న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

US Open: టీనేజర్ల దూకుడు.. సెమీస్‌లో లేలా, రదుకాను!

US Open: Leylah Fernandez and Emma Raducanu reaches semi-finals

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌లో కెనడా టీనేజ్ సంచలనం లేలా ఫెర్నాండెజ్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. అనామక క్రీడాకారిణిగా యూఎస్‌ ఓపెన్‌లో అడుగుపెట్టిన లేలా ఫెర్నాండెజ్‌ అద్భుత విజయాలతో వారం రోజుల్లోనే అందరూ తనవైపు దృష్టి సారించేలా చేసుకుంది. మహిళల సింగిల్స్‌లో 19 ఏళ్ల లేలా వరుసగా మూడో సంచలన విజయం సాధించి సెమీఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. మరోవైపు రెండో సీడ్‌ సబలెంకా (బెలారస్‌), క్వాలిఫయర్‌ ఎమ్మా రాడుకాను (బ్రిటన్‌) కూడా యూఎస్‌ ఓపెన్‌లో తొలిసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు.

స్వితోలినా చిత్తు..

స్వితోలినా చిత్తు..

బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 73వ ర్యాంకర్‌ లేలా 2 గంటల 24 నిమిషాల్లో 6-3, 3-6, 7-6 (7/5)తో ఐదో సీడ్‌ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్‌)ను ఓడించింది. తద్వారా తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకుంది. స్వితోలినాతో జరిగిన మ్యాచ్‌లో లేలా కీలక సందర్భాల్లో సుదీర్ఘ ర్యాలీల్లో పైచేయి సాధించింది. మ్యాచ్‌ మొత్తంలో ఒకే ఏస్‌ సంధించిన లేలా నెట్‌ వద్దకు 24 సార్లు దూసుకొచ్చి 19 సార్లు పాయింట్లు గెలవడం గమనార్హం.

 రదుకాను సునాయాసంగా..

రదుకాను సునాయాసంగా..

ఇతర క్వార్టర్‌ ఫైనల్స్‌లో.. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో బ్రిటన్‌కు చెందిన రదుకాను 6-3, 6-4తో 11వ సీడ్‌ బెలిండాపై వరుస సెట్లలో గెలిచింది. దాంతో యూఎస్‌ ఓపెన్‌లో సెమీస్‌ చేరిన తొలి క్వాలిఫయర్‌గా రదుకాను చరిత్ర సృష్టించింది. తొలి సెట్‌ తొలి గేమ్‌లోనే ఎమ్మా సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన బెలిండా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ నెమ్మదిగా పుంజుకొన్న రదుకాను ఆరో గేమ్‌లో స్విస్‌ ప్లేయర్‌ సర్వీ‌స్‌ను బ్రేక్‌ చేసి 3-3తో సమం చేసింది. అదే జోరులో 6-3తో తొలి సెట్‌ను సొంతం చేసుకొంది. రెండో సెట్‌లో బెలిండా పుంజుకొనే ప్రయత్నం చేసినా.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వని రదుకాను 6-4తో ఆ సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. రెండో సీడ్‌ సబలెంకా (బెలారస్‌) 6-1, 6-4తో ఈ ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్, ఎనిమిదో సీడ్‌ క్రిచికోవా (చెక్‌ రిపబ్లిక్‌)ను ఓడించింది.

ఫిలిక్స్‌ తొలిసారి...

ఫిలిక్స్‌ తొలిసారి...

పురుషుల సింగిల్స్‌లో 12వ సీడ్‌ ఫిలిక్స్‌ ఉజెర్‌ అలియాసిమ్‌ తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోరీ్నలో సెమీఫైనల్‌కు చేరాడు. తద్వారా యూఎస్‌ ఓపెన్‌ టోర్నీ చరిత్రలో పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్‌కు చేరిన తొలి కెనడా ప్లేయర్‌గా ఘనత వహించాడు. స్పెయిన్‌ టీనేజ్‌ సంచలనం కార్లోస్‌ అల్కారజ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో 21 ఏళ్ల ఫిలిక్స్‌ తొలి సెట్‌ను 6-3తో సొంతం చేసుకొని, రెండో సెట్‌లో 3-1తో ఆధిక్యం సాధించాడు. ఈ దశలో అల్కారజ్‌ గాయం కారణంగా మ్యాచ్‌ నుంచి వైదొలిగాడు.

మెద్వెదెవ్‌ జోరు..

మెద్వెదెవ్‌ జోరు..

పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్‌ మెద్వెదెవ్‌ టైటిల్‌కు రెండడుగుల దూరంలో నిలిచాడు. క్వార్టర్స్‌లో మెద్వెదెవ్‌ 6-3, 6-0, 4-6, 7-5తో బోటిక్‌ వాన్‌ జాండ్స్‌చుల్ప్‌ (డచ్‌)పై గెలిచాడు. మెద్వెదెవ్‌తో ఫెలిక్స్‌ సెమీస్‌ ఆడనున్నాడు.

Story first published: Thursday, September 9, 2021, 8:13 [IST]
Other articles published on Sep 9, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X