న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫ్రాన్స్ సంబరాలు: అధ్యక్షుడి నుంచి ఆటగాళ్ల వరకు అతి చేశారా? (వీడియో)

By Nageshwara Rao
The world is blue - media react to Frances World Cup win over Croatia

హైదరాబాద్: రష్యాలోని మాస్కో వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో క్రొయేషియాను 4-2తేడాతో ఓడించి ఫ్రాన్స్ 2018 వరల్డ్ కప్ టైటిల్ విజేతగా నిలిచింది. దీంతో 20 ఏళ్ల తర్వాత రెండోసారి ఫ్రాన్స్ వరల్డ్ కప్ ఛాంపియన్‌గా అవతరించింది. వరల్డ్‌కప్ అందుకున్న ఆనందంలో ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

అయితే, ఈ సంబరాల్లో ఆటగాళ్లు మితిమీరి ప్రవర్తించడంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫైనల్ మ్యాచ్ విజయానంతరం ఫ్రాన్స్ ఆటగాళ్లు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. మ్యాచ్‌ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు, కోచ్‌లు నిబంధనల ప్రకారం మీడియా సమావేశంలో పాల్గొనాలి.

The world is blue - media react to Frances World Cup win over Croatia

అయితే, ఈ మీడియా సమావేశంలో ఫ్రాన్స్‌ జట్టు కోచ్‌ దిదియర్‌ డెచాంప్స్‌ ప్రసంగించేందుకు సిద్ధమవుతున్న వేళ.. ఆటగాళ్లు ఒకరిపై ఒకరు షాంపేన్ చల్లుకుంటూ సందడి చేశారు. టేబుళ్లు‌ ఎక్కి చిందులు వేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. చొక్కాలు విప్పేసి నానా రభస చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "2016 యూరో ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో పోర్చుగల్‌ చేతిలో ఓటమి నుంచి చాలా నేర్చుకున్నామని, ఆ రోజు ఓడిపోకపోయుంటే ఈ రోజు విశ్వ విజేతలుగా నిలిచేవాళ్లం కాదేమో" అని డెషాంప్స్‌ అన్నాడు.

కెప్టెన్‌గా, కోచ్‌గా కప్పు అందుకున్న మూడో వ్యక్తిగా డెషాంప్స్‌ అరుదైన ఘనత సాధించాడు. జగాలో (బ్రెజిల్‌), బ్రెకన్‌బాయర్‌ (జర్మనీ) తర్వాత అటు కెప్టెన్‌గా, ఇటు కోచ్‌గా కూడా వరల్డ్‌ కప్‌ సాధించారు.

ఇక, లుజ్నికి స్టేడియంలో క్రొయేషియాపై ఫ్రాన్స్ 4-2తేడాతో విజయం సాధించిన తర్వాత ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ సైతం ఎగిరి గంతేశాడు. టోర్నీలో ఫ్రాన్స్‌ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తే మ్యాచ్‌ చూసేందుకు రష్యా వస్తా అని చెప్పారట. మాట ప్రకారమే సెమీఫైనల్‌ మ్యాచ్‌కు మెక్రాన్‌ హాజరయ్యారు.

ఈ మ్యాచ్‌కు ఫ్రాన్స్‌, క్రొయేషియా అధ్యక్షులు మెక్రాన్‌, కొలిందాతోపాటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కూడా హాజరయ్యారు. వీవీఐపీ బాక్స్‌లో కూర్చుని మ్యాచ్‌ను వీక్షించిన మెక్రాన్‌ ఫ్రాన్స్‌ గోల్‌ కొట్టినప్పుడల్లా చప్పట్లు కొడుతూ ఆటగాళ్లను ప్రోత్సహించారు. ఫ్రాన్స్‌ విజేతగా నిలిచినట్లు తెలియగానే మెక్రాన్‌ వీవీఐపీ బాక్సులో సంబరాలు చేసుకున్నారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు క్రొయేషియాపై ఫైనల్లో ఫ్రాన్స్ గెలవడంతో ఫ్రాన్స్‌లో సైతం అభిమానులు సంబరాల్లో ముగిగారు. అయితే, ఈ సంబరాలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో చాంప్స్ ఎలిసెస్‌ అవెన్యూ వద్దకు వేలాదిగా చేరుకున్న అభిమానులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

కొందరు ఆకతాయిలు వారిపైకి రాళ్లు, బాటిళ్లు విసిరారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. అల్లరి మూకలను అదుపు చేసేందుకు భాష్పవాయు గోళాలు సైతం ప్రయోగించడం విశేషం. ఇలా ఫ్రాన్స్ ఫిఫా వరల్డ్ కప్ విజేతగా నిలవడంతో అటు ఆటగాళ్లతో పాటు, ఇటు అభిమానులు సైతం అతిగా ప్రవర్తించినట్లు సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

Story first published: Monday, July 16, 2018, 17:44 [IST]
Other articles published on Jul 16, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X