న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్ తడ‘బ్యాట్’.. 11 ఏళ్ల తర్వాత వచ్చిన ఫవాద్ డకౌట్!

England vs Pakistan: Bowlers put hosts on top on a rain-curtailed opening day

సౌతాంప్టన్‌: ఓవైపు వర్షంతో అంతరాయం.. మరోవైపు ఇంగ్లండ్ బౌలర్ల విజృంభణ.. ఈ నేపథ్యంలో నిలకడలేని పాకిస్థాన్ బ్యాటింగ్ మరోసారి తడబాటుకు గురైంది. స్పూర్తిదాయక పోరాటం చేయాల్సిన చోట ఓపికను చూపట్టలేక చేజేతులా వికెట్లు పారేసుకుంది. దీంతో ఇంగ్లండ్‌తో గురువారం మొదలైన రెండో టెస్ట్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి పాక్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 45.4 ఓవర్లలో 5 వికెట్లకు 126 రన్స్ చేసింది. క్రీజులో బాబ ర్‌ ఆజమ్‌ (25 బ్యాటింగ్‌), రిజ్వాన్‌ (4 బ్యాటింగ్‌) ఉన్నారు. ఓపెనర్‌ అబిద్‌ అలీ (60) అర్ధసెంచరీతో చేశాడు. ఇక పాక్‌ ఆశలన్నీ ఆజమ్‌పైనే పెట్టుకుంది. ఓవరాల్‌గా మూడుసార్లు వర్షం ఆటంకం కలిగించడంతో సగం ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అండర్సన్‌కు రెండు వికెట్లు దక్కాయి.

ఆరంభంలోనే షాక్..

ఆరంభంలోనే షాక్..

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. తన రెండో ఓవర్లోనే అండర్సన్‌... గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన షాన్‌ మసూద్‌ (1)ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో అబిద్‌ అలీ, కెప్టెన్‌ అజహర్‌ అలీ (20) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అబిద్‌ 0, 21 పరుగుల వద్ద ఇచ్చిన రెండు క్యాచ్‌లను ఇంగ్లండ్‌ ఫీల్డర్లు స్లిప్‌లో నేలపాలు చేశారు. 33 రన్స్ వద్ద వోక్స్ వేసిన సూపర్ డెలీవరీ నుంచి కూడా అలీ గట్టెక్కాడు. కుదురుకోవడానికి ప్రయత్నించిన ఈ జోడీ డిఫెన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వడంతో స్కోరు బోర్డు మందగించింది. ఇక వీరిద్దరు కుదురుకుంటున్న దశలో వర్షం రాగా... అంపైర్లు 10 నిమిషాల ముందే లంచ్‌ విరామాన్ని ప్రకటించారు. దీంతో పాక్ 62/1 స్కోర్‌తో బ్రేక్‌కు వెళ్లింది.

టపటపా...

టపటపా...

విరామం తర్వాత ఒక్కసారిగా పాక్‌ బ్యాటింగ్‌ తడబడింది. ఇంగ్లండ్‌ బౌలర్లు చెలరేగిపోవడంతో తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోయింది. ముందుగా అజర్‌ను అవుట్‌ చేసి అండర్సన్‌ ప్రత్యర్థి పతనానికి శ్రీకారం చుట్టాడు. అజర్‌ అలీ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో బర్న్స్‌ అందుకోవడంతో రెండో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 34వ ఓవర్‌లో మరోసారి వర్షం కురవడంతో గంటన్నర ఆటకు బ్రేక్‌ పడగా టీ బ్రేక్‌ ఇచ్చారు.

చెలరేగిన పేసర్లు..

చెలరేగిన పేసర్లు..

వర్షం కారణంగా సుదీర్ఘ సమయం పాటు ఆగినా, అది పాక్‌కు మేలు చేయలేకపోయింది. 99 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకొన్న కొద్ది సేపటికే ఆబిద్‌ను కరన్‌ పెవిలియన్‌ పంపించగా... అసద్‌ షఫీక్‌ (5) వికెట్‌ బ్రాడ్‌ ఖాతాలో చేరింది. సుమారు 11 ఏళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన ఆలమ్‌ (0) ఆ వెంటనే వోక్స్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించినా, రివ్యూలో ఇంగ్లండ్‌కు అనుకూల ఫలితం వచ్చింది. ఆ తర్వాత మళ్లీ వర్షం కురవడంతో తొలి రోజు ఆటను రద్దు చేయక తప్పలేదు.

11 ఏళ్లు.. 4 బంతులు..డకౌట్‌

11 ఏళ్లు.. 4 బంతులు..డకౌట్‌

10 సంవత్సరాల 259 రోజులు... సరిగ్గా చెప్పాలంటే 3911 రోజులు... పాకిస్తాన్‌ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్‌ ఫవాద్‌ ఆలమ్‌ తన చివరి టెస్టు మ్యాచ్‌ తర్వాత మళ్లీ టెస్టు మ్యాచ్‌ ఆడటానికి మధ్య ఉన్న వ్యవధి ఇది. గురువారం సౌతాంప్టన్‌లో ప్రారంభమైన రెండో టెస్టులో బరిలోకి దిగిన ఫవాద్, దీనికి ముందు తన ఆఖరి టెస్టును 28 నవంబర్, 2009న ఆడాడు. ఈ మధ్య కాలంలో పాక్‌ ఆడిన 88 టెస్టుల్లో అతనికి అవకాశం దక్కలేదు.

తన తొలి 3 టెస్టుల్లో 1 సెంచరీ సహా 41.66 సగటుతో 250 పరుగులు చేసినా... దురదృష్టవశాత్తూ అతనికి వేర్వేరు కారణాలతో మళ్లీ టెస్టు ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత పాక్‌ దేశవాళీ క్రికెట్‌లో టన్నుల కొద్దీ పరుగులు సాధించి పలు రికార్డులు నెలకొల్పిన తర్వాత ఎట్టకేలకు ఇప్పుడు మళ్లీ దేశం తరఫున టెస్టు ఆడాడు. కానీ తొలి ఇన్నింగ్స్‌లో ‘డకౌట్‌'గా వెనుదిరిగాడు. రివ్యూ తర్వాత అం పైర్‌ అవుట్‌గా ప్రకటించిన సమయంలో అతని మొహంలో కనిపించిన విషాద భావాన్ని మాటల్లో వర్ణించలేం.

హాట్ ఫొటోస్‌తో రచ్చరేపుతున్న అమెరికా మిక్స్‌డ్ మార్షల్ ఆర్టిస్ట్!

Story first published: Friday, August 14, 2020, 9:38 [IST]
Other articles published on Aug 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X