న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆడే మూడ్.. ఉత్సాహం సర్వనాశనం అయింది.. నేను ఆడనుపో: క్రీడా దిగ్గజం

Magnus Carlsen decides not to defend World Chess Championship title

లండన్‌: చెస్ క్రీడలోనే అత్యున్నత టోర్నీ అయిన వరల్డ్ చెస్‌ ఛాంపియన్‌షిప్‌‌కు దూరంగా ఉంటానని నార్వే చెస్ లెజెండ్, వరల్డ్ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్ ప్రకటించాడు. ప్రతీసారి తానే గెలుస్తుండటంతో తనకు బోర్ కొడుతుందని తెలిపాడు. 2013 నుంచి రికార్డు స్థాయిలో అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ నెగ్గిన కార్ల్‌సన్‌.. వచ్చే ఏడాది ఈ మ్యాచ్‌లో ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. తనకు ఈ టోర్నీలో ఆడేందుకు కావాల్సిన ప్రేరణ లభించట్లేదని పేర్కొన్నాడు. ఆడే మూడ్.. ఉత్సాహం సర్వనాశనమైందని తెలిపాడు.

ఆడే మూడ్ లేదు...

ఆడే మూడ్ లేదు...

'నాకు మరో మ్యాచ్‌ ఆడేందుకు కావాల్సిన ప్రేరణ లభించట్లేదు. కొత్తగా నేనేం సాధిస్తాననే భావన కలుగుతోంది. ఇది నాకు నచ్చట్లేదు. కొన్ని చారిత్రక కారణాల వల్ల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ మ్యాచ్‌పై అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. కానీ నాకైతే అందులో ఆడేందుకు ఎలాంటి ఆసక్తి లేదు. అందుకే దూరం కావాలని అనుకుంటున్నా. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ నుంచి నేను దూరం కావాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నా.

ఆటకు గుడ్‌బై చెప్పడం లేదు..

ఆటకు గుడ్‌బై చెప్పడం లేదు..

భవిష్యత్తులో ఇందులోకి పునరాగమనం చేసే అవకాశాలను కొట్టిపారేయలేను. అయితే ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నా. నేను చెస్‌ నుంచి రిటైర్‌ కావట్లేదు. ఆటలో చురుగ్గానే ఉంటా. ఇప్పుడు గ్రాండ్‌ చెస్‌ టూర్‌ కోసం క్రొయేషియాకు వెళ్లబోతున్నా. అక్కడి నుంచి చెస్‌ ఒలింపియాడ్‌ ఆడేందుకు చెన్నైకి చేరుకుంటా. అది చాలా ఆసక్తికరమైన టోర్నీ'' అని ఒక పాడ్‌కాస్ట్‌లో కార్ల్‌సన్‌ ప్రకటించాడు.

సరైన పోటీ లేకే..

సరైన పోటీ లేకే..

2013 నుంచి ప్రతిసారీ ఎదురే లేకుండా తనే గెలుస్తుండడంతో కార్ల్‌సన్‌కు ఈ అత్యున్నత చెస్‌ టోర్నీపై ఆసక్తి పోయినట్లుగా తెలుస్తోంది. 2013లో విశ్వనాథన్‌ ఆనంద్‌ను ఓడించి కార్ల్‌సన్‌ తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌ అయ్యాడు. అప్పటికతని వయసు 22 ఏళ్లే. తర్వాతి ఏడాది కూడా ఆనంద్‌ను ఓడించి రెండో టైటిల్‌ ఖాతాలో వేసుకున్న మాగ్నస్‌.. ఆపై 2016లో కర్జాకిక్‌, 2018లో కరువానా, 2021లో నెపోనియాచిలపై విజయం సాధించాడు. 2011 నుంచి ప్రపంచ నంబర్‌వన్‌గా కొనసాగుతుండమే కాదు.. ప్రపంచ చెస్‌ చరిత్రలోనే అత్యధిక ఎలో రేటింగ్‌ (2882)ను సాధించిన ప్లేయర్‌గానూ అతను అరుదైన ఘనత అందుకున్నాడు.

అధికారిక సమాచారం ఇవ్వలేదు..

అధికారిక సమాచారం ఇవ్వలేదు..

వచ్చే ఏడాది జరగాల్సిన తర్వాతి ఛాంపియన్‌షిప్‌లో కార్ల్‌సన్‌ను.. క్యాండిడేట్స్‌ టోర్నీ విజేత నెపోనియాచి ఢీకొనాల్సింది. కార్ల్‌సన్‌ తప్పుకోవడంతో క్యాండిడేట్స్‌ టోర్నీ రన్నరప్‌ డింగ్‌ లిరెన్‌తో నెపోనియాచి ప్రపంచ టైటిల్‌ కోసం తలపడే అవకాశముంది. కార్ల్‌సన్‌ ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ఇంకా తమకు అధికారికంగా సమాచారం ఇవ్వలేదని ఫిడె వెల్లడించింది. అయితే అతనే నిర్ణయం తీసుకున్నా తాము గౌరవిస్తామని పేర్కొంది.

Story first published: Thursday, July 21, 2022, 9:04 [IST]
Other articles published on Jul 21, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X