న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

మ్యాచ్ ఓడినా అభిమానుల హృదయాలను గెలుచుకున్న రొనాల్డో (వీడియో)

By Nageshwara Rao
FIFA 2018: Ronaldo,Messi's Exit sends twitter into overdrive
World Cup: Cristiano Ronaldo praised for sportsmanship, but was it more like gamesmanship?

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్ టీమ్ నాకౌట్ నుంచి ఇంటికి వెళ్లిపోవడానికి కారణమైన ఆటగాడు ఎడిన్‌సన్ కవాని. ఉరుగ్వేకి చెందిన ఈ ఆటగాడు శనివారం పోర్చుగల్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ చేయడంతో వరల్డ్ బెస్ట్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ టీమ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ఆట 7వ, 62వ నిమిషాల్లో కవాని చేసిన గోల్స్‌తో ఉరుగ్వే 2-1తో తేడాతో పోర్చుగల్‌పై విజయం సాధించి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో ఉరుగ్వే ప్లేయ‌ర్ ఎడిన్‌సన్ క‌వానీ రెండు గోల్స్ చేసి జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. మ్యాచ్‌ ప్రారంభమైన ఏడు నిమిషాలకే ఉరుగ్వే ఫార్వర్డ్‌ ప్లేయర్‌ ఎడిన్సన్‌ కావనీ తొలి గోల్ చేసి పోర్చుగల్‌కు షాకిచ్చాడు.

సువారెజ్‌ ఇచ్చిన పాస్‌ను ఈ స్టార్‌ స్ట్రైకర్‌ హెడర్‌ గోల్‌ చేసి ఉరుగ్వేను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. ఆ త‌ర్వాత తొలి అర్దభాగంలో రెండు జ‌ట్లు అటాకింగ్ గేమ్ ఆడాయి. ఈ క్రమంలో కిక్‌ రూపంలో వచ్చిన అవకాశాన్ని రొనాల్డో మిస్‌ చేశాడు. ఆ తర్వాత ఇరు జట్లకు గోల్స్ ద‌క్క‌లేదు. దీంతో మరో గోల్‌ నమోదు కాకుండానే తొలి భాగం ముగిసింది.

ఇక, రెండో అర్దభాగంలో 55వ నిమిషంలో రొనాల్డో ఇచ్చిన పాస్‌తో డిఫెండర్‌ పెపె గోల్‌ చేయడంతో ఇరు జట్ల స్కోర్‌ సమం అయ్యాయి. అయితే, పోర్చుగల్‌ శిభిరంలో ఈ ఆనందం ఎంతో సేపు నిలువలేదు. పోర్చుగల్ డిఫెండింగ్‌ వైఫల్యంతో ఎడిన్సన్‌ కావనీ 62వ నిమిషంలో మరో అద్భుతమైన గోల్‌ చేయడంతో ఉరుగ్వే 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.

ఆ తర్వాత ఇరు జట్లు మరో గోల్‌ కోసం పోటీపడినప్పటికీ గోల్స్ నమోదు కాలేదు. కాగా, కవాని ఈ మ్యాచ్ మొత్తం ఆడలేకపోయాడు. గాయం కారణంగా 70వ నిమిషంలోనే ఆట నుంచి తప్పుకున్నాడు. ఈ సమయంలోనే రొనాల్డో చేసిన పనికి అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

గాయపడి కవాని నడవలేని స్థితిలో ఉన్న సమయంలో ప్రత్యర్థి టీమ్ ప్లేయర్ అయిన తాను అతన్ని గ్రౌండ్ బయటకు వెళ్లడానికి సాయం చేశాడు. మ్యాచ్ ఓడినా మా హృదయాలను గెలుచుకున్నావంటూ అభిమానులు రొనాల్డోపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Story first published: Sunday, July 1, 2018, 15:13 [IST]
Other articles published on Jul 1, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X