న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

National Sports Awards 2021: మన్‌ప్రీత్‌కు ఖేల్ రత్న.. శిఖర్ ధావన్‌‌కు అర్జున!

National Sports Awards 2021: Manpreet Singh added to Khel Ratna winners list

న్యూఢిల్లీ: భారత పురుషుల హాకీ టీమ్ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ ఏడాదికి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ముకుందకమ్‌ శర్మ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ 11 మంది పేర్లను ఈ అవార్డు కోసం ప్రతిపాదించగా క్రీడల మంత్రిత్వ శాఖ భారత హాకీ కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ పేరునూ జాబితాలో చేర్చింది. దాంతో అత్యున్నత క్రీడల పురస్కారం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న ఈసారి పన్నెండు మందిని వరించింది. మంగళవారం విజేతల వివరాలను క్రీడా మంత్రిత్వశాఖ ప్రకటించింది. మొదట మన్‌ప్రీత్‌ పేరును అర్జున అవార్డుకు పరిగణించారు. టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి కాంస్యం దక్కడంలో కీలకంగా వ్యవహరించిన గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌తో పాటు మన్‌ప్రీత్‌ అత్యున్నత క్రీడా పురస్కారం అందుకోనున్నాడు.

ధావన్‌కు అర్జున..

ధావన్‌కు అర్జున..

తెలుగుతేజం, దిగ్గజ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌, నీరజ్‌ చోప్రా ఈ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈసారి ఖేల్‌రత్న అవార్డు పొందినవాళ్లలో మిథాలీరాజ్‌ (క్రికెట్‌), సునీల్‌ ఛెత్రి (ఫుట్‌బాల్‌) మినహా మిగతావాళ్లంతా టోక్యో ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌లో దేశానికి పతకాలు అందించినవాళ్లే. భారత్‌ ఈసారి ఒలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో 7 పతకాలు, పారాలింపిక్స్‌లో 19 పతకాలు నెగ్గింది. ఇక టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్‌‌ను అర్జున అవార్డు వరించింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన హాకీ జట్టులో గతంలో అర్జున పొందని ఆటగాళ్లందరినీ అర్జున అవార్డుకు ఎంపిక చేశారు. ఈ ఏడాది పది మందికి 'ద్రోణాచార్య' అవార్డు... ఐదుగురికి 'ధ్యాన్‌చంద్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌' అవార్డు ఇవ్వనున్నారు. నవంబరు 13న రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విజేతలకు అవార్డులను ప్రదానం చేయనున్నారు.

అవార్డుల వివరాలు

అవార్డుల వివరాలు

మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న: నీరజ్‌ చోప్రా (అథ్లెటిక్స్‌), రవికుమార్‌ (రెజ్లింగ్‌), లవ్లీనా (బాక్సింగ్‌), శ్రీజేశ్‌ (హాకీ), అవని (పారా షూటింగ్‌), సుమిత్‌ అంటిల్‌ (పారా అథ్లెటిక్స్‌), ప్రమోద్‌ భగత్‌ (పారా బ్యాడ్మింటన్‌), కృష్ణ నగార్‌ (పారా బ్యాడ్మింటన్‌), మనీష్‌ నర్వాల్‌ (పారా షూటింగ్‌), మిథాలీరాజ్‌ (క్రికెట్‌), సునీల్‌ ఛెత్రి (ఫుట్‌బాల్‌), మన్‌ప్రీత్‌ సింగ్‌ (హాకీ)

అర్జున అవార్డు లిస్ట్:

అర్జున అవార్డు లిస్ట్:

అర్పిందర్‌ (అథ్లెటిక్స్‌), సిమ్రన్‌జీత్‌ కౌర్‌ (బాక్సింగ్‌), శిఖర్‌ ధావన్‌ (క్రికెట్‌), భవానీ (ఫెన్సింగ్‌), మౌనిక (హాకీ), వందన (హాకీ), సందీప్‌ నర్వాల్‌ (కబడ్డీ), హిమాని పరబ్‌ (మల్లకంబ్‌), అభిషేక్‌వర్మ (షూటింగ్‌), అంకిత రైనా (టెన్నిస్‌), దీపక్‌ పునియా (రెజ్లింగ్‌), దిల్‌ప్రీత్‌ (హాకీ), హర్మన్‌ప్రీత్‌ (హాకీ), రూపీందర్‌ (హాకీ), సురేందర్‌ (హాకీ), అమిత్‌ (హాకీ), బీరేంద్ర (హాకీ), సుమిత్‌ (హాకీ), నీలకôఠ శర్మ (హాకీ), హార్దిక్‌ సింగ్‌ (హాకీ), వివేక్‌ సాగర్‌ (హాకీ), గుర్జాంత్‌ (హాకీ), మన్‌దీప్‌ (హాకీ), షంషేర్‌ (హాకీ), లలిత్‌ కుమార్‌ (హాకీ), వరుణ్‌ కుమార్‌ (హాకీ), సిమ్రత్‌జీత్‌ సింగ్‌ (హాకీ), యోగేశ్‌ (పారా అథ్లెటిక్స్‌), నిషధ్‌ కుమార్‌ (పారా అథ్లెటిక్స్‌), ప్రవీణ్‌ కుమార్‌ (పారా అథ్లెటిక్స్‌), భవీనా పటేల్‌ (పారా టీటీ), హర్వీందర్‌ సింగ్‌ (పారా ఆర్చరీ), శరద్‌ కుమార్‌ (పారా అథ్లెటిక్స్‌), సుహాస్‌ (పారా బ్యాడ్మింటన్‌), సింగ్‌రాజ్‌ (పారా షూటింగ్‌).

ద్రోణాచార్య జీవిత సాఫల్య పురస్కారం:

ద్రోణాచార్య జీవిత సాఫల్య పురస్కారం:

టీ.పీ.ఉసెప్‌ (అథ్లెటిక్స్‌), సర్కార్‌ తల్వార్‌ (క్రికెట్‌), సర్పాల్‌సింగ్‌ (హాకీ), అషాన్‌కుమార్‌ (కబడ్డీ), తపన్‌ కుమార్‌ (స్విమ్మింగ్‌); రెగ్యులర్‌ ద్రోణాచార్య: రాధాకృష్ణన్‌ (అథ్లెటిక్స్‌), సంధ్య (బాక్సింగ్‌), ప్రీతమ్‌ (హాకీ), జైప్రకాశ్‌ (పారా షూటింగ్‌), రామన్‌ (రెజ్లింగ్‌); ధ్యాన్‌చంద్‌ జీవిత సాఫల్య పురస్కారం: లేఖ (బాక్సింగ్‌), అభిజీత్‌ కుంతే (చెస్‌), దేవేందర్‌ (హాకీ), వికాస్‌ (కబడ్డీ), సజ్జన్‌ సింగ్‌ (రెజ్లింగ్‌)

Story first published: Wednesday, November 3, 2021, 8:19 [IST]
Other articles published on Nov 3, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X