న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Commonwealth Games 2022: అదిరిపోయిన ఆరంభ వేడుకలు.. నేటి భారత షెడ్యూల్ ఇదే!

Commonwealth Games 2022 begins with a spectacular opening ceremony

బర్మింగ్‌హామ్: నాలుగేళ్లకు ఓసారి జరిగే కామన్వెల్త్ గేమ్స్ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అలెగ్జాండర్ స్టేడియంలో గురువారం ఆరంభ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రిటిష్ మ్యూజిక్ ఐకాన్ డురాన్ తన పాప్ సంగీతంతో హోరెత్తించాడు. డురాన్‌తో పాటు బ్లాక్ సబ్బాత్‌కు చెందిన టోనీ బయోమీ, లోకల్ ర్యాంపర్స్ ఇండిగో మార్షల్ గాంబిని ఇందులో పాల్గొన్నారు. బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్.. విక్టోరియా స్క్వేర్‌లో ఫెస్టివల్ సైట్‌ను సందర్శించారు.

అక్కడ జరుగుతున్న పెర్ఫామెన్స్ చూసి వాళ్లతో ముచ్చటించారు. ఈ వేడుకలో 2 వేల మంది ప్రదర్శన కారులు పాల్గొన్నారు. మరోవైపు భారత బృందం.. గేమ్స్ విలేజ్‌లో ఫ్లాగో హోస్టింగ్ సెర్మనీని ఘనంగా నిర్వహించింది. ఓపెనింగ్ సెర్మనీలో పంజాబ్ పాటకు భంగ్రా డ్యాన్స్‌ను చేశారు. బాణసంచా వెలుగులతో పాప్ మ్యూజిక్‌ హోరుతో స్టేడియం దద్దరిల్లింది.

అసలు సమరం షురూ..

అసలు సమరం షురూ..

తొలి రోజు ఆరంభోత్సవాన్ని ఆస్వాదించిన క్రీడాకారులు.. రెండో రోజు కదన రంగంలోకి దిగబోతున్నారు. శుక్రవారం నుంచి 11 రోజుల పాటు క్రీడాభిమానులకు బోలెడంత వినోదం అందించనున్నారు. ఆటల తొలి రోజు భారత క్రీడాకారులు పలు క్రీడల్లో బరిలో నిలుస్తున్నారు. తొలిసారి కామన్వెల్త్‌ క్రీడల్లో అడుగు పెడుతున్న క్రికెట్లో తొలి మ్యాచ్‌ భారత్‌-ఆస్ట్రేలియాల మధ్య జరగనుంది. ఇంకా బ్యాడ్మింటన్, హాకీ, బాక్సింగ్, టేబుల్‌ టెన్నిస్‌.. ఇలా భారత్‌కు పతకావకాశాలున్న పలు క్రీడల్లో పోటీలు మొదలు కాబోతున్నాయి.

తొలి పోరే సవాల్‌..

తొలి పోరే సవాల్‌..

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని భారత మహిళల క్రికెట్‌ జట్టు.. గ్రూప్‌ దశ తొలి మ్యాచ్‌లో ప్రపంచ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను ఢీకొనబోతోంది. ఈ ఈవెంట్లో భారత్‌కు కష్టమైన మ్యాచ్‌ ఇదే. 2020లో టీ20, 2022లో వన్డే ప్రపంచకప్‌ గెలిచి జోరు మీదున్న ఆసీస్‌ను ఆపడం భారత్‌కు అంత తేలికేం కాదు. దీనికి తోడు స్టార్‌ ఆల్‌రౌండర్‌ పూజ వస్త్రాకర్‌ కొవిడ్‌ కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కావడం జట్టుకు ఎదురు దెబ్బే. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన, షెఫాలివర్మ.. బౌలింగ్‌లో పూనమ్, రాజేశ్వరి, దీప్తి సత్తా చాటితే భారత్‌కు విజయావకాశాలు ఉంటాయి.

నేటి భారత షెడ్యూల్‌..

నేటి భారత షెడ్యూల్‌..

క్రికెట్‌ :

భారత్‌-ఆస్ట్రేలియా, సా. 4.30 నుంచి

మహిళల హాకీ :

భారత్‌-ఘనా, సా. 6.30

టీటీ :

పురుషులు, మహిళల టీమ్‌ రౌండ్‌ -1క్వాలిఫికేషన్స్‌: సా. 6.30

బ్యాడ్మింటన్‌ :

మిక్స్‌డ్‌ గ్రూప్‌మ్యాచ్‌: భారత్‌-పాకిస్థాన్‌: అశ్వినీ పొన్నప్ప/సుమిత్‌రెడ్డి: రా. 11 గం.

స్విమ్మింగ్‌ :

400మీ. ఫ్రీస్టయిల్‌, 100మీ. బ్యాక్‌స్ట్రోక్‌, 50మీ. బటర్‌ఫ్లై; రా. 7.30

ట్రయాథ్లాన్‌ :

పురుషులు, మహిళల వ్యక్తిగత స్ర్పింట్‌ డిస్టెన్స్‌ ఫైనల్‌: రా. 8 గం.

స్క్వాష్‌ : పురుషులు, మహిళల సింగిల్స్‌ ప్రిలిమినరీ రౌండ్‌-64: రా. 9 గం.

బాక్సింగ్‌ :

పురుషుల రౌండ్‌-32: రా. 9 గం.లాన్‌బౌల్‌ : మెన్స్‌ పారిస్‌, విమెన్‌ సింగిల్స్‌, విమెన్‌ ఫోర్స్‌: రా. 11.30 గం.

జిమ్నాస్టిక్స్‌:

పురుషుల వ్యక్తిగత, టీమ్‌ క్వాలిఫయింగ్‌: మ.1.30

ట్రాక్‌సైక్లింగ్‌ :

మెన్‌ టీం పర్స్యూట్‌ క్వాలిఫికేషన్‌: మ.2.30;

విమెన్‌ టీం స్ర్పింట్‌ క్వాలిఫికేషన్‌: మ.2.30;

విమెన్‌ టీం స్ర్పింట్‌ క్వాలిఫికేషన్‌: మ.2.30.

Story first published: Friday, July 29, 2022, 16:15 [IST]
Other articles published on Jul 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X