ఆస్ట్రేలియా ఓపెన్ నయా క్వీన్‌ కెనిన్‌

మెల్‌బోర్న్‌: ఆరంభం నుంచి ఆఖరి వరకూ సంచలనాల మోత మోగిన ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్‌లో మరో నయా క్వీన్‌నే టైటిల్ వరించింది. అమెరికాకు చెందిన 14వ సీడ్ సోఫియా కెనిన్ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో కెనిన్‌ 4-6, 6-2, 6-2తో రెండు గ్రాండ్‌స్లామ్‌ల విజేత గార్బిన్‌ ముగురుజా (స్పెయిన్‌)ను కంగుతినిపించింది.

రాడ్‌లావెర్‌ ఎరీనాలో 2 గంటల 3 నిమిషాలు జరిగిన ఫైనల్లో కెనిన్‌ తొలి సెట్‌లో ఓడింది. మొదటి సెట్‌లో ముగురుజా 4-2 ఆధిక్యం ప్రదర్శించినా..ఆ తర్వాత ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన కెనిన్‌ 4-4తో సమం చేసింది. కానీ 5-4 వద్ద కెనిన్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసిన ముగురుజా ఆధిక్యాన్ని కాపాడుకొని తొలిసెట్‌ సొంతం చేసుకుంది. సెట్‌ కోల్పోయినా దూకుడు తగ్గని కెనిన్‌.. తన పవర్‌ గేమ్‌కు బేస్‌లైన్‌ ఆటను జోడించి ప్రత్యర్థిని బెంబేలెత్తించింది.

సోఫియా కెనిన్‌కు

అదేఊపులో మిగతా రెండుసెట్లను అలవో కగా నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్‌లో రెండు ఏస్‌లు సంధించిన కెనిన్‌.. 28 విన్నర్లు కొట్టింది. ఇక ఏకంగా 9 ఏస్‌ లు వేసిన ముగురుజా.. 32 విన్నర్లు కొట్టి 45 అనవసర తప్పిదాలకు పాల్పడింది. విజేత సోఫియా కెనిన్‌కు 41 లక్షల 20 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లు (రూ. 19 కోట్ల 71 లక్షలు)... రన్నరప్‌ ముగురుజాకు 20 లక్షల 65 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లు (రూ. 9 కోట్ల 88 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

నెంబర్ వన్‌గా..

నెంబర్ వన్‌గా..

డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో ఇప్పటిదాకా 15వ ర్యాంక్‌లోనున్న కెనిన్‌.. తాజా ప్రదర్శనతో ఏడో స్థానానికి చేరనుంది. అంతేకాదు.. అమెరికా నెంబర్‌వన్‌గా ఉన్న సెరెనాను పక్కకునెట్టి ఆ దేశ టాప్‌ ర్యాంకునూ చేజిక్కించుకోనుంది.

పిన్న వయస్కురాలిగా..

పిన్న వయస్కురాలిగా..

ఈ విజయంతో సెరెనా (2002లో) తర్వాత చిన్న వయస్సులో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన అమెరికా ప్లేయర్‌గా కెనిన్‌ గుర్తింపు పొందింది. 2008 తర్వాత ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నెగ్గిన పిన్న వయస్కురాలిగా కూడా కెనిన్‌ ఘనత వహించింది. 2008లో షరపోవా 20 ఏళ్ల ప్రాయంలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గింది.

నా కల నిజమైంది..

నా కల నిజమైంది..

