ఫటోర్డా: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్)-7లో గోవా ఎఫ్‌సీ కీలక విజయాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 2-1తో బెంగళూరు ఎఫ్‌సీపై గెలిచింది. దీంతో ప్లే ఆఫ్ బెర్త్‌కు మరింత చేరువైంది. గోవా తరఫున ఇగోర్ అంగులో(20వ నిమిషం), రీడిమ్ ట్లాంగ్(23వ నిమిషం) గోల్స్ చేయగా.. సురేశ్ వాంగ్జామ్ (33వ నిమిషం) బెంగళూరుకు ఏకైక గోల్ అందించాడు. ఈ విక్టరీతో గోవా.. వరుసగా 12 మ్యాచ్‌ల్లో ఓటమెరుగని తన ఓన్ రికార్డును మెరుగుపర్చుకుంది. ప్రారంభం నుంచే దూకుడిగా ఆడిన గోవా.. మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ కొట్టడంతో బెంగళూరు కోలుకోలేకపోయింది. ప్రస్తుతం 30 పాయింట్లతో గోవా మూడో ప్లేస్‌లో ఉండగా, బెంగళూరు 22 పాయింట్లతో ఏడో ప్లేస్‌లో కొనసాగుతోంది.
కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ, చెన్నయిన్ ఎఫ్‌సీ మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. గ్యారీ హూపర్(29వ నిమిషం) కేరళకు గోల్ అందిస్తే, ఫతుల్లో(10వ నిమిషం) చెన్నయిన్‌కు గోల్ అందించాడు. ఆట ప్రారంభంలో వేగంగా కదిలిన ఇరు జట్లు గోల్స్ చేసే అవకాశాలను బాగా సృష్టించుకున్నాయి. దీంతో పదో నిమిషంలో రైట్ ఫ్లాంక్ నుంచి ఎడ్విన్ అందించిన పాస్‌ను డ్రిబ్లింగ్ చేస్తూ వెళ్లిన ఫతుల్లా అదును చూసి కేరళ డిఫెన్స్‌ను ఛేదించాడు. దీంతో షాక్‌కు గురైన కేరళ అటాకింగ్‌లో పదును పెంచింది. వరుసపెట్టి ప్రత్యర్థి సర్కిల్‌లోకి దూసుకెళ్లి అవకాశాలను సృష్టించుకుంది. రైట్ ఫ్లాంక్ నుంచి వచ్చిన దీపక్ చేత్తో అడ్డుకోవడంతో కేరళకు పెనాల్టీ కార్నర్ లభించింది. దీనిని హూపర్ గోల్‌గా మల్చడంతో స్కోర్ సమమైంది. ఇక ఇక్కడి నుంచి ఇరు జట్లు గోల్స్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
మైఖేల్‌లో ఫాంటసీ పుట్‌బాల్ ఆడండి. బహుమతులు గెలవండి