ఫార్ములావన్‌ రారాజుకే విశ్వ కిరీటం.. షుమాకర్‌ రికార్డు సమం చేసిన హామిల్టన్‌

ఇస్తాంబుల్‌: ఫార్ములావన్‌ (ఎఫ్‌1) క్రీడలో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్న బ్రిటన్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ తన కెరీర్‌లో మరో మైలురాయి అందుకున్నాడు. ఎఫ్‌1 దిగ్గజం మైకేల్‌ షుమాకర్‌ పేరిట ఉన్న మరో రికార్డును ఈ మెర్సిడెస్‌ డ్రైవర్‌ సమం చేశాడు. ఆదివారం జరిగిన టర్కీ గ్రాండ్‌ప్రి రేసులో హామిల్టన్‌ విజేతగా నిలిచాడు. నిర్ణీత 58 ల్యాప్‌ల ఈ రేసును ఆరో స్థానం నుంచి ప్రారంభించిన హామిల్టన్‌ అందరికంటే వేగంగా గంటా 42 నిమిషాల 19.313 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని పొందాడు. హామిల్టన్‌ కెరీర్‌లో ఇది ఏడో ప్రపంచ టైటిల్‌. తద్వారా ఏడు ప్రపంచ టైటిల్స్‌తో మైకేల్‌ షుమాకర్‌ (జర్మనీ) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును హామిల్టన్‌ సమం చేశాడు.

అనుష్క శర్మ పెంపుడు కుక్క 'విరాట్ కోహ్లీ'.. కాంగ్రెస్ లీడర్ సంచలన వ్యాఖ్యలు!

 ఫార్ములావన్‌ రారాజు..

ఫార్ములావన్‌ రారాజు..

2013లో మెర్సిడెస్‌ జట్టులో షుమాకర్‌ స్థానాన్ని భర్తీ చేసిన హామిల్టన్‌ అదే జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఆరుసార్లు ప్రపంచ టైటిల్‌ను దక్కించుకోగా... 2008లో మెక్‌లారెన్‌ తరఫున పోటీపడి హామిల్టన్‌ తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను అందుకున్నాడు. ఇటీవలే అత్యధికసార్లు ఎఫ్‌1 రేసుల్లో విజేతగా నిలిచిన షుమాకర్‌ (91 సార్లు) రికార్డును హామిల్టన్‌ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. మెర్సిడెస్‌కే చెందిన తన సహచరుడు వాల్తెరి బొటాస్‌ కంటే ముందుగా నిలిస్తే ప్రపంచ టైటిల్‌ను ఖాయం చేసుకునే పరిస్థితిలో ఆరో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన హామిల్టన్‌కు ఇతర డ్రైవర్ల వ్యూహాత్మక తప్పిదాలు కలిసొచ్చాయి. ఆరంభంలో దూకుడు కనబర్చని హామిల్టన్‌ సగం ల్యాప్‌లు పూర్తయ్యాక జోరు పెంచాడు. 35వ ల్యాప్‌లో తొలిసారి ఆధిక్యంలోకి వచ్చిన హామిల్టన్‌ చివరి ల్యాప్‌ వరకు కాపాడుకొని ఏకంగా 31 సెకన్ల తేడాతో విజయాన్ని అందుకున్నాడు.

 వరుసగా నాలుగో సారి..

వరుసగా నాలుగో సారి..

టర్కిష్‌ గ్రాండ్‌ ప్రీతో ఈ సీజన్‌లో పదో విజయాన్నందుకున్న 35 ఏళ్ల హామిల్టన్‌.. డ్రైవర్‌ కన్‌స్ట్రక్టర్స్‌ రేసులో మిగతా రేసర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా దూసుకెళ్లాడు. మొత్తం 307 పాయింట్లతో టాపర్‌గా నిలిచిన అతను.. ఈ ఏడాది మరో రెండు రేసులు మిగిలుండగానే ఎఫ్‌1 టైటిల్‌ను గెలుచుకున్నాడు. ప్రపంచ టైటిల్‌ రేసులో హామిల్టన్‌ పోటీదారుగా భావించిన మెర్సిడె్‌సకే చెందిన వెల్టారి బొటాస్‌ 197 పాయింట్లతో రెండోస్థానానికి పరిమితమయ్యాడు. కెరీర్‌లో తొలిసారిగా 2008లో ప్రపంచ చాంపియన్‌షిప్‌ గెలిచిన హామిల్టన్‌ 2014, 2015లో విజేతగా నిలిచాడు. ఆ తర్వాత 2017 నుంచి వరుసగా నాలుగోసారి ప్రపంచ టైటిల్‌ అందుకోవడం విశేషం.

హామిల్టన్‌ కంట కన్నీరు..

హామిల్టన్‌ కంట కన్నీరు..

ఏడోసారి ఎఫ్‌1 టైటిల్‌ గెలిచిన ఆనందంలో హామిల్టన్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సందర్భంగా అతను తన గతాన్ని గుర్తుచేసుకొని కంటతడి పెట్టుకున్నాడు. ‘ఐదేళ్ల ప్రాయంలో గో కార్టింగ్‌ మొదులపెట్టినప్పటి నుంచి బ్రిటిష్‌ చాంపియన్‌షిప్‌ గెలవడం, నాన్నతో కలిసి కారు నడపడం, మనమే చాంపియన్లం అంటూ పాడుకుంటూ వెళ్లడం.. తదితర సంఘటనలెన్నో గుర్తుకొచ్చాయి. ఈ భావోద్వేగాలను ఎంత నియంత్రించుకోవాలనుకున్నా నావల్ల కాలేదు. నా ఈ విజయాల్లో పాలుపంచుకున్న అందరికీ కృతజ్ఞతలు' అని హామిల్టన్‌ అన్నాడు.

 అత్యధిక ఎఫ్‌1 ప్రపంచ టైటిల్స్‌ నెగ్గిన డ్రైవర్లు

అత్యధిక ఎఫ్‌1 ప్రపంచ టైటిల్స్‌ నెగ్గిన డ్రైవర్లు

హామిల్టన్‌ (బ్రిటన్‌-7): 2008, 2014, 2015, 2017, 2018, 2019, 2020

షుమాకర్‌ (జర్మనీ-7) : 1994, 1995, 2000, 2001, 2002, 2003, 2004

ఫాంగియో (అర్జెంటీనా-5): 1951, 1954, 1955, 1956, 1957

అలైన్‌ ప్రాస్ట్‌ (ఫ్రాన్స్‌-4) : 1985, 1986, 1989, 1993

సెబాస్టియన్‌ వెటెల్‌ (జర్మనీ-4): 2010, 2011, 2012, 2013

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, November 16, 2020, 8:02 [IST]
Other articles published on Nov 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X