
తమను నిరాశకు గురిచేసింది..
ఉత్తర కొరియా నిర్ణయం తమను నిరాశకు గురిచేసిందని.. అంతర్ కొరియా సంబంధాలను మెరుగుపరిచేందుకు టోక్యో ఒలింపిక్స్ మంచి అవకాశంగా భావించినట్లు దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ తెలిపింది. దక్షిణ కొరియాలో జరిగిన 2018 వింటర్ ఒలింపిక్స్‌కు ఉత్తర కొరియా 22 మంది క్రీడాకారుల్ని పంపింది. క్రీడాకారులతో పాటు 230 మంది ప్రభుత్వ అధికారులు, కళాకారులు, విలేకరులు, చీర్‌లీడర్స్ కూడా వెళ్లారు. ఈ క్రీడల్లో ఏకీకృత కొరియాకు ప్రతీకగా నీలిరంగు పటం కింద ఇరుదేశాల క్రీడాకారులు ఉమ్మడిగా మార్చ్‌పాస్ట్ చేశారు.

1988 తర్వాత..
ఇక ఈ మెగా ఈవెంట్‌కు దూరంగా ఉండటంపై నార్త్ కొరియా నుంచి తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదని జపాన్ ఒలింపిక్ మంత్రి తమయో మరుకవాతో పాటు ఒలింపిక్ కమిటీ వెల్లడించాయి. ఈ ఏడాది జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఈ విశ్వ క్రీడలు జరుగుతాయి. 1988 సియోల్ గేమ్స్ తర్వాత కొరియా ఈ మెగా ఈవెంట్‌కు దూరం కావడం ఇదే తొలిసారి. 1972 మ్యూనిక్ ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసిన ఉత్తర కొరియా ఆ తర్వాత రెండు ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంది. అనంతరం రాజకీయ కారణాలతో 1984 లా ఏంజెలిస్ ఒలింపిక్స్, 1988 సియోల్ ఒలింపిక్స్ క్రీడలను ఉత్త కొరియా బహిష్కరించింది.

54 మెడల్స్..
ఓవరాల్‌గా ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో ఉత్తర కొరియా 16 స్వర్ణాలు, 16 రజతాలు, 22 కాంస్య పతకాలతో మొత్తం 54 మెడల్స్ సాధించింది. అత్యధికంగా వెయిట్ లిఫ్టింగ్‌లో 17 పతకాలు, రెజ్లింగ్‌లో 10 మెడల్స్, బాక్సింగ్, జూడోలలో 8 చొప్పున పతకాలు వచ్చాయి. ఉత్తర కొరియా తప్పుకోవడంతో టోక్యో ఒలింపిక్స్‌కు తొలి దెబ్బ పడింది. వాస్తవానికి ఈ టోక్యో ఒలింపిక్స్ గతేడాదే జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా ఈ ఏడాది జూలై, ఆగస్టుకు వాయిదా వేశారు.

భారత్‌కు పతకావకాశం..
టోక్యో ఒలింపిక్స్‌కు ఉత్తర కొరియా దూరం కావడంతో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, రెజ్లర్ వినేశ్ ఫొగట్ పతకావకాశాలు మెరుగయ్యాయి. మహిళల 49 కేజీ విభాగంలో ప్రస్తుతం నాలుగో ర్యాంకులో ఉన్న చానుకు ఉ.కొరియా లిఫ్టర్‌రి సోంగ్ గుమ్ ప్రధాన పోటీదారు. 2019 ప్రపంచ చాంపియన్‌షి్‌ప్సలోనూ గుమ్ తర్వాత చాను నాలుగో స్థానంలో నిలిచింది. కొరియా తప్పుకోవడం తమ జట్టుకు మంచిదేనని, ఇక భారత్ పోటీ చైనాతోనే ఉంటుందని జాతీయ కోచ్ విజయ్ శర్మ తెలిపాడు. అలాగే మహిళల 53 కేజీ విభాగంలో కొరియా రెజ్లర్ పాక్ యాంగ్ మి వైదొలగడంతో వినేశ్ మెడల్ చాన్స్ కూడా మెరుగయ్యాయి.


Click it and Unblock the Notifications












