న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Union Budget 2023: క్రీడారంగంపై నిర్మలమ్మ కరుణ.. భారీగా పెరిగిన స్పోర్ట్స్ బడ్జెట్!

Union Budget 2023: Sports allocation at historic high ahead of Paris Olympics and Asian Games

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2023-24‌లో దేశ క్రీడారంగానికి భారీ కేటాయింపులు దక్కాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ క్రీడా రంగంపై కరుణ చూపించారు. బుధవారం ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లు క్రీడా రంగానికి రూ.3,397 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 334.72 కోట్లను అదనంగా కేటాయించారు. ఈ ఏడాది ఆసియా గేమ్స్‌తో పాటు వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో ఈ కేటాయింపులు జరిపినట్లు తెలుస్తోంది.

బడ్జెట్ చరిత్రలో క్రీడారంగానికి ఇంత బడ్జెట్ కేటాయించడం ఇదే ప్రథమం. గత బడ్జెట్‌లో క్రీడారంగానికి రూ.3.062.60 కోట్లు కేటాయించారు. గత ఐదేళ్లుగా క్రీడలకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. 2018-19లో రూ.2197 కోట్లు కేటాయించగా.. 2019-20లో రూ.2776 కోట్లు, 2020-21లో రూ.2826 కోట్లు కేటాయించిన ఎన్డీఏ ప్రభుత్వం 2021-22లో మాత్రం కరోనా కారణంగా రూ.2596 కోట్లు మాత్రమే కేటాయించింది. 2022-23లో రూ.3062 కోట్లకు పెంచగా.. ఇప్పుడు ఏకంగా రూ.3397 కోట్లు కేటాయించారు.

Union Budget 2023: Sports allocation at historic high ahead of Paris Olympics and Asian Games

ఆసియా గేమ్స్‌తో పారిస్ ఒలింపిక్స్‌కు క్రీడాకారులను సన్నదం చేయడానికి, వారి సౌకర్యాలు మరింత మెరుగుపరిచేందుకు ఈ కేటాయింపులు జరిపినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ బడ్జెట్‌ను ఖేలో ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్, నేషనల్ సర్వీ స్కీమ్, నేషనల్ స్పోర్ట్స్ డెవలెప్‌మెంట్ ఫండ్ పేరిట విభజించారు.

క్రీడా బడ్జెట్ 2023-24: రూ. 3,397.32

ఖేలో ఇండియా: రూ. 1,045 కోట్లు
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) : రూ. 785.52 కోట్లు
నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ : రూ. 325 కోట్లు
నేషనల్ సర్వీస్ స్కీమ్ : రూ. 325 కోట్లు
నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ : రూ. 15 కోట్లు

Story first published: Wednesday, February 1, 2023, 17:26 [IST]
Other articles published on Feb 1, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X