
హైదరాబాద్: 21వ ఫిఫా వరల్డ్ కప్‌కు సర్వం సిద్ధమైంది. రష్యా ఆతిథ్యమిస్తోన్న ఈ పుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం సాకర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన సాకర్ అభిమానులు రష్యాకు చేరుకున్నారు.
ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక
2006 తర్వాత తిరిగి ఫిఫా వరల్డ్ కప్‌కు యూరప్ ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. 2006లో ఫిఫా వరల్డ్ కప్‌కు జర్మనీ ఆతిథ్యమివ్వగా, ఆ తర్వాత 2010లో ఆఫ్రికా, 2014లో దక్షిణ అమెరికా ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రతి ఒక్క సాకర్ అభిమాని మనసులో ఒకే ఒక్క ప్రశ్న మెదులుతోంది.
తన కెరీర్‌లో ఎన్నో గొప్ప విజయాలను సాధించిన అర్జెంటీనా సాకర్ ప్లేయర్ లియోనల్ మెస్సీ ఈసారైనా వరల్డ్ కప్‌ని సాధిస్తాడా? లేదా 2016లో పోర్చుగల్ జట్టు యూరో కప్ విన్నర్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించిన క్రిస్టియానో రొనాల్డో తన దేశానికి తొలిసారి వరల్డ్ కప్‌ను గెలుస్తాడా? అని.
కాగా, రష్యా అతిథ్యమిస్తోన్న ఈ ఫిఫా వరల్డ్ కప్ నెలరోజుల పాటు జూన్ 14 నుంచి జులై 15 వరకు అభిమానులను అలరించనుంది. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 32 దేశాలు పాల్గొంటున్నాయి. నాలుగేసి జట్లు.. ఎనిమిది గ్రూప్‌లుగా విడిపోయి తొలి దశలో తలపడుతున్నాయి. ఫేవరెట్ ఎవరు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.
వాస్తవానికి క్వాలిఫయిర్స్ టోర్నీని దాటి ఈ ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడికొచ్చే ప్రతి జట్టూ నాణ్యమైనదే. కాబట్టి గ్రూప్ దశ అంత ఆషామాషీగా ఏమీ ఉండదు. ప్రతి మ్యాచ్ కీలకమే. ప్రతి ఫలితమూ ఉత్కంఠభరితంగానే ఉండబోతోంది.
ఈ వరల్డ్ కప్‌లో జర్మనీ, బ్రెజిల్ జట్లు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయి. అర్జెంటీనా, స్పెయిన్, బెల్జియం లాంటి జట్లు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో వరల్డ్ కప్ రేసులో ఉన్నాయి. జూన్ 14న మాస్కోలోని లుజుంకి స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా.. సౌదీ అరేబియాతో తలపడనుంది.
ఫిఫా వరల్డ్ కప్-2018 గ్రూప్ వివరాలు:
| GROUP A | GROUP B | GROUP C | GROUP D | GROUP E | GROUP F | GROUP G | GROUP H |
| Russia | Portugal | France | Argentina | Brazil | Germany | Belgium | Poland |
| Saudi Arabia | Spain | Australia | Iceland | Switzerland | Mexico | Panama | Senegal |
| Egypt | Morocco | Peru | Croatia | Costa Rica | Sweden | Tunisia | Colombia |
| Uruguay | Iran | Denmark | Nigeria | Serbia | South Korea | England | Japan |
భారత కాలమానం ప్రకారం ఫిఫా వరల్డ్ కప్ పూర్తి షెడ్యూల్:
| Date | Fixtures | Time(IST) | Venue |
| Thursday, June 14 | Russia vs. Saudi Arabia | 8.30 PM | Moscow |
| Friday, June 15 | Egypt vs. Uruguay | 5.30 PM | Yekaterinburg |
| Morocco vs. Iran | 8.30 PM | St Petersburg | |
| Portugal vs. Spain | 11.30 PM | Sochi | |
| Saturday, June 16 | France vs. Australia | 3.30 PM | Kazan |
| Argentina vs. Iceland | 6.30 PM | Moscow | |
| Peru vs. Denmark | 9.30 PM | Saransk | |
| Sunday, June 17 | Croatia vs. Nigeria | 12.30 AM | Kaliningrad |
| Costa Rica vs. Serbia | 5.30 PM | Samara | |
| Germany vs. Mexico | 8.30 PM | Moscow | |
| Brazil vs. Switzerland | 11.30 PM | Rostov | |
| Monday, June 18 | Sweden vs. South Korea | 5.30 PM | Nizhny Novgorod |
| Belgium vs. Panama | 8.30 PM | Sochi | |
| Tunisia vs. England | 11.30 PM | Volgograd | |
| Tuesday, June 19 | Colombia vs. Japan | 5.30 PM | Saransk |
| Poland vs. Senegal | 8.30 PM | Moscow | |
| Russia vs. Egypt | 11.30 PM | Saint Petersburg | |
