న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్యాంటులోనే పోసేస్తా.. టాయిలెట్‌కు అనుమతించని అంపైర్‌కు ప్లేయర్ వార్నింగ్!

Australian Open 2021: Canada star Denis Shapovalov fumes after refused toilet break

సిడ్నీ: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో కెనడా స్టార్ ప్లేయర్ డెనీస్ షాపోలపోవ్ విచిత్ర పరిస్థితి ఎదుర్కొన్నాడు. మ్యాచ్ మధ్యలో టాయిలెట్‌కు వెళ్లాలని అడిగిన అతనికి చైర్ అంపైర్ అనుమతి ఇవ్వలేదు. ఇటలీకి చెందిన జన్నిక్ సిన్నర్‌తో జరిగిన మ్యాచ్‌లో డెనిస్.. ఐదో సెట్ మొదలయ్యే ముందు తనను టాయిలెట్‌కు వెళ్లనివ్వాలని అంపైర్‌ను కోరాడు. దీనికి అంపైర్ నిరాకరించడంతో.. ''నన్ను టాయిలెట్‌కు వెళ్లనివ్వకపోతే ప్యాంటులోనే పోసేలా ఉన్నా.. లేదంటే ఆ బాటిల్‌లో పోస్తా. మీరు ఆటగాళ్లను టాయిలెట్‌కు కూడా వెళ్లనివ్వరా? ఇదెక్కడి రూల్? నాకర్థం కావడంలేదు'' అంటూ చిందులు తొక్కాడు.

నిబంధనల ప్రకారం ఐదు సెట్ల మ్యాచ్‌లో ఆటగాళ్లకు రెండు టాయిలెట్స్ బ్రేక్ ఇస్తారు. అయితే ఈ నిబంధనపై కూడా డెనిస్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనలా చిన్న బ్లాడర్ ఉన్న ఆటగాళ్లకు ఈ నిబంధన చాలా సమస్యగా మారిందన్నాడు. తనకు ప్రతీ సెట్‌ ముగిసిన వెంటనే టాయిలెట్ వస్తుందన్నాడు. ఈ పరిస్థితుల్లో సుదీర్ఘంగా కోర్టులో ఆడటం ఇబ్బందిగా ఉందని ఈ కెనడా ప్లేయర్ చెప్పుకొచ్చాడు. అయితే ఇందులో అంపైర్ తప్పులేదని, నిబంధనలు అలా ఉన్నాయన్నాడు. మరిన్ని బ్రేక్‌లు లభించేలా రూల్స్ మార్చాలని కోరాడు. ఈ మ్యాచ్‌లో డెనీస్ షాపోలపోవ్ 3-6,6-3,6-2, 4-6,6-4‌తో జన్నిక్ సిన్నర్‌ను ఓడించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. సెకండ్ రౌండ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన బెర్నార్డ్ టొమిక్‌తో నేడు(బుధవారం) అమీతుమీ తేల్చుకోనున్నాడు.

Story first published: Wednesday, February 10, 2021, 10:04 [IST]
Other articles published on Feb 10, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X