న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

Euro 2020: ఫుట్‌బాల్ టోర్నీలో మెరిసిన రిషభ్ పంత్!

Rishabh Pant Watches England Beat Germany at Euro 2020

లండన్‌: భారత క్రికెటర్లు తమకు దొరికిన విరామ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్( డబ్ల్యూటీసీ) ఫైనల్ ముగిసిన అనంతరం బయో బబుల్ నుంచి బయటకు వచ్చిన టీమిండియా క్రికెటర్లు యూకేలో ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమకు దొరికిన ఈ టైమ్‌ను హాయిగా గడపడానికి ప్రయత్నిస్తున్నారు. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.

ఆతిథ్య జట్టుతో టెస్ట్ సిరీస్‌కు ఇంకా ఆరు వారాల సమయం ఉంది. అన్ని రోజుల పాటు బయో బుడగలో ఉండటం కష్టం. అంతేకాకుండా ఆటగాళ్లు మానసికంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వారిని ఉల్లాసంగా ఉంచేందుకు మూడు వారాల పాటు టీమ్‌ఇండియా క్రికెటర్లకు విరామం ఇచ్చారు. బుడగ నుంచి బయటకు వెళ్లి గడిపేందుకు అనుమతి ఇచ్చారు.

దాంతో ఆటగాళ్లు యూకే పరిస్థితులను ఆస్వాదిస్తున్నారు. కెప్టెన్ విరాట్‌ కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి ఓ కెఫేకు వెళ్లి చక్కని కాఫీని ఆస్వాదించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను వీరిద్దరూ ఇన్‌స్టాలో పంచుకున్నారు. వన్డే, టెస్టు జట్ల వైస్‌ కెప్టెన్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానే కుటుంబ సమేతంగా బయటకు వెళ్లారు. భార్యా, బిడ్డలతో కలిసి విహరిస్తున్నారు. పిల్లలు ఎక్కువగా ఇష్టపడే పార్క్‌లు, ఆట స్థలాలకు వెళ్తున్నారు. ఎందుకంటే వీరిద్దరికీ 2-3 ఏళ్ల వయసు పిల్లలున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ మాత్రం ప్రస్తుతం జరుగుతున్న యూరో 2020 మ్యాచ్ చూడటానికి వెళ్లాడు. మంగళవారం రాత్రి లండన్‌లోని వింబ్లే స్టేడియంలో ఇంగ్లండ్‌, జర్మనీ మధ్య జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ను ఆస్వాదించాడు. తన ముగ్గురు ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లిన పంత్ అక్కడ సెల్ఫీలతో సందడి చేశాడు. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంగ్లండ్‌, జర్మనీ మ్యాచ్ చూడటం మంచి అనుభూతిని కలిగించిందంటూ ఈ ఫొటోలను అతడు ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

ఏ టీమ్‌కు సపోర్ట్ చేశావని ఒకరంటే, మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని మరొకరు అడిగారు. పంత్‌తోపాటు ఉన్న వాళ్లు ఇంగ్లండ్ జెర్సీలో కనిపించారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 2-0 గోల్స్‌ తేడాతో మూడుసార్లు చాంపియన్‌ అయిన జర్మనీ జట్టును ఓడించి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇంగ్లండ్‌ తరఫున స్టెర్లింగ్‌ (75వ ని.లో), హ్యారీ కేన్‌ (86వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. ఓ మేజర్‌ టోర్నీ ప్రీక్వార్టర్స్‌లో జర్మనీ ఓడడం ఇదే తొలిసారి.

Story first published: Wednesday, June 30, 2021, 14:22 [IST]
Other articles published on Jun 30, 2021
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X