న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

FIFA World Cup 2022: ఖతర్నాక్ బైసికల్ కిక్.. బ్రెజిల్ నయా హీరో కళ్లు చెదిరే విన్యాసం! (వీడియో)

FIFA World Cup 2022: Richarlison double helps Brazil outclass Serbia 2-0

లుసైల్(ఖతార్): ఫుట్‌బాల్‌లో కళ్లు చెదిరే బైసికల్ కిక్ గోల్‌కు స్పెషాలిటీ ఉంటుంది. అమాంతం గాల్లోకి ఎగిరి అలాంటి గోల్ కొట్టాలంటే టాలెంట్‌తో పాటు టైమింగ్ కూడా కుదరాలి. ఈ తరం వాళ్లలో పోర్చుగల్ సూపర్ స్టార్ రొనాల్డో ఇలాంటి గోల్స్ కొట్టడంలో దిట్ట. ఇప్పుడు బ్రెజిల్ యంగ్ సెన్సేషన్ రిచర్లిసన్.. రొనాల్డోని మరిపించాడు. అచ్చం రొనాల్డో మాదిరిగా బైసికల్ కిక్‌తో గోల్ కొట్టి ఫిఫా ప్రపంచకప్‌లో నయా స్టార్ అయిపోయాడు. 9 నిమిషాల వ్యవధిలోనే రిచర్లిసన్ రెండు గోల్స్ కొట్టి బ్రెజిల్‌కు శుభారంభం అందించాడు.

రెండు గోల్స్‌తో..

రెండు గోల్స్‌తో..

ఈసారి సాకర్‌ ప్రపంచకప్‌‌లో హాట్‌ ఫేవరెట్‌‌గా బరిలోకి దిగిన బ్రెజిల్‌ తొలి మ్యాచ్‌లో అంచనాలకు తగ్గ ప్రదర్శన చేయకపోయినా.. రిచర్లిసన్ పుణ్యమా టోర్నీని విజయంతో ఆరంభించింది. శుక్రవారం గ్రూప్‌-జిలో ఆసక్తికరంగా సాగిన పోరులో ఈ మాజీ ఛాంపియన్‌ 2-0తో సెర్బియాను ఓడించింది. సెర్బియా గోల్‌కీపర్‌ మిలింకోవిచ్‌, ఆ జట్టు డిఫెండర్లు తమ శక్తికి మించి ఈ మ్యాచ్‌లో బ్రెజిల్‌ దాడులను అడ్డుకున్నారు.

కచ్చితంగా గోల్‌ అయ్యేలా కనిపించిన మూడు ప్రయత్నాలను మిలింకోవిచ్‌ అడ్డుకున్నాడు. స్టార్‌ ఆటగాడు నెయ్‌మార్‌ను కట్టడి చేయడంలో సెర్బియా విజయవంతం అయింది. కానీ రిచర్లిసన్‌ ఆ జట్టుపై పిడుగులా పడ్డాడు. 63, 72 నిమిషాల్లో అతను కళ్లు చెదిరే రెండు ఫీల్డ్‌ గోల్స్‌తో బ్రెజిల్‌ను గెలిపించాడు.

కళ్లు చెదిరే విన్యాసంతో..

సహచరుడు విన్సియస్‌ జూనియర్‌ పాస్‌ను అందుకుని దాన్ని ఒడుపుగా పైకి లేపిన రిచర్లిసన్‌.. ఎడమవైపు పల్టీ కొడుతూ ఎదురుగా ఉన్న డిఫెండర్‌ను తప్పించి బంతిని గోల్‌లోకి పంపాడు. సెర్బియా గోల్‌కీపర్‌ గట్టిగా ప్రయత్నించినా బంతి అతడికి చిక్కకుండా మెరుపువేగంతో లోపలికి దూసుకెళ్లింది. అంతకుముందు రిచర్లిసన్‌ తొలి గోల్‌కు కూడా విన్సియసే సహకరించాడు.

అతను చేసిన గోల్‌ ప్రయత్నాన్ని గోల్‌కీపర్‌ అడ్డుకోగా.. నెట్‌కు సమీపంలో కాచుకుని ఉన్న రిచర్లిసన్‌ రీబౌండ్‌ అయిన బంతిని గోల్‌లోకి పంపించేశాడు. దీనికి ముందు, తర్వాత బ్రెజిల్‌ చేసిన ప్రయత్నాలు కొన్ని త్రుటిలో తప్పిపోగా.. కొన్నింటిని మిలింకోవిచ్‌ సమర్థంగా అడ్డుకున్నాడు. నెయ్‌మార్‌ 50వ నిమిషంలో కొట్టిన ఫ్రీకిక్‌.. ఇంకో అయిదు నిమిషాల తర్వాత పెనాల్టీ ప్రాంతం నుంచి కొట్టిన షాట్‌ ఫలితాన్నివ్వలేదు.

నెయమార్‌కు గాయం..

నెయమార్‌కు గాయం..

తొలి మ్యాచ్‌లో చీలమండకు దెబ్బ తగిలి ఎక్కువసేపు మ్యాచ్‌లో కొనసాగలేక మైదానాన్ని వీడిన నెయ్‌మార్‌ గ్రూప్‌ దశలో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. 2014లో క్వార్టర్స్‌లో తీవ్రంగా గాయపడిన నెయ్‌మార్‌ స్ట్రెచర్‌ మీద బయటికి వెళ్లాల్సి వచ్చింది. తర్వాత సెమీస్‌లో బ్రెజిల్‌కు ఘోర పరాభవం ఎదురైంది. ఇప్పుడు కూడా నెయ్‌మార్ మైదానం వీడటంతో బ్రెజిల్‌కు ఓటమి తప్పదేమోనని అంతా అనుకున్నారు. కానీ యువ ఆటగాడు రిచర్లిసన్ అద్భుత ప్రదర్శనతో విజయాన్నందించాడు.

Story first published: Saturday, November 26, 2022, 9:19 [IST]
Other articles published on Nov 26, 2022
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X