న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Women’s National Boxing Championships: నిఖత్ జరీన్ పసిడి పంచ్..!

Womens National Boxing Championships: Nikhat Zareen and Lovlina Borgohain win gold medals

భోపాల్‌: వరల్డ్‌ చాంపియన్‌, తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్‌ జరీన్‌ మరోసారి తన పంచ్ పవర్‌తో ఫిదా చేసింది. ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న నిఖత్ సీజన్‌కు గోల్డెన్ ఫినిషింగ్ ఇచ్చింది. జాతీయ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్టార్ మరోసారి గోల్డ్ మెడల్‌తో మెప్పించింది. సోమవారం జరిగిన 50 కిలోల విభాగం ఫైనల్లో తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ 4-1తో అనామిక (రైల్వేస్)పై గెలిచింది. ఆరంభ రౌండ్లలో ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైనా..

ఆఖరి రౌండ్‌లో సత్తాచాటిన నిఖత్‌ ఈ చాంపియన్‌షిప్‌లో తొలి స్వర్ణాన్ని సొంతం చేసుకొంది. ఈ ఏడాదిలో అద్భుత ప్రదర్శనతో మూడు అంతర్జాతీయ పసిడి పతకాలు సాధించిన జరీన్‌.. జాతీయ చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌ మెడల్‌తో కొత్త సంవత్సరంలోకి గ్రాండ్‌గా అడుగుపెట్టనుంది. జాతీయ చాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్‌కు ఇదే తొలి పసిడి కావడం విశేషం. 75 కిలోల తుది బౌట్‌లో లవ్లీనా (అసోం) 5-0తో అరుంధతి చౌదరిపై విజయం సాధించింది.

చాంపియన్‌గా రైల్వేస్ టీమ్

చాంపియన్‌గా రైల్వేస్ టీమ్

కాగా, 48 కిలోల్లో రైల్వేస్‌ బాక్సర్‌ మంజూ రాణి 5-0తో కలైవాణి (తమిళనాడు)పై, 57 కిలోల్లో మనీషా (హరియాణా) 5-0తో వినాక్షి (హిమాచల్‌)పై, 66 కిలోల్లో మంజు బంబోరియా 4-1తో అనుక్షిత బోరో (అసోం)పై, 70 కిలోల్లో సనమచ చాను (మణిపూర్‌) 3-2తో శ్రుతి యాదవ్‌ (మధ్యప్రదేశ్‌)పై, 81 కిలోల కేటగిరిలో హరియాణా బాక్సర్‌ సవీటి 5-0తో అనుపమ (రైల్వేస్‌)పై గెలిచి బంగారు పతకాలు దక్కించుకొన్నారు. 60 కిలోల కేటగిరీలో పంజాబ్‌కు చెందిన సిమ్రన్‌ జిత్‌ కౌర్‌ 2-3తో పూనమ్‌ (రైల్వేస్‌) చేతిలో ఓటమి పాలైంది. మొత్తం 10 పతకాలు సాధించిన రైల్వేస్‌ బోర్డు ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ ట్రోఫీని సొంతం చేసుకొంది.

తిరుగులేని బాక్సర్‌గా నిఖత్ జరీన్..

తిరుగులేని బాక్సర్‌గా నిఖత్ జరీన్..

నిఖత్ జరీన్‌కు ఈ ఏడాది ఎంతో కలిసొచ్చింది. 2022లో బరిలోకి దిగిన ప్రతీ టోర్నీలో, ప్రతీ బౌట్‌లో తెలంగాణ బాక్సర్ గెలవడం విశేషం. గాయం నుంచి కోలుకొని ఫిబ్రవరిలో ప్రతిష్టాత్మక స్టాంజు మెమోరియల్ టోర్నమెంట్‌లో గోల్డ్ మెడల్‌తో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చింది. ఈ టోర్నీలో రెండు సార్లు బంగారు పతకం గెలిచిన భారత్ తొలి మహిళల బాక్సర్‌గా హిస్టరీ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఆగస్టులో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ పేరు మార్మోగిపోయింది. టాప్ క్లాస్ ఆటతో ఎదురైన ప్రత్యర్థినల్లా మట్టికరిపిస్తూ వరల్డ్ చాంపియన్ అయ్యింది. ఆపై, వెయిట్ కేటగిరీ మార్చుకొని ఆగస్టులో కామన్వెల్త్ గేమ్స్‌లో బరిలోకి దిగిన నిఖత్ ఫామ్ కొనసాగించింది. అలవోకగా గోల్డ్ మెడల్ సొంతం చేసుకొని మరింత పేరు తెచ్చుకుంది.

అపురూపమైన సంవత్సరం..

అపురూపమైన సంవత్సరం..

ఈ విజయంపై నిఖత్ జరీన్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ ఏడాది అద్భుతంగా సాగిందని పేర్కొంది. 'ఇది నాకుఎంతో అపురూపమైన సంవత్సరం. వరుసగా మూడు ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నా. ఇప్పుడు ఎలైట్ విమెన్స్ నేషనల్ బాక్సింగ్‌లో గోల్డ్ నెగ్గి ఈ ఏడాదిని ముగిస్తున్నా. నా కోచ్‌లు జాన్ వార్‌బర్ధన్, భాస్కర్ భట్, స్పాన్సర్లు ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ లేకపోతే ఈ ఏడాదిని ఓటమి లేకుండా ముగించడం సాధ్యం అయ్యేది కాదు.'అని నిఖత్ జరీన్ చెప్పుకొచ్చింది.

Story first published: Tuesday, December 27, 2022, 8:10 [IST]
Other articles published on Dec 27, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X