న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo Olympics 2021: భారత అథ్లెట్లకు ‘ధ్యాన రింగ్స్’

 The Indian Olympic Association (IOA) announced a partnership with Dhyana, the startup behind the smart ring that measures the quality of meditation which was developed by chief national badminton coach Pullela Gopichand and the Oxford University alumni and biomedical technology entrepreneur Bhairav Shankar. The IOA has acquired smart Dhyana rings and its health management services for the entire Indian contingent headed for the Tokyo Olympics and is working together to prioritise mental wellness and improve focus of the athletes amidst the ongoing pandemic. The smart Dhyana ring is capable of measuring ‘mindful minutes’, or the amount of time any person is actually focusing during a meditation session.

హైదరాబాద్‌: టోక్యో ఒలింపిక్స్‌‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అథ్లెట్లకు ధ్యాన రింగ్స్ అందించనున్నారు. ఓ వ్యక్తి ఎంత సేపు కచ్చితంగా మెడిటేషన్‌లో ఉన్నారనే అంశాన్ని ధ్యాన రింగ్స్ లెక్కించి చెబుతాయి. ఈ ఎలాక్ట్రానిక్ గాడ్జెట్ హార్ట్ బీట్స్, బ్రీతింగ్, ఫోకస్, రిలాక్సేషన్ అంశాల ఆధారంగా రేటింగ్ ఇస్తుంది. ఒలింపిక్స్ వెళ్లే క్రీడాకారుల మానసిక ఆరోగ్యం కోసం భారత బ్యాడ్మింటన్ హెడ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌ మార్గనిర్దేశనంలోని 'ధ్యాన'తో భారత ఒలింపిక్‌ అసోసియేషన్ (ఐఓఏ) చేతులు కలిపింది.

ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులకు ధ్యాన అధికారిక మెడిటేషన్‌ భాగస్వామిగా వ్యవహరించనుంది. ఒలింపిక్స్‌ వంటి మెగా టోర్నీలో క్రీడాకారులు, కోచ్‌లు, సహాయ సిబ్బంది ఒత్తిడిని అధిగమించేందుకు ఈ ధ్యాన పరికరం సహాయ పడనుంది. ఒలింపిక్స్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరి కోసం మెడిటేషన్‌ ఉంగరాలు, కిట్‌లను ఐఓఏ తీసుకుంది. ఇప్పటికే ఈ ధ్యాన రింగ్స్‌ను గోపిచంద్ అకాడమీలో ఉపయోగిస్తున్నారు. దీని సాయంతో స్టూడెంట్స్ తమ గోల్ దిశగా నడిచేలా చేస్తున్నాడు. ఇప్పుడు ఇవే రింగ్స్‌ను టోక్యో వెళుతున్న మన అథ్లెట్లకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) అందజేయనుంది.

ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో క్రీడాకారుల మానసిక ఆరోగ్యం.. ఏకాగ్రత మెరుగుపరచడం కోసమే ధ్యానతో చేతులు కలిపినట్లు ఐఓఏ ప్రకటించింది. ''అసాధారణ పరిస్థితుల్లో జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో కఠినమైన సవాళ్లు ఎదురవ్వొచ్చు. ఆటగాడిగా, కోచ్‌గా ధ్యానంతో ఎన్నో ప్రయోజనాలు పొందాను. మెడిటేషన్‌ తీవ్రతను పక్కాగా తెలియజేయడం ద్వారా టోక్యోలో భారత బృందానికి ధ్యాన ఎంతగానో ఉపయోపడుతుంది'' అని గోపీచంద్‌ తెలిపాడు. ఒలింపిక్స్ గేమ్స్‌లో మెడిటేషన్ పార్టనర్‌ను నియమించుకున్న తొలి దేశంగా భారత్ నిలిచింది.

Story first published: Tuesday, July 13, 2021, 8:11 [IST]
Other articles published on Jul 13, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X