For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి టెస్టు: విండీస్ పేసర్ల విజృంభణ.. ఆదుకున్న రహానే

India Vs West Indies 1st Test : Ajinkya Rahane Leads India's Resistance With Fifty|| Oneindia Telugu
West Indies vs India, 1st Test: Ajinkya Rahane leads Indias resistance with fifty

అంటిగ్వా: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్‌ ఆడుతున్న భారత్‌ తడబడింది. ఆతిథ్య విండీస్‌ పేస్ బౌలర్లు విజృంభించడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ఆశించిన రీతిలో సాగలేదు. దీంతో టీ20, వన్డే సిరీస్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్‌కు తొలి రోజు గట్టి సవాలే ఎదురైంది. అయితే వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే (81; 163బంతుల్లో 10×4) అర్ధ సెంచరీ చేయగా.. కేఎల్‌ రాహుల్‌ (44; 97బంతుల్లో 5×4) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో భారత్‌ మొదటి రోజు ఆరు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.

ఆరంభంలోనే షాక్:

వర్షం కారణంగా టాస్‌ ఆలస్యమైంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. విండీస్‌ బౌలర్లు రోచ్‌, గాబ్రియెల్‌ ధాటికి 25 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్ (5) రోచ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మొదట ఫీల్డ్ అంపైర్‌ ఔట్‌ ఇవ్వకున్నా.. విండీస్‌ రివ్యూ కోరి సక్సెస్ అయింది. రోచ్‌ అదే ఓవర్లో పుజారాను కూడా పెవిలియన్ చేర్చాడు. అప్పటికి స్కోరు కేవలం 7 పరుగులే. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ విరాట్ కోహ్లీ రెండు ఫోర్లు కొట్టి ఊపుమీద కనిపించినా.. గాబ్రియెల్‌ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.

నిలబెట్టిన రాహుల్:

నిలబెట్టిన రాహుల్:

ఒకవైపు వికెట్లు పడుతున్నా మరో ఓపెనర్ రాహుల్ మాత్రం అద్భుతంగా రాణించాడు. రహానే కూడా రాహుల్‌తో కలిసి ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఈ ఇద్దరు మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడడంతో లంచ్‌ సమయానికి భారత్‌ 68/3తో నిలిచింది. లంచ్ అనంతరం రాహుల్‌, రహానే ఇద్దరూ వికెట్లను కాచుకొని మరిన్ని పరుగులు జోడించారు. అయితే చేజ్‌ బౌలింగ్‌లో రాహుల్‌ ఔట్‌ కావడంతో.. 68 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది.

ఆదుకున్న రహానే:

ఆదుకున్న రహానే:

అనంతరం రహానేకు హనుమ విహారి తోడవడంతో ఇన్నింగ్స్‌ గాడిలో పడింది. ఈ క్రమంలోనే రహానే అర్ధ సెంచరీ పూర్తి చేసాడు. ఈ సమయంలో వరుణుడు అడ్డుపడ్డా టీ విరామం తర్వాత మళ్లీ క్రీజులోకి వచ్చిన ఈ జోడీ విండీస్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. చక్కగా బ్యాటింగ్ చేస్తున్న విహారి.. రోచ్‌ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఈ జోడి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. కాసేపటికే రహానే కూడా గాబ్రియెల్‌ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. పంత్‌ (20), జడేజా (3) మరో వికెట్‌ పడకుండా చూసుకున్నారు. ఈ దశలో వరుణుడు మళ్లీ ఆటంకం కలిగించాడు. దీంతో అంపైర్లు తాత్కాలిక విరామం ప్రకటించారు. కాసేపటికే వర్షం ఆగినా.. వాతావరణం సహకరించకపోవడంతో మరో సెషన్‌ మిగిలి ఉండగానే తొలి రోజు ఆటను నిలిపేశారు.

Story first published: Friday, August 23, 2019, 7:43 [IST]
Other articles published on Aug 23, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+