న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

పుట్‌బాల్‌తో ప్రపంచాన్ని ఏకం చేస్తోన్న రష్యా: వీడియో వైరల్

By Nageshwara Rao
Watch how the beautiful game unites the world in Russia!

హైదరాబాద్: రష్యాలో జరుగుతున్న వరల్డ్ కప్‌లో క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లు శుక్రవారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. క్వార్టర్ ఫైనల్లో జరిగే ప్రతి మ్యాచ్‌ అభిమానులను ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. ముప్ఫై రెండు జట్లతో మొదలైన టోర్నీ అత్యుత్తమంగా నిలిచిన ఆఖరి ఎనిమిది జట్లతో క్వార్టర్‌ ఫైనల్స్‌‌ సమరం మొదలైంది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

టోర్నీలో భాగంగా తొలిరోజు జరిగిన క్వార్టర్ పైనల్స్‌లో ఫ్రాన్స్, బెల్జియం జట్లు ప్రత్యర్ధి జట్లు అయిన ఉరుగ్వే, బ్రెజిల్‌పై నెగ్గి సెమీస్‌కు అర్హత సాధించాయి. వరల్డ్ కప్‌లో క్వార్టర్ పైనల్స్‌ మరో అంకం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాకర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఈ మ్యాచ్‌ల కోసం ఎదురు చూశారు.

"ట్రైబల్ మాస్కో - వరల్డ్ కప్" వీడియోని వీక్షించండి:

అందరిలాగే రష్యాకు చెందిన యవ్జెనీ యగోరోవ్ అనే అభిమాని ఈ వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కి సంబంధించిన టికెట్‌ను గతేడాది కొనుగోలు చేశాడు. అయితే, అతడి ముందుస్తు అంచనా ప్రకారం క్వార్టర్ ఫైనల్‌కు స్పెయిన్, అర్జెంటీనా జట్లు చేరతాయని భావించాడు. కానీ, అలా జరగలేదు.

ఎందుకంటే ఈ మెగా టోర్నీలో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఈ రెండు జట్లు నాకౌట్ స్టేజిలోనే నిష్క్రమించాయి. నాకౌట్లో రష్యా చేతిలో పెనాల్టీ షూటౌట్‌లో స్పెయిన్ ఇంటిదారి పట్టగా... అర్జెంటీనా జట్టు ఫ్రాన్స్ చేతిలో ఓడిపోయిన టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన రష్యా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరడంతో రష్యా సాకర్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దీంతో యవ్జెనీ యగోరోవ్‌తో పాటు రష్యాకు చెందిన అనేక లక్షల మంది అభిమానులు శుక్రవారం మాస్కోలోని కజన్‌స్కై రైల్వే స్టేషన్‌కు వచ్చారు..

ఎందుకో తెలుసా? టోర్నీలో భాగంగా క్వార్టర్ ఫైనల్స్‌లో శనివారం సోచీ వేదికగా రష్యా-క్రొయేషియా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో రష్యాకు మద్దతు తెలిపేందుకు గాను వీరంతా మాస్కో నుంచి సోచికి బయల్దేరారు. దీంతో రష్యా సాకర్ అభిమానులు మాస్కో నుంచి సోచీకి బయల్దేరారు.

ఈ క్రమంలో వేలమంది అభిమానులు రష్యా జాతీయ జెండాలను చేతబూని సోచీకి పయనమయ్యారు. మరోవైపు రష్యాకు మద్దతుగా ఆ దేశ సింగర్లు వీడియోలను రూపొందించి సైతం సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. తాజాగా ఓ అభిమాని రూపొందించిన 'ట్రైబల్ మాస్కో' అనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ వీడియోకు విశేష స్పందన లభిస్తోంది. మరోవైపు వరల్డ్ కప్‌ ఆతిథ్యదేశంగా ఉన్న రష్యా అభిమానులకు సైతం సర్‌ప్రైజ్ ఇస్తోంది. మరోవైపు సొంతగడ్డపై జరిగే క్వార్టర్స్‌లో క్రొయేషియాపై విజయం సాధించి రష్యా సెమీస్‌ చేరితే ప్రత్యేక నాణెం విడుదల చేస్తామని ఆ దేశ సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రకటించింది.

ఈ వరల్డ్ కప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు అద్భుత రీతిలో రాణిస్తూ అనూహ్యంగా క్వార్టర్స్‌ వరకూ దూసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్వార్టర్స్‌లో పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోన్న రష్యా... క్రొయేషియాపై విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

దీంతో రష్యా సొంతగడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్‌లో సెమీస్‌‌కు చేరితే ఆ జ్ఞాపకార్థం రూబుల్‌లో సగం వంతు విలువ గల ప్రత్యేక నాణేన్ని విడుదల చేస్తామని సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రకటించింది. ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ రష్యా ''రష్యాలో ఫిఫా 2018 సాకర్‌ ప్రపంచకప్‌'' అని ముద్రించిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, July 7, 2018, 14:12 [IST]
Other articles published on Jul 7, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X