న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

French Open 2021: క్రెజికోవా ‘డబుల్‌’ ధమాకా.. అరుదైన ఘనతతో చరిత్రకెక్కిన చెక్ భామ!

 French Open 2021: Barbora Krejcikova Becomes First Player To Win Womens Singles And Doubles Grand slam Titles In Same Year Since 2016

పారిస్‌: చెక్‌ రిపబ్లిక్‌ స్టార్ బార్బోరా క్రెజికోవా ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అరుదైన ఘనత సాధించింది. తొలిసారిగా మహిళల సింగిల్స్‌ చాంపియన్‌గా నిలిచిన మర్నాడే డబుల్స్‌ టైటిల్‌ను కూడా ఖాతాలో వేసుకుంది. ఐదో ప్రయత్నంలోనే తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ చాంపియన్‌గా అవతరించిన చెక్‌ భామ 24 గంటలు గడవకముందే తన ఖాతాలో మరో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను జమ చేసుకుంది.

శనివారం ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గిన 25 ఏళ్ల క్రెజికోవా ఆదివారం మహిళల డబుల్స్‌ టైటిల్‌ను కూడా దక్కించుకుంది. ఫైనల్లో క్రెజికోవా -కాటరీనా సినియకోవా (చెక్‌ రిపబ్లిక్‌) ద్వయం 6-4, 6-2తో బెథానీ మాటెక్‌ సాండ్స్‌ (అమెరికా) -ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన క్రెజికోవా జంటకు 2,44,925 యూరోలు (రూ. 2 కోట్ల 17 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సోమవారం విడుదలయ్యే ప్రపంచ డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో క్రెజికోవా ఏడో ర్యాంక్‌ నుంచి నంబర్‌వన్‌ ర్యాంక్‌కు ఎగబాకనుంది.

'డబుల్‌' విజయంతో క్రెజికోవా దిగ్గజ క్రీడాకారిణిల సరసన నిలిచింది. సెరెనా (2016 వింబుల్డన్‌లో) తర్వాత ఓ గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీలో మహిళల సింగిల్స్, డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన క్రీడాకారిణగా క్రెజికోవా గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఈ తరహా ఘనత సాధించిన ఏడో క్రీడాకారిణిగా ఆమె నిలిచింది. గతంలో బిల్లీ జీన్‌ కింగ్‌ (1972), మార్గరెట్‌ కోర్ట్‌ (1973), క్రిస్‌ ఎవర్ట్‌ (1974, 1975), వర్జీనియా(1978), మార్టినా నవ్రతిలోవా (1982, 1984), మేరీ పియర్స్‌ (2000) ఈ ఘనత సాధించారు.

2000లో మేరీ పియర్స్‌ (ఫ్రాన్స్‌) తర్వాత ఒకే ఏడాది రెండు ఫ్రెంచ్‌ టైటిళ్లను ఖాతాలో వేసుకున్న క్రీడాకారిణిగా నిలిచింది. క్రెజికోవా-సినియాకోవా జోడీకి డబుల్స్‌లో ఇది మూడవ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ కావడం విశేషం. 2013లో బాలికల డబుల్స్‌తో పాటు 2018లోనూ మహిళల డబుల్స్‌లో వీరు విజేతలుగా నిలిచారు.

శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 33వ ర్యాంకర్, అన్‌సీడెడ్‌ క్రెజికోవా 6-1, 2-6, 6-4తో ప్రపంచ 32వ ర్యాంకర్, 31వ సీడ్‌ అనస్తాసియా పావ్లుచెంకోవా (రష్యా)పై అద్భుత విజయాన్నందుకుంది. గంటా 58 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో క్రెజికోవా కీలకదశల్లో పైచేయి సాధించి విజయాన్ని దక్కించుకుంది. కచ్చితమైన సర్వీస్‌లు, డ్రాప్‌ షాట్‌లు, డబుల్‌ బ్యాక్‌హ్యాండ్‌ షాట్‌లు, ఫోర్‌హ్యాండ్‌ షాట్‌లతో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచింది. హానా మాండ్లికోవా, నొవోత్నా, క్విటోవా తర్వాత చెక్‌ రిపబ్లిక్‌ తరఫున గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గిన నాలుగో ప్లేయర్‌ క్రెజికోవా. ఒస్టాపెంకో (లాత్వియా-2017), స్వియాటెక్‌ (పోలాండ్‌-2020) తర్వాత అన్‌సీడెడ్‌ హోదాలో ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచిన మూడో క్రీడాకారిణి క్రెజికోవా.

Story first published: Monday, June 14, 2021, 10:10 [IST]
Other articles published on Jun 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X