న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo 2020: భారత్ ఖాతాలో మరో పతకం.. ఫైనల్ చేరిన రెజ్లర్ రవికుమార్

Wrestler Ravi Kumar enters final

టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. స్టార్ రెజ్లర్ రవికుమార్ దహియా ఫైనల్ చేరి మెడల్ ఖాయం చేశాడు. బుధవారం జరిగిన రెజ్లింగ్ పురుషుల 57 కేజీల ఫ్రీ స్టైల్ సెమీఫైనల్లో రవికుమార్ కజకిస్థాన్‌ రెజ్లర్‌ సనయెన్‌ నురిస్లామ్‌ను చిత్తు చేశాడు. తొలి పిరియడ్‌లో వరుసగా 2 పాయింట్లు సాధించిన రవి 2-1తో ఆధిపత్యం కనబర్చాడు.

ఇక సెకండ్ పీరియడ్‌లో సనయోన్ నురిస్లామ్ ఉడుంపట్టుపట్టడంతో రవికుమార్ వరుసగా 9 పాయింట్లు కోల్పోయి వెనుకంజలో నిలిచాడు. సనయోన్.. రవికుమార్ పిక్కలను పట్టేసి మ్యాట్‌పై నాలుగుసార్లు దొర్లించాడు. దాంతో అతనికి వరుసగా 8 పాయింట్లు వచ్చాయి. ఆ తర్వాత తేరుకున్న రవికుమార్ ఉడుం పట్టుతో ప్రత్యర్థిని మ్యాట్ బయటకి ఎత్తిపడేసాడు.

దాంతో రవికుమార్ ఖాతాలో మూడు పాయింట్లు చేరగా ఆధిక్యం 5-9కి తగ్గింది. ఈ క్రమంలో కజకిస్థాన్ రెజ్లర్‌ కాలుకు గాయమైంది. ఇదే జోరులో చివరి నిమిషంలో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసిన రవికుమార్ 'బై ఫాల్'ప్రకారం బౌట్‌ను గెలిచి ఫైనల్ చేరాడు. రెజ్లింగ్‌లో ప్రత్యర్థి భుజాలను రెండు సెకండ్ల పాటు బిగపట్టి కింద ఉంచితే రిఫరీ ఫాల్‌గా గుర్తించి విజేతగా ప్రకటిస్తారు.

ఆ రూల్‌లో భాగంగానే ఆఖరి నిమిషంలో విజయం సాధించిన రవికుమార్ దహియా ఫైనల్ చేరి మెడల్ ఖాయం చేశాడు. తుదిపోరులో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన రష్యాకు చెందిన జవూర్ ఉగువ్‌తో గురువారం మధ్యాహ్నం రవికుమార్‌ దహియా పోటీపడనున్నాడు.

ఒకవేళ ఫైనల్లో రవికుమార్ ఓడినా భారత్‌కు రజతం దక్కుతుంది. దాంతో ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచి నాలుగో రెజ్లర్‌గా రవికుమార్ దహియా గుర్తింపు పొందాడు. 1952 ఒలింపిక్స్‌లో కేడీ జాదవ్ భారత్‌కు బ్రాంజ్ మెడల్ అందించగా.. సుశీల్ కుమార్ 2008లో కాంస్యం, 2012‌లో రజత పతకం అందించాడు. 2008లో యోగేశ్వర్ దత్ కాంస్యం అందించాడు.

ఇప్పుడు ఈ జాబితాలో సుశీల్ కుమార్ చేరనున్నాడు. ఫైనల్లో కూడా గెలిస్తే గోల్డ్ మెడల్ గెలిచిన తొలి భారత రెజ్లర్‌గా చరిత్ర సృష్టిస్తారు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచిన తొలి పురుష అథ్లెట్‌ కూడా రవికుమారే.

Story first published: Wednesday, August 4, 2021, 15:43 [IST]
Other articles published on Aug 4, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X