న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

French Open 2021: కోటలో కొత్త రాణి బార్బోరా క్రెజికోవా.. డబుల్స్ టైటిల్‌కు చేరువలో..

French Open 2021: Barbora Krejcikova Beats Anastasia Pavlyuchenkova In Final To win Maiden Grand Slam Title

పారిస్: అన్‌సీడెడ్ ప్లేయర్, చెక్‌ రిపబ్లిక్‌ క్రీడాకారిణి బార్బోరా క్రెజికోవా అద్భుతం చేసింది. డబుల్స్ ప్లేయర్‌గా ముద్రపడ్డ ఈ పాతికేళ్ల చెక్ భామ సింగిల్స్‌లో సంచలనం సృష్టించింది. వయసు తక్కువే అయినా తగినంత అనుభవం లేకున్నా.. ఇప్పటిదాకా ఆడింది ఐదు గ్రాండ్ స్లామ్సే అయినా.. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల టైటిల్ నెగ్గి ఔరా అనిపించింది. 52 గ్రాండ్ స్లామ్స్ ఆడిన అనుభవం ఉన్న 29 ఏళ్ల రష్యాస్టార్ పవ్లుచెంకోవాకు తుదిపోరులో చెక్‌పెట్టి ఫ్రెంచ్ కోటలో కొత్త క్వీన్‌గా నిలిచింది.

ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో వరుసగా ఆరో ఏడాది కూడా కొత్త ప్లేయరే విజేతగా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా ఫ్రెంచ్‌ ఓపెన్‌లో బరిలోకి దిగిన చెక్‌ రిపబ్లిక్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి బార్బోరా క్రెజికోవా సూపర్‌ ఫినిషింగ్‌ ఇచ్చింది. మహిళల సింగిల్స్‌ విభాగంలో ఆమె తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 33వ ర్యాంకర్, అన్‌సీడెడ్‌ క్రెజికోవా 6-1, 2-6, 6-4తో ప్రపంచ 32వ ర్యాంకర్, 31వ సీడ్‌ అనస్తాసియా పావ్లుచెంకోవా (రష్యా)పై అద్భుత విజయాన్నందుకుంది.

ఆల్‌రౌండ్ ప్రదర్శనతో..

ఆల్‌రౌండ్ ప్రదర్శనతో..

గంటా 58 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో క్రెజికోవా కీలకదశల్లో పైచేయి సాధించి విజయాన్ని దక్కించుకుంది. కచ్చితమైన సర్వీస్‌లు, డ్రాప్‌ షాట్‌లు, డబుల్‌ బ్యాక్‌హ్యాండ్‌ షాట్‌లు, ఫోర్‌హ్యాండ్‌ షాట్‌లతో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన ఈ చెక్‌ అమ్మాయి.. ప్రత్యర్థికి ఎక్కువగా అవకాశం ఇవ్వలేదు.

పదే పదే నెట్‌ వద్దకు దూసుకొస్తూ పాయింట్లు సాధించిన క్రెజికోవా నాలుగు, ఆరు గేముల్లో పవ్లిచెంకోవా సర్వీస్‌ బ్రేక్‌ చేసి తేలిగ్గా తొలి సెట్‌ గెలిచింది. కానీ రెండో సెట్లో పవ్లిచెంకోవా నుంచి ఆమెకు గట్టి ప్రతిఘటన ఎదురైంది. వరుసగా మూడు గేమ్‌లు గెలిచి 3-0 ఆధిక్యంలో నిలిచిన పవ్లిచెంకోవా అదే జోరుతో 6-2తో సెట్‌ గెలిచి మ్యాచ్‌లో నిలిచింది.

హోరాహోరీగా..

హోరాహోరీగా..

చివరి సెట్లో క్రెజికోవా, పవ్లిచెంకోవా మరింత దూకుడుగా ఆడారు. ఎవరూ తగ్గకపోవడంతో స్కోర్లు సమం అవుతూ వచ్చాయి. కానీ ఏడో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన బార్బారా 4-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత క్రెజికోవాకు రెండు ఛాంపియన్‌షిప్‌ పాయింట్లు వచ్చినా పవ్లిచెంకోవా ఎలాగోలా సర్వీస్‌ నిలబెట్టుకుంది. కానీ పదో గేమ్‌లో టైటిల్‌ కోసం సర్వీస్‌ చేసిన క్రెజికోవా.. ఆరంభంలో కాస్త తడబడింది. కానీ పుంజుకున్న ఆమె 40-15తో విజయం ముంగిట నిలిచింది. ఆ తర్వాత ఓ షాట్‌ను పవ్లిచెంకోవా కోర్టు బయటకు కొట్టేయడంతో క్రెజికోవా మ్యాచ్‌తో పాటు టైటిల్‌ను సొంతం చేసుకుంది.

రూ.12 కోట్ల 41 లక్షల ప్రైజ్‌మనీ..

రూ.12 కోట్ల 41 లక్షల ప్రైజ్‌మనీ..

విన్నర్ క్రెజికోవాకు 14 లక్షల యూరోలు (రూ. 12 కోట్ల 41 లక్షలు)... రన్నరప్‌ పావ్లుచెంకోవాకు 7 లక్షల 50 వేల యూరోలు (రూ. 6 కోట్ల 65 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. నేడు జరిగే మహిళల డబుల్స్‌ ఫైనల్లో సినియకోవాతో కలిసి విజేతగా నిలిస్తే 2000లో మేరీ పియర్స్‌ (ఫ్రాన్స్‌) తర్వాత ఒకే ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సింగిల్స్, డబుల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన క్రీడాకారిణిగా క్రెజికోవా గుర్తింపు పొందుతుంది. కాగా, సింగిల్స్‌ విజేతగా నిలిచిన క్రెజికోవా మహిళల డబుల్స్‌లోనూ ఫైనల్‌ చేరిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగే ఫైనల్లో స్వియటెక్‌/బెతానీ జోడీతో క్రెజికోవా/సినియకోవా జంట తలపడనుంది.

మూడో ప్లేయర్‌గా..

మూడో ప్లేయర్‌గా..

హానా మాండ్లికోవా, నొవోత్నా, క్విటోవా తర్వాత చెక్‌ రిపబ్లిక్‌ తరఫున గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గిన నాలుగో ప్లేయర్‌ క్రెజికోవా. ఒస్టాపెంకో (లాత్వియా-2017), స్వియాటెక్‌ (పోలాండ్‌-2020) తర్వాత అన్‌సీడెడ్‌ హోదాలో ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచిన మూడో క్రీడాకారిణి క్రెజికోవా. ఓవరాల్‌గా క్రెజికోవా కెరీర్‌లో ఇది మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. తన దేశానికే చెందిన సినియకోవాతో కలిసి క్రెజికోవా 2018లో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో, 2018 వింబుల్డన్‌ ఓపెన్‌లో మహిళల డబుల్స్‌ టైటిల్‌ను సాధించింది.

Story first published: Sunday, June 13, 2021, 8:38 [IST]
Other articles published on Jun 13, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X