అకాపుల్కో: మెక్సికన్ ఓపెన్ టోర్నీలో జర్మనీ టెన్నిస్ స్టార్, ప్రపంచ మూడో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ సహనం కోల్పోయాడు. డబుల్స్ మ్యాచ్‌లో ఓటమిని తట్టుకోలేక.. అంపైర్‌ను బూతులు తిట్టి చైర్‌ను బలంగా కొడుతూ రాకెట్‌ను విరగ్గొట్టాడు. దీనిపై ఆగ్రహించిన ఆర్గనైజర్స్.. నిబంధనలను అతిక్రమించినందుకు జ్వెరెవ్‌ను టోర్నీ నుంచి సస్పెండ్ చేశారు. సింగిల్స్ ఆడాల్సిన పనిలేదంటూ ఇంటికి పంపించేసారు.
Alexander Zverev has been THROWN OUT of the Mexican Open for attacking the umpire's chair at the end of his doubles match 😮😮😮 pic.twitter.com/CWhQ1r6kwj
— Amazon Prime Video Sport (@primevideosport) February 23, 2022
మంగళవారం రాత్రి జరిగిన డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో జ్వెరెవ్ -మార్సెలో మెలో (బ్రెజిల్) జోడీ 2-6, 6-4, 6-10తో గ్లాస్‌పూల్ (బ్రిటన్)-హారి హెలియోవారా (ఫిన్‌లాండ్) జంట చేతిలో ఓడింది. అయితే లాస్ట్ సెట్‌లో లాయిడ్ కొట్టిన ఓ షాట్‌పై జ్వెరెవ్ ప్రొటెస్ట్ చేయగా, చైర్ అంపైర్ రిజెక్ట్ చేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన జ్వెరవ్ అంపైర్‌ను బండ బూతులు తిట్టాడు. మ్యాచ్ పూర్తయ్యాక అంపైర్ దగ్గరి కొచ్చి మరోసారి తిడుతూ రాకెట్‌ను చైర్‌కేసి బలంగా కొట్టి విరగ్గొట్టాడు అంపైర్ తన కాళ్లను దగ్గరకు తీసుకోకపోతే కచ్చితంగా గాయమయ్యేది. జ్వెరెవ్ తీరుపై టెన్నిస్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
'క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన జ్వెరెవ్‌ను టోర్నీ నుంచి తప్పించాం' అని అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ తెలిపింది. మరోవైపు తన హద్దుమీరిన ప్రవర్తనపై జ్వెరెవ్ బుధవారం స్పందించాడు. చైర్ అంపైర్‌తోపాటు టోర్నీ నిర్వాహకులకు క్షమాపణలు చెప్పాడు. టెన్నిస్ స్టార్స్ నొవాక్ జకోవిచ్, ఆండీ ముర్రేలు జ్వెరెవ్ తీరును తప్పుబట్టారు. అతనిపై నిర్వహకులు విధించిన శిక్ష సరైందేనని ట్వీట్ చేశారు.