| Wednesday, June 20 | Portugal vs. Morocco | 5.30 PM | Moscow |
| Uruguay vs. Saudi Arabia | 8.30 PM | Rostov | |
| Iran vs. Spain | 11.30 PM | Kazan | |
| Thursday, June 21 | France vs. Peru | 5.30 PM | Yekaterinburg |
| Denmark vs. Australia | 8.30 PM | Samara | |
| Argentina vs. Croatia | 11.30 PM | Nizhny Novgorod | |
| Friday, June 22 | Brazil vs. Costa Rica | 5.30 PM | St Petersburg |
| Nigeria vs. Iceland | 8.30 PM | Volgograd | |
| Serbia vs. Switzerland | 11.30 PM | Kaliningrad | |
| Saturday, June 23 | Belgium vs. Tunisia | 5.30 PM | Moscow |
| Germany vs. Sweden | 8.30 PM | Sochi | |
| South Korea vs. Mexico | 11.30 PM | Rostov | |
| Sunday, June 24 | England vs. Panama | 5.30 PM | Nizhny Novgorod |
| Japan vs. Senegal | 8.30 PM | Yekaterinburg | |
| Poland vs. Colombia | 11.30 PM | Kazan | |
| Monday, June 25 | Saudi Arabia vs. Egypt | 7.30 PM | Volgograd |
| Uruguay vs. Russia | 7.30 PM | Samara | |
| Iran vs. Portugal | 11.30 PM | Saransk | |
| Spain vs. Morocco | 11.30 PM | Kaliningrad | |
| Tuesday, June 26 | Australia vs. Peru | 7.30 PM | Sochi |
| Denmark vs. France | 7.30 PM | Moscow | |
| Iceland vs. Croatia | 11.30 PM | Rostov | |
| Nigeria vs. Argentina | 11.30 PM | St Petersburg | |
| Wednesday, June 27 | South Korea vs. Germany | 7.30 PM | Kazan |
| Mexico vs. Sweden | 7.30 PM | Yekaterinburg | |
| Switzerland vs. Costa Rica | 11.30 PM | Nizhny Novgorod | |
| Serbia vs. Brazil | 11.30 PM | St Petersburg | |
| Thursday, June 28 | Japan vs. Poland | 7.30 PM | Volgograd |
| Senegal vs. Colombia | 7.30 PM | Samara | |
| England vs. Belgium | 11.30 PM | Kaliningrad | |
| Panama vs. Tunisia | 11.30 PM | Saransk | |
| Saturday, June 30 | Round of 16: Match 50: Group C winner vs. Group D runner-up | 7.30 PM | Kazan |
| Round of 16: Match 49: Group A winner vs. Group B runner-up | 7.30 PM | Sochi | |
| Sunday, July 1 | Round of 16: Match 51: Group B winner vs. Group A runner-up | 7.30 PM | Moscow |
| Round of 16: Match 52: Group D winner vs. Group C runner-up | 11.30 PM | Nizhny Novgorod | |
| Monday, July 2 | Round of 16: Match 53: Group E winner vs. Group F runner-up | 7.30 PM | Samara |
| Round of 16: Match 54: Group G winner vs. Group H runner-up | 7.30 PM | Rostov | |
| Tuesday, July 3 | Round of 16: Match 55 (Group F winner vs. Group E runner-up) | 7.30 PM | St Petersburg |
| Round of 16: Match 56 (Group H winner vs. Group G runner-up) | 11.30 PM | Rostov | |
| Friday, July 6 | Quarterfinal: Match 57 (Match 49 winner vs. Match 50 winner) | 7.30 PM | Nizhny Novgorod |
| Quarterfinal: Match 58 (Match 53 winner vs. Match 54 winner) | 11.30 PM | Kazan | |
| Saturday, July 7 | Quarterfinal: Match 60 (Match 55 winner vs. Match 66 winner) | 7.30 PM | Samara |
| Quarterfinal: Match 59 (Match 51 winner vs. Match 52 winner) | 11.30 PM | Sochi | |
| Tuesday, July 10 | Semifinal: Match 61 (Match 57 winner vs. Match 58 winner) | 11.30 PM | St Petersburg |
| Wednesday, July 11 | Semifinal: Match 62 (Match 59 winner vs. Match 60 winner) | 11.30 PM | Moscow |
| Saturday, July 14 | Third-place match: Match 63 (Match 61 loser vs. Match 62 loser) | 7.30 PM | St Petersburg |
| Sunday, July 15 | Final: Match 64 (Match 61 winner vs. Match 62 winner) | 8.30 PM | Moscow |