న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అప్పుడు జికా.. ఇప్పుడు కరోనా .. ఒలింపిక్స్‌పై కీలక ప్రకటన

Tokyo Olympics, Paralympics will be held as scheduled: Organisers confident despite Coronavirus threat

టోక్యో : యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఎఫెక్ట్ ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ గేమ్స్‌పై కూడా పడింది. చైనాలో వెలుగు చూసిన ఈ ప్రాణాంతక వైరస్ వేగంగా ఇతర దేశాలకు విస్తరిస్తుండటంతో మెగా ఈవెంట్ వాయిదాపడుతుందనే ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో గురువారం ఒలింపిక్స్ నిర్వాహకులు స్పందించారు. తాజా ప‌రిస్థితిని స‌మీక్షించి ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు.

అనుకున్న సమయానికే..
ఒలింపిక్స్ గేమ్స్, పారాలింపిక్స్ గేమ్స్ అనుకున్న స‌మ‌యానికి జ‌రుగుతాయని, వాయిదా అంటూ వ‌స్తున్న ఊహాగానాలను న‌మ్మ‌వ‌ద్ద‌న్నారు. అంత‌ర్జాతీయ పారాలింపిక్ క‌మిటీ (ఐపీసీ) అధికార ప్ర‌తినిధి క్రెయిగ్ స్పెన్స్ మాట్లాడుతూ.. చైనా అవ‌త‌ల చాలా కొద్ది మొత్తంలో క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌న్నారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ఓ) స‌లహాల‌ను తీసుకుని, వ‌చ్చే ఒలింపిక్స్‌ను నిర్వ‌హిస్తామని పేర్కొన్నారు.

నువ్వేం అంపైర్ సామీ.. ఇంత బిత్తిరి నిర్ణయమా?నువ్వేం అంపైర్ సామీ.. ఇంత బిత్తిరి నిర్ణయమా?

అప్పుడు జికా.. ఇప్పుడు కరోనా

అప్పుడు జికా.. ఇప్పుడు కరోనా

నాలుగేళ్ల కింద‌ట రియో ఒలింపిక్స్ జ‌రిగిన‌ప్పుడు కూడా జికా వైర‌స్.. గ‌డ‌గ‌డ‌లాడించింద‌ని క్రెయిగ్ గుర్తు చేశారు. ఆ టోర్నీలో అన్ని ర‌కాల జాగ్ర‌త్తలు తీసుకుని, విజ‌య‌వంతంగా మెగాటోర్నీని నిర్వాహించామ‌ని తెలిపారు. జ‌పాన్‌లో త్వ‌ర‌లో జ‌రిగే ఒలింపిక్స్‌లోనూ అన్ని ర‌కాల జాగ్ర‌త్తలు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఆందోళన చెందుతున్నాం.. కానీ

ఆందోళన చెందుతున్నాం.. కానీ

కరోనా వైరస్ వ్యాప్తిపట్ల టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రాణాంతక వైరస్ మెగాఈవెంట్ నిర్వహణకు అడ్డు తగులుతుందేమోనని భయంగా ఉందని జపనీస్ క్రీడల ఆర్గనైజింగ్ కమిటీ చీఫ్ తొషిరో ముటో తెలిపాడు. వీలైనంత తర్వగా ఈ వైరస్ నిర్మూలించబడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. అయితే షెడ్యూల్ ప్రకారమే ఒలింపిక్స్, పారాలింపిక్స్ జరుగుతాయని స్పష్టం చేశారు.

490 మంది మృతి..

490 మంది మృతి..

ఇప్పటికే ఈ వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. చైనాలో మొదలైన ఈ వైరస్ వేగంగా ఇతర దేశాలకు విస్తరిస్తోంది. చైనాలో కరోనావైరస్ బారినపడ్డ వారి సంఖ్య 24,300కు చేరుకోగా... చనిపోయినవారి సంఖ్య 490 దాటింది. మొత్తంగా ఈ మహమ్మారి 27 దేశాలకు విస్తరించింది. ఇక టోక్యో ఒలింపిక్స్ నిర్వహించనున్న జపాన్‌లో 40 మందికి ఈ వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ఇక

యశస్వి ఆటను సీక్రేట్‌గా చూసిన కోచ్‌‌

రోబోలతో ఆహ్వానం.. అలలపై ఆతిథ్యం

రోబోలతో ఆహ్వానం.. అలలపై ఆతిథ్యం

జ‌పాన్ రాజ‌ధాని టోక్యోలో జూలై 24 నుంచి ఆగ‌స్టు 9 వ‌ర‌కు ఒలింపిక్స్ గేమ్స్ జరగనున్నాయి. శతాబ్ధకాలం తర్వాత మెగా గేమ్స్ నిర్వహణ అవకాశం దక్కించుకున్న జపాన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. టెక్నాలజీకి మారుపేరైన జపాన్.. మెగా ఈవెంట్‌కు హాజరయ్యే అతిథులు, అథ్లెట్లకు రోబోలతో ఆహ్వానం పలకనుంది. సముద్ర తీరప్రాంతంలో క్రూయిజ్ లైనర్లను హోటళ్లుగా ఉపయోగిస్తూ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే రూ.8900 కోట్లతో కొత్త స్టేడియాన్ని సిద్ధం చేసింది.

Story first published: Thursday, February 6, 2020, 21:53 [IST]
Other articles published on Feb 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X