న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Canadian Open: తొలి రౌండ్‌లోనే సెరెనా ఓటమి.. సానియా జోడీ సంచలనం!

Canadian Open: Serena Williams loses first match since announcing retirement, Sania enters Quarters

టొరంటో: కెరీర్‌కు త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్ధమైన అమెరికా టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ ఆ ప్రకటన తర్వాత ఆడిన మొదటి టోర్నీలోనే పేలవ ప్రదర్శన కనబర్చింది. కెనడియన్‌ ఓపెన్‌లో ఆమె ఆట తొలి రౌండ్లోనే ముగిసింది. మహిళల సింగిల్స్‌ పోరులో సెరెనా విలియమ్స్ 2-6, 4-6తో బెలిండా బెన్సిక్‌ (స్విట్జర్లాండ్‌) చేతిలో ఓటమి చవిచూసింది.

ఇక్కడ మూడు సార్లు చాంపియన్‌గా నిలిచిన సెరెనా ఓటమితో ఈవెంట్‌కు గుడ్‌బై చెప్పింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 'భావోద్వేగం వల్లే మాటరాని మౌనంతో బరువెక్కిన హృదయంతో నిష్క్రమించాను. నిజానికి ఈ మ్యాచ్‌లో నేను బాగా ఆడాలని సన్నద్ధమై వచ్చాను. కానీ నాకంటే బెలిండా చాలా బాగా ఆడింది. ఇంత మంది అభిమానుల మధ్య నా సుదీర్ఘ కెరీర్‌ సాగింది. ఇది ఎప్పటికీ ప్రత్యేకం' అని సెరెనా ఎమోషనల్ అయింది.

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కెరడియన్ ఓపెన్ టోర్నమెంట్‌లో సంచలనం సృష్టించింది. అమెరికా ప్లేయర్ మాడిసన్‌కీస్‌తో తొలిసారి జోడీ కట్టిన సానియా మహిళల డబుల్స్‌లో టాప్ సీడ్స్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సానియా-కీస్ జంట 3-6,6-4, 10-8తో టాప్ సీడ్ వెరోనియా కుదెమెతోవా(రష్యా)-ఎలైస్ మెర్జెన్స్(బెల్జియం) ద్వయంపై ఉత్కంఠ విజయం సాధించింది.

అన్యాయం... కెప్టెన్సీ మార్పు పట్ల నెటిజన్ల విమర్శలు *Cricket | Telugu OneIndia

తొలి సెట్‌ను కోల్పోయిన భారత్‌-అమెరికా ద్వయం తర్వాత రెండు సెట్లలోనూ పట్టుదలతో ఆడింది. హోరాహోరీగా జరిగిన ఆఖరి మూడో సెట్లో సానియా జోడీ పైచేయి సాధించి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. ఆరో సీడ్‌ ఒస్టాపెంకో (లాత్వియా)-కిచెనొక్‌ (ఉక్రెయిన్‌), పుతిత్సెవా (కజకిస్తాన్‌)-కెనిన్‌ (అమెరికా) జోడీల మధ్య జరిగే ప్రిక్వార్టర్స్‌ విజేతతో సానియా జంట క్వార్టర్స్‌లో తలపడుతుంది.

Story first published: Friday, August 12, 2022, 11:18 [IST]
Other articles published on Aug 12, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X