న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

CWG 2022: అమ్మకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన నిఖత్ జరీన్.. ఫోన్‌లో అభినందించిన కేసీఆర్!

CWG 2022: Nikhat Zareen Promised Her Mother to Bring Home Gold Medal as Birthday Gift

బర్మింగ్‌హామ్: తెలంగాణ ముద్దు బిడ్డ, భారత బాక్సింగ్ క్వీన్ నిఖత్ జరీన్ మరోసారి తన పంచ్ పవర్ చూపెట్టింది. ఖతర్నాక్ పంచ్‌తో ఎదురైన ప్రత్యర్థినల్లా మట్టికరిపిస్తూ.. కామన్వెల్త్ గేమ్స్‌లో పోటీపడ్డ మొదటి సారే గోల్డ్ మెడల్ సాధించి శభాష్ అనిపించింది. ఆదివారం జరిగిన మహిళల 50 కేజీల టైటిల్ ఫైట్‌లో 26 ఏళ్ల నిఖత్ 5-0తో నార్నర్న్ ఐర్లాండ్‌కు చెందిన కార్లీమెక్‌నాల్‌‌ను చిత్తుగా ఓడించింది.

ఆడిన అన్ని బౌట్స్‌లో ఏకపక్ష విజయాలు సాధించిన జరీన్ తుదిపోరులోనూ అదే జోరు కొనసాగిస్తూ ఆడుతూ పాడుతూ బంగారం తెచ్చింది. రింగ్‌లో చురుగ్గా కదిలిన హైదరాబాదీ పర్‌ఫెక్ట్ హుక్స్, జాబ్స్‌తో మూడు రౌండ్లలోనూ కార్తీని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఫుల్ కాన్ఫిడెన్స్‌తో కనిపించిన నిఖత్ డిఫెన్స్ కూడా అంతే బలంగా ఉండటంతో మరో ఆలోచనే లేకుండా ఐదుగురు జడ్జీలు ఆమెను విజేతగా ప్రకటించారు.

రెండు కిలోలు తగ్గి..

రెండు కిలోలు తగ్గి..

'కామన్వెల్గ్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ నెగ్గడమే నా లక్ష్యం' వరల్డ్ చాంపియన్ అయిన తర్వాత నిఖత్ చెప్పిన మాట ఇది. చెప్పినట్టే నిఖత్ గోల్డ్ నెగ్గి చూపెట్టింది. సూపర్ ఫామ్‌లో ఉన్న జరీన్ తొలి రౌండ్ నుంచే తన మార్క్ ప్రదర్శన కనబర్చింది. ఫైనల్లో ఆమె ఆట చూసిన వాళ్లకు గోల్డ్ ఇంత ఈజీగా నెగ్గొచ్చా? అనిపించింది. కానీ ఇందుకోసం జరీన్ చాలా కష్టపడ్డది. వరల్డ్ చాంపియన్‌షిప్ తర్వాత నిఖత్ 52 కేజీల నుంచి 50 కేజీల కేటగిరీకి మారింది. తనకిష్టమైన ఐస్‌క్రీం, ఇతర ఫుడ్ తినకుండా వర్కౌట్స్ చేసింది.

పక్కా ప్రణాళికతో..

ఈ విభాగంలో తనకు ఇదే తొలి పోటీ. సాధారణంగా వెయిట్ మారిన తర్వాత కుదురుకునేందుకు ఎవరికైనా సమయం పడుతుంది. కానీ తెలంగాణ బాక్సర్ ఈ పతకం కోసం పక్కా ప్రణాళికతో బరిలోకి దిగింది. వరల్డ్ చాంపియన్‌షిప్ ముగిసిన వెంటనే నేషనల్ క్యాంప్‌లో జాయిన్ అయిన ఆమె పూర్తిగా గేమ్‌పైనే ఫోకస్ పెట్టింది. తన డిఫెన్స్‌ను మరింత మెరుగుపరుచుకుంది. 52 కేజీల విభాగం కామన్వెల్త్ గేమ్స్‌లో లేకపోవడంతోనే నిఖత్ బరువు తగ్గాల్సి వచ్చింది.

అమ్మకు అదిరిపోయే గిఫ్ట్..

అమ్మకు అదిరిపోయే గిఫ్ట్..

కామన్వెల్త్‌లో గోల్డ్ నెగ్గేందుకు మరో అంశం నిఖత్‌ను కూడా ఉత్సాహ పరిచింది. గత బుధవారం ఆమె తల్లి పర్వీన్ సుల్తానా బర్తే. దాంతో గోల్డ్‌‌తో ఆమెకు బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంది. తన చేతి గోర్లపై త్రివర్ణపతాకంతో పాటు కామన్వెల్త్ గోల్డ్ మెడల్‌ను పెయింటింగ్‌గా వేయించుకుంది. 'అమ్మ పుట్టిన రోజున నేను ఆమెకు ఏ బహుమతి ఇవ్వాలనుకుంటున్నానో ఇవి నాకు గుర్తు చేశాయి'అని నిఖత్ చెప్పింది. అనుకున్నట్టే అమ్మకు బంగారు పతకాన్ని బహుమతిగా ఇచ్చింది.

సీఎం కేసీఆర్ ఫోన్..

నిఖత్ జరీన్ విజయం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె విజయపరంపరను అభినందించారు. జరీన్ గెలుపుతో తెలంగాణ కీర్తి మరోసారి విశ్వవ్యాప్తమైందని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉంటుందని సీఎం పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా స్వర్ణం సాధించిన నిఖత్ జరీన్ తో సీఎం స్వయంగా ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు.

Story first published: Monday, August 8, 2022, 10:20 [IST]
Other articles published on Aug 8, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X