న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Commonwealth Games 2022: భారత్‌కు మరో షాక్.. డోప్ టెస్ట్‌లో దొరికిన మరో అథ్లెట్!

Commonwealth Games 2022: another India athlete tested fail dope test

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ ముంగిట భారత్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పారా అథ్లెట్లు అనీష్ కుమార్, సురేంద్రన్ పిళ్లైలు, స్ప్రింటర్‌ ఎస్‌.ధనలక్ష్మి, ట్రిపుల్‌ జంపర్‌ ఐశ్వర్య బాబు డోప్‌ పరీక్షల్లో విఫలమమైన విషయం తెలిసిందే. వీరి శాంపిల్స్‌లో నిషేధిత ఉత్ప్రేరకాలు ఉన్నట్లు తేలడంతో ఈనెల 28 నుంచి ఆగస్టు 8 వరకు బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు. అయితే తాజా మరో అథ్లెట్ కూడా ఈ జాబితాలో చేరినట్లు తెలుస్తోంది. మహిళల 4x100మీటర్ల బృందంలోని మరో సభ్యురాలు డోప్ టెస్టులో పట్టుబడినట్టు ఇన్‌స్పోర్ట్స్ పేర్కొంది.

కామన్వెల్త్ గేమ్స్‌కు బయలుదేరడానికి ముందు 4x100మీటర్ల బృందంలోని ఓ అథ్లెట్ కు గతంలో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) నిర్వహించిన డోప్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చినట్టు తేలింది. దీంతో సదరు క్రీడాకారిణిని కామన్వెల్త్ బృందం నుంచి తప్పించారు. అయితే ఆ అథ్లెట్ ఎవరు..? అన్నదానిని మాత్రం అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఇంకా వెల్లడించలేదు. ఇదే విషయమై అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తో స్పందిస్తూ.. 'అవును నిజమే. మహిళల 4x100మీటర్ల బృందంలోని ఒక అథ్లెట్ డోప్ టెస్టులో పాజిటివ్ గా తేలింది. మేము ఆమెపై చర్య తీసుకుంటాం..' అని తెలిపింది.

ఏప్రిల్‌, మే నెలలో టర్కీలో శిక్షణ సందర్భంగా ప్రపంచ అథ్లెటిక్స్‌ సమాఖ్యకు చెందిన అథ్లెటిక్స్‌ ఇంటిగ్రిటీ యూనిట్‌ (ఏఐయూ) ధనలక్ష్మి శాంపిల్స్‌ సేకరించింది. ఆ తర్వాత జూన్‌లో తిరువనంతపురంలో శిక్షణ శిబిరం సమయంలో జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) శాంపిల్స్‌ తీసుకుంది. ఈ రెండు శాంపిల్స్‌లోనూ నిషేధిత ఉత్ప్రేరకాలు ఉన్నట్లు తేలింది. కామన్వెల్త్‌ క్రీడల్లో 100 మీటర్లు, 4×100 మీ రిలే విభాగాలకు 24 ఏళ్ల ధనలక్ష్మి ఎంపికైంది. 4×100 మీ రిలేలో ద్యుతీ చంద్‌, హిమ దాస్‌, శ్రావణి నందా బరిలో ఉన్నారు.

ప్రస్తుతం యుజీన్‌లో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు సైతం ధనలక్ష్మి ఎంపికైంది. అయితే వీసా సమస్యలతో ఆమె వెళ్లలేకపోయింది. ఈ ఏడాది జూన్‌ 26న కొసనోవ్‌ స్మారక అథ్లెటిక్స్‌ మీట్‌లో 200 మీటర్ల పరుగును 22.89 సెకన్లలో ముగించి కెరీర్‌ అత్యుత్తమ టైమింగ్‌ నమోదు చేసిన ధనలక్ష్మి బంగారు పతకం సాధించింది. సరస్వతి సాహా (22.82 సె), హిమ దాస్‌ (22.88 సె) తర్వాత 23 సెకన్లలోపు టైమింగ్‌ నమోదు చేసిన మూడో భారత అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది. ధనలక్ష్మిపై వేటు పడటంతో ఆమె స్థానంలో ఎమ్‌.వి. జిల్నా కామన్వెల్త్‌ క్రీడలకు వెళ్లనుంది.

Story first published: Monday, July 25, 2022, 14:41 [IST]
Other articles published on Jul 25, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X