ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో హైడ్రామా చోటు చేసుకుంది. టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ సహనం కోల్పోయాడు. తన బౌలింగ్‌లో భారీ సిక్సర్లు కొట్టాడనే కోపంతో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్‌ను బంతితో కొట్టాడు. ఈ అనూహ్య పరిణామంతో ఖంగుతిన్న డారిల్ మిచెల్ కోపంతో ఊగిపోయాడు. గట్టిగా అరుస్తూ.. అర్ష్‌దీప్ సింగ్‌పైకి దూసుకొచ్చాడు. ఇవేవి పట్టించుకోకుండా అర్ష్‌దీప్ సింగ్ అతనికి దూరంగా వెళ్లిపోయాడు.
అయితే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. డారిల్ మిచెల్ దగ్గరకు వెళ్లి అర్ష్‌దీప్ సింగ్ తరఫున క్షమాపణలు చెప్పాడు. మరోవైపు అర్ష్‌దీప్ సింగ్‌ను ఫీల్డ్ అంపైర్ మందలించాడు. సూర్య క్షమాపణలు చెప్పడంతో డారిల్ మిచెల్ వెనక్కి తగ్గాడు. ఓవర్ పూర్తయిన తర్వాత అర్ష్‌దీప్ సింగ్ కూడా డారిల్ మిచెల్‌కు క్షమాపణలు చెప్పి హగ్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

న్యూజిలాండ్ బ్యాటింగ్ సందర్భంగా అర్ష్‌దీప్ సింగ్ వేసిన 11వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌లో రెండో, మూడో బంతిని డారిల్ మిచెల్ భారీ సిక్సర్లుగా తరలించాడు. అయితే రెండో బంతిని బౌండరీ లైన్‌పై ఇషాన్ కిషన్ అందుకున్నప్పటికీ సమన్వయం కోల్పోయి బౌండరీ లైన్ తొక్కడంతో సిక్సర్‌గా మారింది. తర్వాతి బంతిని కూడా డారిల్ మిచెల్ సిక్సర్ తరలించడంతో అర్ష్‌దీప్ సింగ్ సహనం కోల్పోయాడు. మరుసటి బంతి వైడ్ వేసిన అతను.. తర్వాత డాట్ చేశాడు.
ఐదో బంతిని డారిల్ మిచెల్.. అర్ష్‌దీప్ సింగ్ వైపు ఆడగా.. ఫాలో త్రూలో అందుకున్న అతను.. అంతే వేగంగా డారిల్ మిచెల్‌పైకి విసిరాడు. ఆ త్రో కాస్త డారిల్ మిచెల్‌కు బలంగా తాకింది. కనీసం సారీ కూడా చెప్పకుండా కోపంతో అర్ష్‌దీప్ సింగ్ వెనుదిరగడంతో డారిల్ మిచెల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. సూర్య జోక్యం చేసుకొని క్షమాపణలు చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. అర్ష్‌దీప్ సింగ్‌పై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.