Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సైనిక సేవ ముగిసింది.. రాజకీయ నాయకుడిగా ధోనీ కొత్త అవతారం!!

MS Dhoni Busy With Shoots After Return From Jammu And Kashmir || Oneindia Telugu
MS Dhoni busy after his return from Jammu Kashmir, currently he is in Mumbai for commercial commitments

ముంబై: లెహ్‌లో సైనిక విధులు ముగించుకొన్న టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ కొత్త అవతారం ఎత్తాడు. మహీ ఖద్దరు దుస్తులు ధరించి రాజకీయ నాయకుడిగా మారిపోయిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. దీంతో క్రికెట్‌కు వీడ్కోలు పలికి మహీ.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాడా? అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఈ అనుమానాలు కేవలం అపోహలు మాత్రమే అని తేలింది. అసలు విషయంలోకి వెళితే.

యాడ్‌ షూటింగ్‌ కోసం ముంబై:

వెస్టిండీస్‌ పర్యటనకు రెండు నెలలు విరామం ప్రకటించిన మహీ.. భారత సైన్యంలో చేరి విధులు నిర్వర్తించిన విషయం తెలిసిందే. లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ అయిన మహీ.. 15 రోజులు లెహ్‌లో విధులు నిర్వర్తించాడు. అక్కడ గార్డ్, పెట్రోలింగ్ లాంటి విధుల్లో భాగమయ్యాడు. తాజాగా విధుల నుండి విరామం తీసుకొన్న మహీ.. ఇంటికి తిరిగి వచ్చాడు. అనంతరం ఓ యాడ్‌ షూటింగ్‌ కోసం ముంబై వెళ్లాడు.

ప్రజాసేవ మొదలైంది:

యాడ్‌ షూటింగ్‌లో భాగంగా మహీ ఖద్దరు దుస్తులు ధరించి రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేసే కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. అనంతరం ఒక హోర్డింగ్‌పై మహీ రాజకీయ నాయకుడిగా దర్శనమిచ్చాడు. ఇది చూసిన అభిమానులు ఆ పోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. మహీ అభిమానులు వాటిని షేర్‌ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలు చూసిన అభిమానులు కెమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సైనిక సేవ ముగిసింది.. ప్రజాసేవ మొదలైంది అని ధోనీ అభిమానులు అంటున్నారు.

చివరి రోజున సియాచెన్‌కు:

మహీ కాశ్మీర్‌లో పెట్రోలింగ్ మరియు గార్డు విధుల్లో బాగమయ్యాడు. మహీ అక్కడ ఒక సాధారణ సైనికుడి జీవితాన్ని గడిపాడు. అంతేకాదు అక్కడి సైన్యంతో వాలీ బాల్ ఆడడం, పాటలు పాడడం, ఉపన్యాసాలు ఇవ్వడం వంటివి చేసాడు. తన అనుభవాలను అక్కడి రెజిమెంట్‌ సభ్యులతో పంచుకున్నాడు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే లేహ్‌ను సందర్శించిన మహీ.. ఆగస్టు 15న ఫార్వర్డ్ పోస్టు వద్ద జాతీయ జెండాను ఎగురవేశాడు. విధుల్లో భాగంగా మహీ.. తన చివరి రోజున సియాచెన్ హిమానీ నదంను సందర్శించాడు. అక్కడ సైనికులు నివసించే క్లిష్ట పరిస్థితుల గురించి తెలుసుకున్నాడు.

Story first published: Friday, August 23, 2019, 11:09 [IST]
Other articles published on Aug 23, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+