న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

రష్యా సెమీస్‌ చేరితే.. ఆ జ్ఞాపకార్థం ప్రత్యేక నాణెం: సెంట్రల్‌ బ్యాంక్‌

By Nageshwara Rao
Russian mint to release half-rouble coin if team reaches World Cup semis

హైదరాబాద్: సొంతగడ్డపై జరిగే క్వార్టర్స్‌లో క్రొయేషియాపై విజయం సాధించి రష్యా సెమీస్‌ చేరితే ప్రత్యేక నాణెం విడుదల చేస్తామని ఆ దేశ సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రకటించింది. టోర్నీలో భాగంగా శనివారం సోచీ వేదికగా జరిగే క్వార్టర్‌ ఫైనల్లో రష్యా-క్రొయేషియా తలపడనున్నాయి.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ఈ వరల్డ్ కప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు అద్భుత రీతిలో రాణిస్తూ అనూహ్యంగా క్వార్టర్స్‌ వరకూ దూసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రష్యా అభిమానులు తమ జట్టుని ఆదరించడం మొదలుపెట్టారు. సొంతగడ్డపై రష్యా ఆడే మ్యాచ్‌లకు పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు తెలుపుతున్నారు.

ఈ నేపథ్యంలో క్వార్టర్స్‌లో పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోన్న రష్యా... క్రొయేషియాపై విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. దీంతో రష్యా-క్రోయేషియా జట్ల మధ్య జరిగే పోరు ఉత్కంఠ రేపడం ఖాయంగా కనిపిస్తోంది.

దీంతో రష్యా సొంతగడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్‌లో సెమీస్‌‌కు చేరితే ఆ జ్ఞాపకార్థం రూబుల్‌లో సగం వంతు విలువ గల ప్రత్యేక నాణేన్ని విడుదల చేస్తామని సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రకటించింది. ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ రష్యా ''రష్యాలో ఫిఫా 2018 సాకర్‌ ప్రపంచకప్‌'' అని ముద్రించిన వెండి నాణేన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, July 7, 2018, 10:17 [IST]
Other articles published on Jul 7, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X