న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్కను ఓడించి క్వార్టర్స్‌కు చేరిన సెరెనా విలియమ్స్!

Serena Williams Beats Venus Williams at Top Seed Open

న్యూయార్క్: కరోనా బ్రేక్ అనంతరం బరిలోకి దిగిన తొలి టోర్నీలోనే అమెరికా టెన్నిస్ స్టార్‌ సెరెనా విలియమ్స్ అదరగొట్టింది. అక్క వీనస్ విలియమ్స్‌కు షాకిచ్చి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. లెక్సింగ్టన్‌ వేదికగా జరుగుతున్న కెంటకీ టాప్ సీడ్ ఓపెన్‌తో మైదానంలోకి అడుగుపెట్టిన సెరెనా 3-6, 6-3, 6-4తో అక్క వీనస్‌ను మట్టికరిపించింది. వీనస్‌పై సెరెనాకు ఈ విజయం 19వది కాగా.. చెల్లిపై అక్క 12 సార్లు మాత్రమే గెలిచింది.

గురువారం జరిగిన ఈ అక్కాచెల్లి పోరులో సెరెనా ఫస్ట్ సెట్ కోల్పోయినప్పటికీ రెండో సెట్ గెలిచి పోటిలో నిలిచింది. మూడో సెట్‌లో ఇద్దరు అక్కచెల్లెళ్లు హోరాహోరీగా తలపడగా.. విజయం మాత్రం చెల్లినే వరించింది. సెరెనా తదుపరి రౌండ్లో కెనడియన్ క్వాలిఫైయర్ లేలా ఫెర్నాండెజ్ లేక అమెరికన్ వైల్డ్ కార్డ్ ప్లేయర్ షెల్బీ రోజర్స్‌తో తలపడనుంది.

ఒక్క టైటిల్..

ఒక్క టైటిల్..

టెన్నిస్‌ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ గెలిచిన క్రీడాకారిణిగా మార్గరెట్‌ కోర్ట్‌ (24 టైటిల్స్‌-ఆస్ట్రేలియా) పేరిట ఉన్న రికార్డును సమం చేయడానికి సెరెనా విలియమ్స్‌ మరో టైటిల్‌ దూరంలో ఉన్న విషయం తెలిసిందే. 23 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిళ్ల చాంపియన్‌ సెరెనాకు నాలుగుసార్లు (2018 వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌; 2019 వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌) ఈ రికార్డును సమం చేయడానికి అవకాశం వచ్చింది. కానీ ఆమె తుది పోరులో తడబడి ఓటమిపాలై ఆల్‌టైమ్‌ రికార్డుకు ఇంకా దూరంలోనే ఉంది.

సన్నాహకంగానే..

సన్నాహకంగానే..

ఈ ఏడాది ఆ రికార్డును అందుకోవడానికి సెరెనా ముందు మరో రెండు అవకాశాలు ఉన్నాయి. ఈనెల 31న మొదలయ్యే యూఎస్‌ ఓపెన్‌... ఆ తర్వాత సెప్టెంబర్‌ 27న మొదలయ్యే ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీలలో సెరెనా ఆడనుంది. ఆ గ్రాండ్ స్లామ్ టోర్నీలకు సన్నాహకంగానే సెరెనా లెక్సింగ్టన్‌లో వేదికగా జరుగుతున్న ఈ కెంటకీ టాప్ సీడ్ ఓపెన్‌ ఆడుతుంది. కరోనా కారణంగా ఫిబ్రవరి నుంచి ఇంటికే పరిమితమైన ఆమె ఎప్పుడెప్పుడు మైదానంలో అడుగుపెడదామా? అని ఎదురు చూసినట్లు ఈ కెంటకీ ఓపెన్ టోర్నీకి ముందు చెప్పింది.

ఇన్నాళ్లూ... ఇంట్లోనే!

ఇన్నాళ్లూ... ఇంట్లోనే!

‘కరోనా మహమ్మారి బారిన పడకుండా గత ఆరు నెలలుగా నేను ఫ్లోరిడాలోని ఇంట్లోనే గడిపాను. ఒకవేళ బయటకు వెళ్లాల్సిన అవసరం వస్తే తప్పనిసరిగా మాస్క్‌లు ధరించే వెళ్లాను. నా వద్ద దాదాపు 50 మాస్క్‌లు ఉన్నాయి. మార్చి నుంచే భౌతిక దూరం పాటిస్తున్నాను. నేను గతంలో ఊపిరితిత్తుల సమస్యలతో బాధ పడ్డాను. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే చాలా జాగ్రత్తలు పాటిస్తూ సమయాన్ని గడుపుతున్నాను.

మా ఆయన ‘కోర్టు’ కట్టించాడు...

మా ఆయన ‘కోర్టు’ కట్టించాడు...

కరోనా సమయంలో బయటకు వెళ్లి ప్రాక్టీస్‌ చేసే అవకాశం లేకపోవడంతో ఇంట్లోనే సొంత కోర్టు, వ్యక్తిగత జిమ్‌ ఏర్పాటు చేసుకున్నాను. ఇంట్లోనే టెన్నిస్‌ ప్రాక్టీస్‌ చేసుకునేందుకు వీలుగా నా భర్త నా కోసం ప్రత్యేకంగా టెన్నిస్‌ ‘కోర్టు' కట్టించి ఇచ్చాడు. శారీరకంగా ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా ఉన్నా. అయితే మ్యాచ్‌ ఫిట్‌నెస్‌... శారీరక ఫిట్‌నెస్‌ వేరు. కరోనా సమయంలో ఒకటి తెలిసొచ్చింది. భవిష్యత్‌ గురించి ఎలాంటి ప్రణాళికలు చేసుకోరాదు. ఏ రోజుకారోజును సంతోషంగా గడిపేయాలి.

పాక్ తడ‘బ్యాట్'.. 11 ఏళ్ల తర్వాత వచ్చిన ఫవాద్ డకౌట్!

Story first published: Friday, August 14, 2020, 10:33 [IST]
Other articles published on Aug 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X