ఈ విజయానంతరం కెనిన్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. తన కష్టానికి ఫలితం దక్కిందని ఈ అమెరికా స్టార్ సంతోషం వ్యక్తం చేసింది. ‘నా కల నిజమైంది. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. మీరూ కలలు కనండి. ఎందుకంటే కలలు నిజమవుతాయి. గత రెండు వారాలు నా జీవితంలోనే అత్యుత్తమ క్షణాలు. నా గుండె లోతుల్లోంచి చెబుతున్నా మీరంటే (ప్రేక్షకులు) నాకెంతో ప్రేమాభిమానాలు. మీ అందరికీ ధన్యవాదాలు. నేను గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌గా అవతరించేందుకు నాన్న, కోచ్‌ అలెగ్జాండర్, ఆయన శిక్షణ బృందం ఎంతగానో కష్టపడింది. ఆఖరికి మా ఇన్నేళ్ల కష్టం ఫలించింది. మా అమ్మకు మూఢనమ్మకాలెక్కువ. అందుకే తను నా మ్యాచ్‌ల్ని చూడదు. చూస్తే ఏదైనా కీడు జరుగుతుందనే బెంగ ఆమెకు... అందుకే మ్యాచ్‌ అయిపోగానే నేనే ఫోన్‌ చేసి చెప్పా. నేను గెలిచానని! అప్పుడే ఆమె మనసు కుదుటపడుతుంది. అమ్మా నేను కప్‌తో ఇంటికొస్తున్నాను. నీ జీవితంలో ఎప్పుడు ఎవరికీ ఇవ్వని హగ్‌ (ఆలింగనం) ఇవ్వాలి.'అని 21 ఏళ్ల సోఫియా కెనిన్‌ చెప్పుకొచ్చింది.

రష్యా సంతతి..

రష్యా సంతతి..

సోఫియా కెనిన్‌ రష్యాలో జన్మించింది.. ఆమె పుట్టిన కొద్దినెలలకే తల్లిదండ్రులు అలెగ్జాండర్‌, లెనా కనిన్‌ అమెరికా వలస వచ్చారు. ట్యాక్సీ డ్రైవర్‌ అయిన అలెగ్జాండర్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ కూడా. తండ్రిని చూసి స్ఫూర్తి పొందిన సోఫియాకు ఆయనే తొలి గురువు. ఐదేళ్లకే టెన్నిస్‌ రాకెట్‌ చేతబట్టి కెనిన్‌ మెరుగైన శిక్షణ కోసం న్యూయార్క్‌నుంచి ఫ్లోరిడా చేరింది. అక్కడ టెన్నిస్‌ ట్రెయినింగ్‌ తీసుకోవడంతోపాటు టెలివిజన్‌ షోలలో పాల్గొనడం ద్వారా ఫ్లోరిడా రాష్ట్రంలో సోఫియా పాపులర్‌ అయింది. శిక్షణ సమయంలోనే అమెరికన్‌ స్టార్లు రాడిక్‌, మెకెన్రో, వీనస్‌ విలియమ్స్‌లతో కలిసి ఆడింది.

ఏడేళ్ల వయస్సులో యునైటెడ్‌ స్టేట్స్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ బాలికల అండర్‌-10 కేటగిరీలో సత్తా చాటిన కెనిన్‌.. ఆ విభాగంలో ఫ్లోరిడా రాష్ట్రంలో నెంబర్‌వన్‌గా నిలిచింది. 2013లో 14 ఏళ్ల వయస్సులో ఐటీఎఫ్‌ సర్క్యూట్‌లో ప్రొఫెషనల్‌ కెరీర్‌ ప్రారంభించింది. ఇప్పటివరకు రెండు ఐటీఎఫ్‌, రెండు డబ్ల్యూటీఏ టైటిల్స్‌ గెలిచింది. 2015లో యూఎస్‌ ఓపెన్‌తో గ్రాండ్‌స్లామ్‌ అరంగేట్రం చేసింది. ఇప్పుడు తొలి మేజర్‌ టైటిల్‌ను అందు కుంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నెగ్గిన రెండో పిన్న వయస్కురాలిగా తన ఆరాధ్య క్రీడాకారిణి షరపోవా తర్వాతి స్థానంలో కెవిన్‌ నిలవడం విశేషం.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, February 2, 2020, 10:33 [IST]
Other articles published on Feb 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X