న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPL 2021 బాటలోనే విశ్వ క్రీడలు.. అదే జరిగితే పూర్తిగా రద్దు!

Tokyo Olympics: Japan Faces Longer State Of Emergency, Casting Doubt On Summer Games

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021‌ను దెబ్బకొట్టిన కరోనా.. మరో మెగా ఈవెంట్‌పై పంజా విసరబోతున్నది. ఇప్పటికే ఓసారి వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ పూర్తిగా రద్దయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. టోక్యో దాని చుట్టు పక్కలా ఉన్న మేజర్ అర్బన్ ప్రాంతాల్లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ మరికొన్ని రోజులు పొడిగించాలని జపాన్ గవర్నమెంట్ యోచిస్తున్నది. దీంతో సమ్మర్ ఒలింపిక్స్ నిర్వహణపై అనుమానాలు నెలకొన్నాయి. టోక్యో, ఒసాకా, కోట్యో, హోగోలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. గవర్నమెంట్ అఫీషియల్ ఎక్స్‌టెన్షన్‌పై దృష్టిపెట్టారని స్థానిక న్యూస్ పేపర్ ఒకటి కథనాన్ని ప్రచురించింది.

ఏప్రిల్ 25న విధించిన నిబంధనలను మరికొన్ని రోజులు పొడిగించడంతో పాటు స్థానిక అభిమానులను అనుమతించే విషయంపై అధికారులు తర్జన భర్జన పడుతున్న నేపథ్యంలో జులై 23న గేమ్స్ మొదలవ్వడం కష్టమేనని రాసుకొచ్చింది. ఎమర్జెన్సీ పొడిగింపు విషయంపై జపాన్ ప్రధాని సుగా బుధవారం సీనియర్ మినిస్టర్స్‌తో చర్చించారు. అయితే ఎమర్జెన్సీని ఎన్ని రోజులుగా పొడిగిస్తారన్న దానిపై కచ్చితమైన నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ.. కనీసం మూడు వారాల పాటు ఉండే అవకాశం ఉందని ఒసాకా గవర్నమెంట్ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంపై మాట్లాడేందుకు ప్రధాని ఆఫీస్‌కు ఫోన్ చేసినా రెస్పాన్స్ కాలేదని ఓ వార్తా సంస్థ వెల్లడించింది.

యాన్యువెల్ గోల్డెన్ వీక్స్ సందర్భంగా బుధవారం జపాన్ గవర్నమెంట్ ఆఫీస్, ఫైనాన్షియల్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. మరోవైపు ఒలింపిక్ నిర్వాహకులు మాత్రం గేమ్స్ రద్దుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. జూన్ ఎండ్ వరకు ఎంత మంది ఫ్యాన్స్ వస్తారన్న దానిపై ఓ అంచనాకు వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీలో భాగంగా టోక్యో ఇతర అర్భన్ ప్రాంతాల్లో రెస్టారెంట్స్, బార్స్, పెద్దపెద్ద డిపార్ట్‌మెంట్ స్టోర్స్, సినిమా హాల్స్‌ను మూసి వేయడంతో పాటు, బిగ్ స్పోర్టింగ్ ఈవెంట్స్‌ను రద్దు చేశారు.

Story first published: Thursday, May 6, 2021, 8:23 [IST]
Other articles published on May 6, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X