న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత హాకీ విషయంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం!

Naveen Patnaik says Odisha to continue to sponsor Indian hockey teams for 10 more years
How Naveen Patnaik Helped Indian Hockey | Oneindia Telugu

భువనేశ్వర్‌: భారత పురుషుల, మహిళల హాకీ జట్ల స్పాన్సర్‌షిప్ విషయంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో పదేళ్ల పాటు హాకీ ఇండియా స్పాన్సర్‌గా కొనసాగుతామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన ఇరు జట్లను మంగళవారం ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మరో పదేళ్ల పాటు స్పాన్సర్‌షిప్‌ చేస్తామని చెప్పారు. 'రెండు జట్లు తమ అద్భుత ప్రదర్శనతో టోక్యో ఒలింపిక్స్‌లో కొత్త చరిత్ర లిఖించాయి. దేశం యావత్తు గర్వపడేలా హాకీ జట్లు మైదానంలో పోరాడాయి. అసామాన పోరాట పటిమ చూసి భారత్‌ భావోద్వేగంతో ఉప్పొంగిపోయింది. జాతీయ క్రీడ హాకీతో మా అనుబంధం కొనసాగుతుంది' అని అన్నారు.

 ఒక్కో ప్లేయర్‌కు రూ. 10 లక్షలు..

ఒక్కో ప్లేయర్‌కు రూ. 10 లక్షలు..

ఒక్కో ప్లేయర్‌కు రూ. 10 లక్షలు, సహాయ సిబ్బందికి రూ. 5 లక్షలు చొప్పున ప్రోత్సాహక బహుమతిగా అందజేసిన ఒడిషా ప్రభుత్వం హాకీ ఇండియాకు కూడా రూ. 50 లక్షల సాయం అందించింది. ఒడిశా ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తోంది. భారత క్రీడాభిమానులు నవీన్ పట్నాయక్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 2018 నుంచి భారత హాకీ జట్లకు 'టీమ్‌ స్పాన్సర్‌'గా ఒడిశా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇటీవల ముగిసిన ఒలింపిక్స్‌లో పురుషుల జట్టు 41 ఏళ్ల పతక నిరీక్షిణకు కాంస్యంతో తెరదించిన సంగతి తెలిసిందే. మహిళల జట్టు నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకాన్ని చేజార్చుకుంది. హోరాహోరీగా సాగిన కాంస్య పోరులో మన్‌ప్రీత్ నేతృత్వంలోని భారత జట్టు 5-4తో జర్మనీని చిత్తు చేసి 1980 మాస్కో ఒలింపిక్స్ స్వర్ణం తర్వాత మళ్లీ విశ్వక్రీడల్లో పతకాన్ని అందుకుంది.

తెరవెనుక హీరో నవీన్ పట్నాయక్..

తెరవెనుక హీరో నవీన్ పట్నాయక్..

భారత హాకీ విజయంలో ఆటగాళ్ల ప్రదర్శన ఎంత ఉందో.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పాత్ర కూడా అంతకంటే ఎక్కువే ఉంది. యావత్ భారతం క్రికెట్ పిచ్చిలో మునిగి తేలుతుండటంతో ఇతర ఆటలకు ఆదరణ లేకుండా పోయింది. దాంతో కాసులు కురిపించే క్రికెట్‌ను కాదని ఇతర ఆటలను ప్రమోట్ చేసేందుకు స్పాన్సర్లు ముందుకు రావడం కష్టమైంది. చాలా ఏళ్లు భారత హాకీ టీమ్‌కు సహారా స్పాన్సర్‌గా కొనసాగింది. కానీ ఆ తర్వాత ఆటకు ఆదరణ తక్కువవడంతో 2018లో సహారా తప్పుకుంది. హాకీ గేమ్‌కు కూడా ఇతర ఆటల్లానే స్పాన్సర్‌ను వెతుకునే పరిస్థితి తలెత్తింది. ఇలాంటి స‌మ‌యంలో ఒడిశా సీఎం నవీన్ ప‌ట్నాయ‌క్ ముందుకొచ్చారు.

హాకీ ప్లేయర్ కావడంతో...

హాకీ ప్లేయర్ కావడంతో...

హాకీ ఆటపై ఉన్న మక్కువతో పాటు జాతీయ క్రీడను బతికించాలనే ఆలోచనతో ఒడిశా ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుందని నవీన్ పట్నాయక్ అప్పట్లో చెప్పాడు. ఐదేళ్ల‌కుగాను నవీన్ ప‌ట్నాయ‌క్ ప్ర‌భుత్వం రూ.100 కోట్లకు హాకీ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందమే భారత హాకీ టీమ్ రాత‌ను మార్చింది. న‌వీన్ ప‌ట్నాయ‌క్ గ‌తంలో హాకీ ప్లేయ‌రే. ఆయ‌న స్కూల్‌లో చ‌దువుతున్న స‌మ‌యంలో హాకీ గోల్‌కీప‌ర్‌గా తన టీమ్‌ తరఫున బరిలోకి దిగేవాడు. ఆ ఇష్టంతోనే టీమ్‌కు స్పాన్స‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌డానికి ఆయ‌న ముందుకు వ‌చ్చారు. పురుషుల జ‌ట్టుతోపాటు మ‌హిళ‌లూ జ‌ట్టుకూ ఐదేళ్ల పాటు స్పాన్స‌ర్‌గా ఉండ‌టానికి ఒడిశా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం అయిన మూడేళ్ల తర్వాత హాకీ టీమ్ ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచింది. మ‌హిళల టీమ్ కూడా అత్యుత్తమ ప్రదర్శనతో తృటిలో మెడ‌ల్‌ కోల్పోయింది.

 భారత హాకీ ప్రతీ అడుగులో..

భారత హాకీ ప్రతీ అడుగులో..

2014లో ఒడిశా ప్ర‌భుత్వం చాంపియ‌న్స్ ట్రోఫీ హాకీకి ఆతిథ్య‌మిచ్చింది. అప్పుడే ఒడిశా స్పాన్స‌ర్‌షిప్‌కు బీజం ప‌డింది. ఆ టోర్నీపై న‌వీన్ ప‌ట్నాయ‌క్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపారు. ఆ త‌ర్వాత 2017లో ఒడిశా ప్ర‌భుత్వం స్పాన్స‌ర్‌గా ఉన్న క‌లింగ లాన్స‌ర్స్ టీమ్ హాకీ ఇండియా లీగ్‌ను గెలిచింది. ఇక 2018లో హాకీ వ‌ర‌ల్డ్ లీగ్‌ను కూడా ఒడిశా నిర్వ‌హించింది. ఆ త‌ర్వాత 2019లో ఇంట‌ర్నేష‌న‌ల్ హాకీ ఫెడ‌రేష‌న్ మెన్స్ సిరీస్ ఫైన‌ల్స్‌, ఒలింపిక్ హాకీ క్వాలిఫ‌య‌ర్స్‌.. 2020లో ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ కూడా ఒడిశాలో జ‌రిగాయి. ఇలా ఇండియ‌న్ హాకీ వేసే ప్ర‌తి అడుగులోనూ న‌వీన్ ప‌ట్నాయ‌క్ తెర వెనుక హీరోగా ఉంటూ వ‌స్తున్నారు.

Story first published: Wednesday, August 18, 2021, 10:38 [IST]
Other articles published on Aug 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X