న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

89 vs 63 : నేను సాధించాను... మీరు కూడా సాధించగలరు అంటున్న సానియా!

Sania Mirza opens up about her journey from 89 kgs to 63 kgs: If I can then anyone can

హైదరాబాద్ : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవలే రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. పునరాగమనంలో ఆడిన తొలి టోర్నీ హోబర్ట్ ఇంటర్నేషనల్‌లో డబుల్స్ టైటిల్ నెగ్గి తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. ఈ విజయానందంతో ఈ సీజన్ తొలిగ్రాండ్ స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌ బరిలోకి దిగిన హైదరాబాద్ స్టార్ అనూహ్యంగా గాయపడి అర్ధాంతరంగా వైదొలిగిన విషయం తెలిసిందే.

భళా.. బంగ్లా కెప్టెన్.. అక్క చనిపోయిన బాధను దిగమింగి జట్టును గెలిపించాడుభళా.. బంగ్లా కెప్టెన్.. అక్క చనిపోయిన బాధను దిగమింగి జట్టును గెలిపించాడు

అయితే రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రీ ఎంట్రీ కోసం సానియా తీవ్ర కసరత్తులు చేసింది. ఫిట్‌నెస్ కోసం జిమ్‌లో అహర్నీషులు కష్టపడింది. ఎంతలా అంటే కేవలం నాలుగు నెలల్లో 26 కిలోల బరువు తగ్గెంత కసరత్తులు చేసింది. ఈ విషయాన్ని సానియానే సోమవారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపింది.

'89 కేజీలు vs 63 కేజీలు.. మనందరికీ లక్ష్యాలంటాయి. ఇందులో రోజువారీ గోల్స్, లాంగ్‌ టర్మ్ లక్ష్యాలు ఉంటాయి. వాటిలో ప్రతీది సాధించి గర్వపడండి. నా లక్ష్యాన్ని సాధించడానికి నాకు నాలుగు నెలల సమయం పట్టింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఫిట్‌ అవ్వడానికి నాకు ఈ సమయం పట్టింది. పూర్వపు ఫిట్‌నెస్ సాధించడానికి, పునరాగమనంతో అత్యున్నత స్థాయిలో పోటీపడటానికి చాలా సమయం తీసుకున్నట్లు అనిపించింది. మీరు మీ కలలను అనుసరించండి. ఎవరి మాట వినవద్దు. నేను చేశాను.. మీరు చేయగలరు'అనే స్పూర్తిదాయకమైన క్యాప్షన్‌తో తన బరువు తగ్గక ముందు, తగ్గిన తరువాతి ఫోటోలను జత చేసింది.

బంగ్లా ఆటగాళ్లతో ఎప్పుడూ ఇదే సమస్య.. అప్పుడు నాగినీ.. ఇప్పుడు బాహాబాహీబంగ్లా ఆటగాళ్లతో ఎప్పుడూ ఇదే సమస్య.. అప్పుడు నాగినీ.. ఇప్పుడు బాహాబాహీ

ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కేవలం రెండు గంటల్లో లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది. మోకాలి గాయం, తల్లి కావడం వంటి కారణాల వల్ల సానియా 89 కిలోల బరువు పెరిగింది. ఆ తరువాత ఫిట్‌నెస్‌ సాధనే లక్ష్యంగా శ్రమించి మళ్లీ ఆమె 63 కిలోల బరువు తగ్గింది. 26 కిలోల బరువును ఆమె కేవలం నాలుగు నెలల్లోనే తగ్గటం విశేషం. ఏప్రిల్ 2018లో ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సానియా ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది.

Story first published: Monday, February 10, 2020, 20:48 [IST]
Other articles published on Feb 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X