Lionel Messi వాడి పడేసిన టిష్యూ పేపర్ ధర రూ. ఏడున్నర కోట్లు!

న్యూఢిల్లీ: లియోనల్ మెస్సీ వాడి పడేసిన టిష్యూ పేపర్ ధర రూ. ఏడున్నర కోట్లు! అవును గత 24 గంటలుగా సోషల్ మీడియాలో ఈ వార్త హల్‌చల్ చేస్తోంది. సెలెబ్రిటీల వస్తువులు వేలం వేస్తే ఈ స్థాయిలో భారీ ధర పలకడం గతంలో కూడా చూశాం. కానీ ఓ స్టార్ ప్లేయర్ వాడిపడేసిన టిష్యూ పేపర్‌కే ఇంత ధర అంటేనే నమ్మశక్యం కావడం లేదు. అవును ఇది నిజమే అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ కన్నీళ్లు తుడిచిన ఆ టిష్యూ పేపర్‌కు వేలం ఫిక్స్ చేసిన ధర అది. అసలు విషయం ఏంటంటే.. ఇటీవలే స్పానిష్ ఫుట్‌బాల్‌ క్లబ్ బార్సిలోనాతో త‌న‌కున్న రెండు ద‌శాబ్దాల అనుబంధాన్ని లియోనల్ మెస్సీ తెంచుకున్నాడు.

Photos: బార్సిలోనాకు గుడ్‌బై చెబుతూ భావోద్వేగానికి గురైన స్టార్ ప్లేయర్

వీడ్కోలు వేడుక సందర్బంగా..

వీడ్కోలు వేడుక సందర్బంగా..

గత ఆదివారం(ఆగస్టు 8న) జరిగిన క్లబ్ వీడ్కోలు వేడుకలో తన అనుభవాలను పంచుకుంటూ క్లబ్ వీడుతానని ఎన్నడూ అనుకోలేదని భావోద్వేగానికి గురయ్యాడు. కెరీర్‌ ముగిసేంతవరకు బార్సిలోనాతోనే ఉందామ‌ని నిర్ణయించుకున్నానని, అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తాను క్లబ్‌ను వీడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నాడు. అయితే ఎప్పుడో ఒక‌సారి తాను మ‌ళ్లీ తిరిగి వ‌స్తానని ఈ అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ పేర్కొన్నాడు. తన జీవితం బార్కాలోనే ప్రారంభమైందని, ఇక్కడే చాలా నేర్చుకున్నానని తెలిపాడు. తాను ఇప్పుడీ స్థాయిలో ఉండడానికి బార్కానే కార‌ణమని మెస్సీ అన్నాడు.

కన్నీళ్లు తుడుచుకున్న టిష్యూ..

కన్నీళ్లు తుడుచుకున్న టిష్యూ..

ఈ సందర్భంగా మెస్సీ ఒక టిష్యూ పేపర్‌తో ఉబికి వస్తున్న కన్నీళ్లతో పాటు ముక్కును తుడుచుకున్నాడు. సాధారణంగా వాడేసిన టిష్యూ పేపర్‌కు విలువ ఉండదు. ఇక్కడ టిష్యూను వాడింది మెస్సీ.. ఇంకేముంది అతను వాడిన టిష్యూ పేపర్‌ను తీసుకొని ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇంటర్నేషనల్ ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫాం ఎమ్‌ఈకెడో లో వేలానికి పెట్టాడు.

అయితే ఫుట్‌బాల్‌ దిగ్గజం కన్నీళ్లు తుడిచిన ఆ టిష్యూ పేపర్‌కు సదరు వ్యక్తి అక్షరాల రూ. ఏడున్నర కోట్లు ( 1 మిలియన్‌ డాలర్లు) ధరను ఫిక్స్ చేశాడు. ఇంకేముంది ఇది తెలుసుకున్న అభిమానులు ''వార్ని.. మెస్సీ వాడి పడేసిన టిష్యూ పేపర్‌కు ఇంత ధర'' అంటూ నోరు వెళ్లబెట్టారు. ఫన్నీ మీమ్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు. టిష్యూపేపర్‌కే ఇంత ఉంటే.. అతని డ్రాయర్, వాడిపడేసిన మిగతా వస్తువులకు ఎంత ధర ఉంటోందోనని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు.

రెండు దశాబ్దాల ప్రయాణం..

రెండు దశాబ్దాల ప్రయాణం..

13 ఏళ్ల వ‌య‌సులో 2000 సంవత్సరంలో బార్సిలోనాతో మొదలైన మెస్సీ ప్రయాణం దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగింది. 17 సీజ‌న్ల పాటు బార్సిలోనాతోనే ఉన్న మెస్సీ.. ఆ క్లబ్ త‌ర‌ఫున అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. క్లబ్ ఆర్థిక ప‌రిస్థితి స‌రిగా లేక‌పోవ‌డంతో లియోనెల్ మెస్సీతో కాంట్రాక్ట్‌ను పొడిగించలేద‌ని బార్సిలోనా ఫుట్ క్లబ్ ప్రకటించింది.

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన బార్సిలోనా క్ల‌బ్‌‌లో ఉండేందుకు మెస్సీ తన జీతాన్ని 50 శాతం తగ్గించుకోవాలనుకున్నానని తెలిపాడు. 'జీతం పెంచ‌డం కాదు.. 50 శాతం త‌గ్గించుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నాను. బార్సిలోనాలోనే కొన‌సాగేందుకు అన్ని ప్రయత్నాలు చేశాను' అని మెస్సీ ఫేర్‌వెల్ సంద‌ర్భంగా చెప్పాడు.

అడ్డొచ్చిన రూల్స్..

అడ్డొచ్చిన రూల్స్..

అయితే స్పానిష్ రూల్స్ నేపథ్యంలో మెస్సీకి అది సాధ్యం కాలేదు. స్పానిష్ ఉపాధి చ‌ట్టం ప్ర‌కారం.. ఎవ‌రైనా ఉద్యోగి త‌న వేత‌నంలో 50 శాతం మాత్ర‌మే కోత విధించుకోవ‌చ్చు. అంత‌కు మించి అవ‌కాశం ఉండ‌దు. ఆర్థిక‌ప‌ర‌మైన అవ‌క‌త‌వ‌క‌ల‌ను అడ్డుకోవ‌డానికి స్పెయిన్ ఈ నిబంధ‌న తీసుకొచ్చింది.

ఇక బార్సిలోనా క్లబ్‌ను వీడిన మెస్సీ తాజాగా పారిస్ సెయింట్ జర్మన్ ఫుట్‌బాల్ క్లబ్ (పీఎస్‌జీ)కి ఆడనున్నాడు. ఈ మేరకు అతడు ఫ్రెంచ్‌ క్లబ్‌ పారిస్‌ సెయింట్‌ జెర్మయిన్‌ (పీఎస్‌జీ)తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. రెండేళ్ల కాలానికి మెస్సీకి దాదాపు 7 కోట్ల యూరోలు (రూ. 610 కోట్లు) చెల్లించనున్నట్లు సమాచారం.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
అంచనాలు
VS
Story first published: Wednesday, August 18, 2021, 17:40 [IST]
Other articles published on Aug 18, 2021
+ మరిన్ని
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X