న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యశస్వి ఆటను సీక్రేట్‌గా చూసిన కోచ్‌‌

Yashasvi Jaiswals coach and father figure watches from the stands

హైదరాబాద్ : అండర్-19 సెంచరీ హీరో యశస్వి జైస్వాల్‌ను తీర్చిదిద్దిన కోచ్ జ్వాలా సింగ్ తన శిష్యుడి ఆటను రహస్యంగా చూస్తున్నాడు. అతను సౌతాఫ్రికా వచ్చిన విషయం యశస్వీకి ఏ మాత్రం తెలియదు. ఎందుకంటే జ్వాలా సింగ్‌‌ను సౌతాఫ్రికా రావొద్దని యశస్వినే చెప్పాడు. అయినా శిష్యుడి ఆటను చూడలేకుండా ఉండలేకపోయిన జైస్వాల్ సీక్రేట్‌గా సౌతాఫ్రికా వచ్చాడు. ఇక జ్వాలాతో యశస్వీ తండ్రి కూడా కొడుకు ఆటను దొంగచాటున చూస్తూ మురిసిపోతున్నాడు.​

కొత్త కారు ఇస్తానన్నా..

కొత్త కారు ఇస్తానన్నా..

ఈ టోర్నీలో టాప్‌‌ స్కోరర్‌‌గా నిలవాలని యశస్వితో ప్రామిస్‌‌ చేయించుకున్నానని జ్వాలా సింగ్‌‌ ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇ‌న్‌ఫో‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. అలా చేస్తే కొత్త కారు కొనిస్తానని అతనికి మాటిచ్చానన్నాడు. ‘అత్యధిక పరుగులు సాధిస్తే కారును బహుమతిగా ఇస్తానని హామీ ఇచ్చా. కానీ అతడు మాత్రం కొత్తది వద్దు.. నా పాతకారే కావాలన్నాడు. అప్పుడైనా నేను కొత్త కారు కొనుక్కుంటానని అతడి ఆలోచన' అని జ్వాలా సింగ్ తెలిపాడు. ప్రస్తుతం 312 రన్స్‌‌తో జైస్వాల్‌‌ టోర్నీలో లీడ్‌‌ స్కోరర్‌‌గా ఉన్న విషయం తెలిసిందే.

నా పుట్టిన తేదీనే అతని జెర్సీ నెంబర్...

నా పుట్టిన తేదీనే అతని జెర్సీ నెంబర్...

ఇక ఐపీఎల్‌లో రూ. 2.4 కోట్లు పలికిన యశస్వి ఏదైనా బహుమతి ఇచ్చాడా.. అని జ్వాలను ప్రశ్నించంగా ఓ నవ్వు నవ్వుతూ నా పుట్టిన రోజే అతని జెర్సీ అయింది. అంతకంటే ఇంకేం కావాలన్నాడు. ‘యశస్వీ జెర్సీ నెంబరు 23. అది నా పుట్టిన తేదీ. ఇంతకంటే ఏం కావాలి' అని సింగ్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ‘నా కుమార్తె పుట్టకముందు జైస్వాల్‌ ఒక్కడే. ఇప్పుడు అన్నయ్య అయ్యాడు. నా కూతురు కూడా అతడికి లక్కీ చార్మ్. ఆమె జన్మించిన రోజే అండర్‌-19 క్రికెట్‌లో యశస్వి డబుల్‌ సెంచరీ కొట్టాడు. జైస్వాల్‌ మెచ్యూరిటీ కొన్నిసార్లు తనకు కూడా అందదని కొనియాడాడు.

ఒక్కసారి కోప్పడ్డా..

ఒక్కసారి కోప్పడ్డా..

యశస్విపై కోప్పడిన సందర్భాలు చాలా తక్కువని జ్వాల సింగ్ తెలిపాడు. అయితే ఒక్కసారి చెప్పా పెట్టకుండా ఖరీదైన హెల్మెట్ కొనడంతో ఆగ్రహానికి గురయ్యానని గుర్తు చేసుకున్నాడు. ‘లోకల్ టోర్నీలో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవడంతో రూ. 10వేల నగదు బహుమతి ఇచ్చారు. హెల్మెట్‌ కొంటానని చెబితే సరేనన్నా. తర్వాత వచ్చి మరో 3వేలు కావాలని అడిగాడు. దీంతో నాకు పట్టరాని కోపం వచ్చింది. రూ. 13 వేల ఖరీదైన హెల్మెట్‌ నీకెందుకని మందలించా. అతడి నుంచి లాక్కొని.. ఇది పెట్టుకునే అర్హత సాధించినప్పుడే ఇస్తానని చెప్పా. అల్మారాలో ఉంచితే.. ప్రతీరోజూ దాన్ని చూసుకొనేవాడు. రంజీల్లో అరంగేట్రం చేసిన రోజు నేనే స్వయంగా ఆ హెల్మెట్‌ను అతడికిచ్చా. అప్పుడే అతడి పట్టుదల అర్థమైందని'జ్వాలా చెప్పుకొచ్చాడు.

జ్వాల కంట పడడంతో..

జ్వాల కంట పడడంతో..

ఉండటానికి వసతి లేక.. తినడానికి తిండి లేక.. ఆకలితో అలమటిస్తు.. మరోవైపు పరుగుల మోత మోగిస్తున్న యశస్వి గాథ స్థానిక కోచ్‌‌గా జ్వాలా సింగ్‌‌కు తెలిసింది.

యశస్విలాంటి నేపథ్యంతోనే అదే ఉత్తర ప్రదేశ్‌ నుంచి వచ్చి పెద్ద స్థాయికి చేరలేకపోయిన జ్వాలా సింగ్‌ అతనిలో తన ప్రతిరూపాన్ని చూసుకున్నాడు. తాను సాధించందని ఈ కుర్రాడితో నేరవేర్చుకోవాలని భావించి అతని ప్రోత్సాహించాడు. జ్వాలా సింగ్‌కు కూడా టీమిండియాకు ఆడాలనుకున్నాడు. కానీ మోకాలి గాయంతో ఆటను వదలి కోచ్‌గా మారాడు. మూడేళ్లపాటు ముంబై సెన్సేషన్ పృథ్వీ షాకు కూడా కోచింగ్‌ ఇచ్చాడు. ఇద్దరు శిష్యులను చూసుకొని ఎంతో గర్వపడతాడు.

Story first published: Thursday, February 6, 2020, 16:03 [IST]
Other articles published on Feb 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X