న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PKL: ఊపిరి సలపని మ్యాచ్‌లు.. గట్టెక్కిన యూ ముంబా! గెలిచే మ్యాచ్‌లో ఓడిన బెంగాల్!

PKL: Puneri Paltan beat Bengal Warriors With 2 points

బెంగళూరు: ప్రొకబడ్డీ లీగ్ సీజన్ 9 ఉత్కంఠగా సాగుతోంది. ఊపిరి సలపని మ్యాచ్‌లతో అభిమానులకు కావాల్సిన మజాను అందిస్తోంది. శుక్రవారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఫలితం ఆఖరి సెకను వరకు తేలలేదు. పుణేరి పల్టాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకోగా.. హర్యానా స్టీలర్స్‌తో యు ముంబా పాయింట్ తేడాతో గట్టెక్కింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో విజయం ఇరు జట్లను వరించింది. ముందుగా యు ముంబా 32-31 తేడాతో హర్యానా స్టీలర్స్‌ను ఓడించింది.

యు ముంబాలో రైడర్ గుమన్ సింగ్ 9 రైడింగ్ పాయింట్స్‌తో సత్తా చాటగా.. డిఫెండర్ కమ్ కెప్టెన్ సురిందర్ సింగ్ 6 పాయింట్లతో మెరిసాడు. హర్యానా స్టీలర్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. మంజీత్, మీతూ నాలుగేసి రైడింగ్ పాయింట్లు సాధించగా... డిఫెండర్ అమిర్ హోస్సెన్ నాలుగు పాయింట్లు సాధించాడు. ఆరంభం నుంచే ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఫస్టాఫ్ ముగిసే సరికి యు ముంబా 17-15తో లీడ్ సాధించింది. సెకండాఫ్‌లో కూడా నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డాయి. చివరి క్షణాల్లో యు ముంబా తడబడినా ఆధిక్యాన్ని కాపాడుకోవడంతో విజయం దక్కింది.

రెండో మ్యాచ్‌లో పుణేరి పల్టాన్ 27-25 తేడాతో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌ను బెంగాల్ చేజేతులా చేజార్చుకుంది. ఆరంభం నుంచి దూకుడు కనబర్చిన ఆ జట్టు ఫస్టాఫ్ ముగిసేసరికి 15-11 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. కానీ సెకండాఫ్‌లో ఆ జోరుకొనసాగించలేకపోయింది. రైడర్లతో పాటు డిఫెన్స్ విభాగం కూడా విఫలమవడంతో 10-16తో వెనకబడి మ్యాచ్‌ను చేజార్చుకుంది.

పుణేరి పల్టాన్ జట్టులో కెప్టెన్ ఫజల్ అట్రాచలి 6 పాయింట్లతో సత్తా చాటగా.. అస్లామ్ ఇనామ్‌దర్ ఐదు పాయింట్లు సాధించాడు. బెంగాల్ వారియర్స్‌లో మనీందర్ సింగ్ 6 పాయింట్లకు ఇతరల నుంచి సహకారం అందలేదు.

Story first published: Friday, October 21, 2022, 22:17 [IST]
Other articles published on Oct 21, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X