న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

French Open 2022: రఫెల్ నాదల్‌కు చెమటలు పట్టించిన జ్వెరెవ్! ఫైనల్లో రూడ్‌తో ఢీ!

French Open 2022: Rafael Nadal, Casper Ruud Into Final on Day of Injury

పారిస్: స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్.. 14వ సారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో శుక్రవారం హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో విజయం కోసం నాదల్ చెమటలు కక్కాడు. 3 గంటల 13 నిమిషాలు ముగిసినా రెండు సెట్‌లు పూర్తి కాలేదు తొలి సెట్‌ను అతికష్టమ్మీద నెగ్గిన నాదల్‌కు రెండో సెట్‌లోనూ ఒక్కో పాయింట్‌కు తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాల్సిన స్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ తుది ఫలితం ఎలా ఉంటుందోనని అభిమానులు ఆలోచిస్తున్న తరుణంలో కోర్టులో ఊహించని సంఘటన జరిగింది.

గాయంతో తప్పుకోవడం..

రెండో సెట్‌ 12వ గేమ్‌లో నాదల్‌ రిటర్న్‌ షాట్‌ను అందుకోనే క్రమంలో బేస్‌లైన్‌ వద్ద జ్వెరెవ్‌ జారి పడటంతో చీలమండకు తీవ్ర గాయమైంది. గాయం త్రీవంగా ఉండటంతో అతను మళ్లీ బరిలోకి దిగలేకపోయాడు. దాంతో నాదల్‌ను విజేతగా ప్రకటించారు.

నాదల్‌ తొలి సెట్‌ను 7-6 (10/8)తో టైబ్రేక్‌లో గెలిచాడు. రెండో సెట్‌లోని 12వ గేమ్‌ చివర్లో నాదల్‌ రిటర్న్‌ షాట్‌ను అందుకునే క్రమంలో జ్వెరెవ్‌ కోర్టులో జారి పడ్డాడు. దాంతో పాయింట్‌ నాదల్‌కు లభించింది. స్కోరు 6-6తో సమమైంది.

చెమటలు కక్కిన నాదల్..

చెమటలు కక్కిన నాదల్..

తొలి సెట్‌ టైబ్రేక్‌లో జ్వెరెవ్‌ 6-2తో ఆధిక్యంలో నిలిచి నాలుగు సెట్‌ పాయిం ట్లు సంపాదించాడు. కానీ పట్టువదలకుండా పోరాడినా నాదల్‌ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 7-6తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత స్కోరు 7-7తో, 8-8తో సమమైంది. ఈ దశలో నాదల్‌ వరుసగా రెండు పాయింట్లు గెలిచి తొలి సెట్‌ను గంటా 38 నిమిషాల్లో గెల్చుకున్నాడు.

రెండో సెట్‌లోనూ జ్వెరెవ్‌ అద్భుతంగా ఆడుతూ 5-3తో ఆధిక్యంలోకి వచ్చి సెట్‌ కోసం సర్వీస్‌ చేశా డు. కానీ తొమ్మిదో గేమ్‌లో జ్వెరెవ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన నాదల్‌ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని స్కోరును 5-5తో సమం చేశాడు. 11వ గేమ్‌లో జ్వెరెవ్‌ తన సర్వీస్‌ను కాపాడుకోగా... 12వ గేమ్‌లో నాదల్‌ సర్వీస్‌లో చివరి పాయింట్‌ సమయంలో జ్వెరెవ్‌ జారి పడటంతో మ్యాచ్‌ ముగిసింది.

క్రీడా స్పూర్తి చాటిన జ్వెరెవ్..

కాలి మడమకు తీవ్ర గాయం అయినా జర్మనీ స్టార్ టెన్నిస్ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు. నడవలేని స్థితిలో కూడా మైదానంలోకి వచ్చి తన హుందాతనాన్ని చాటుకున్నాడు. జ్వెరెవ్ స్టిక్స్ సాయంతో మైదానంలోకి వచ్చి మ్యాచ్ నుంచి తాను రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. గాయంతో బాధపడుతున్న జ్వెరెవ్ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడంతో నాదల్ మొదలు ప్రతి ఒక్కరు కూడా అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. త్వరగా కోలుకుని తిరిగి కోర్టులో కనిపించాలని అందరూ కోరుకుంటున్నారు.

రూడ్‌తో టైటిల్ ఫైట్..

రూడ్‌తో టైటిల్ ఫైట్..

కాస్పర్‌ రూడ్‌ (నార్వే), సిలిచ్‌ (క్రొయేషియా) మధ్య జరిగిన రెండో సెమీఫైనల్లో రూడ్ గెలుపొందాడు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో రూడ్ 3-6, 6-4. 6-2, 6-2 తేడాతో సిలిచ్‌ను ఓడించాడు. దాంతో ఆదివారం జరిగే ఫైనల్లో రూడ్ నాదల్‌‌తో తలపడతాడు. కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కోసం అమెరికా టీనేజర్‌ కోకో గాఫ్‌... రెండోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ నెగ్గాలనే లక్ష్యంతో స్వియాటెక్‌ నేడు మహిళల సింగిల్స్‌ టైటిల్‌ పోరులో తలపడనున్నారు.

Story first published: Saturday, June 4, 2022, 8:25 [IST]
Other articles published on Jun 4, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X