న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pro Kabaddi League: నేటి నుంచే కబడ్డీ కబడ్డీ.. మన తెలుగు టైటాన్స్ పూర్తి షెడ్యూల్ ఇదే!

 Pro Kabaddi League starts today, Telugu Titans full squad and schedule for Season 9

హైదరాబాద్: ఎంతగానో ఎదురు చూస్తున్న కబడ్డీ కూతకు సమయం ఆసన్నమైంది. మరికొద్ది సేపట్లో ప్రోకబడ్డీ లీగ్ సీజన్ 9కు తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ దబాంగ్ ఢిల్లీ, యు ముంబా మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ సంప్రదాయం క్రీడా లీగ్ మొదలవ్వనుంది. నవంబర్ 8 వరకు మొత్తం నెల రోజుల పాటు జరిగే ఈ టోర్నీ కబడ్డీ అభిమానులను అలరించనుంది. బెంగళూరు, పూణే, హైదరాబాద్ వేదికలుగా ఈ టోర్నీ మ్యాచ్‌లు జరగనున్నాయి.

తెలుగు టైటాన్స్, యు ముంబా, దబాంగ్ ఢిల్లీ, జైపూర్ పింక్ ఫాంథర్స్, యూపీ యోధాస్, హర్యానా స్టీలర్స్, పూణేరి ఫల్టాన్, తమిళ్ తలైవాస్, గుజరాత్ జెయింట్స్, బెంగాళ్ వారియర్స్, బెంగళూరు బుల్స్, పాట్నా పైరెట్స్ మొత్తం 12 జట్లు ఈసారి టైటిల్ కోసం పోరుకు సిద్ధమయ్యాయి.

దబాంగ్ ఢిల్లీతో..

మొదటి రోజు మూడు మ్యాచ్ లు జరగనున్నాయి. ఫస్ట్ మ్యాచ్ లో గత ఏడాది టైటిల్ విన్నర్ దబాంగ్ ఢిల్లీతో యు ముంబా తలపడనున్నది తెలుగు టైటాన్స్ తన తొలి మ్యాచ్‌లో బెంగళూరు బూల్స్‌తో, జైపూర్ పింక్ ఫాంథర్స్, యూపీ యోధాస్ మధ్య మరో మ్యాచ్ జరుగనుంది. తొలి సీజన్ నుంచి ఆడుతున్నా తెలుగు టైటాన్స్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చాంపియన్ గా నిలువలేకపోయింది. సీజన్ 2, 4 సీజన్లలో నాకౌట్ దశకు చేరుకున్నా.. కీలకమైన పోరుల్లో ఓడిపోయి నిరాశ పరిచింది.

టైటిలే లక్ష్యంగా..

టైటిలే లక్ష్యంగా..

ఇక ఈ ఏడాది ఆరంభంలో జరిగిన సీజన్ లో పూర్తిగా నిరాశ పరిచింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. అయితే ఈ సీజన్ కోసం జట్టులో చాలా మార్పులు జరిగాయి. గత సీజన్ నుంచి పాఠాలను నేర్చుకుని ఈసారి అద్బుత ఆటతీరుతో తెలుగు ఫ్యాన్స్ ను అలరిస్తామని తెలుగు టైటాన్స్ మేనేజ్ మెంట్ కూడా పేర్కొంది. తెలుగు టైటాన్స్ తన తొలి పోరును అక్టోబర్ 7న (శుక్రవారం) బెంగళూరు బుల్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 8.30 గంటలకు ఆరంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ తో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ మ్యాచ్ లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.

తెలుగు టైటాన్స్ టీమ్:

తెలుగు టైటాన్స్ టీమ్:

రైడర్స్ : అభిషేక్ సింగ్, మోను గోయత్, సిద్ధార్థ్ దేశాయ్, రజ్నీష్, అంకిత్ బెనివల్, వినయ్, అమన్ కడియాన్,

ఆల్ రౌండర్స్ : మోసెన్ జఫారీ, హనుమంతు, హమిద్ మిర్జాయ్, రవీందర్

డిఫెండర్స్ : సుర్జీత్ సింగ్, పర్వేశ్, వైష్ణవ్ భరద్వాజ్, ఆదర్శ్, రవీందర్ పహల్, విజయ్ కుమార్, నితిన్, మోహిత్, మోహిత్ పహల్, ముహమ్మద్ షిహాస్

తెలుగు టైటాన్స్ పూర్తి షెడ్యూల్.. (టేబుల్ వేయండి)

తెలుగు టైటాన్స్ పూర్తి షెడ్యూల్.. (టేబుల్ వేయండి)

తేది ప్రత్యర్థి టీమ్ వేదిక టైమింగ్స్

అక్టోబర్ 7 బెంగళూరు బుల్స్ బెంగళూరు రాత్రి గం. 8.30లకు

అక్టోబర్ 9 బెంగాల్ వారియర్స్ బెంగళూరు రాత్రి గం. 8.30లకు

అక్టోబర్ 11 పట్నా పైరేట్స్ బెంగళూరు రాత్రి గం. 8.30లకు

అక్టోబర్ 15 దబంగ్ ఢిల్లీ బెంగళూరు రాత్రి గం. 8.30లకు

అక్టోబర్ 18 పుణెరి పల్టాన్ బెంగళూరు రాత్రి గం. 8.30లకు

అక్టోబర్ 22 జైపూర్ పింక్ పాంథర్స్ బెంగళూరు రాత్రి గం. 8.30లకు

అక్టోబర్ 25 హరియాణా స్టీలర్స్ బెంగళూరు రాత్రి గం. 8.30లకు

అక్టోబర్ 29 గుజరాత్ జెయింట్స్ పుణే రాత్రి గం. 8.30లకు

అక్టోబర్ 31 యూపీ యోధా పుణే రాత్రి గం. 8.30లకు

నవంబర్ 2 యు ముంబా పుణే రాత్రి గం. 8.30లకు

నవంబర్ 5 తమిళ్ తలైవాస్ పుణే రాత్రి గం. 8.30లకు

Story first published: Friday, October 7, 2022, 13:33 [IST]
Other articles published on Oct 7, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X