.

Story first published: Thursday, July 22, 2021, 10:44 [IST]
Other articles published on Jul 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X