న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

FIFA World Cup 2022 విజయం.. కీలక ప్రకటన చేసిన లియోనల్ మెస్సీ!

 FIFA World Cup 2022: Lionel Messi says he will not retire from Argentinian national team

దోహా: ఫిఫా ప్రపంచకప్ గెలవాలనే కలను ఎట్టకేలకు అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ నెరవేర్చుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్‌లో దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ మెస్సీ సేన విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మెగా టోర్నీ తర్వాత లియోనల్ మెస్సీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని, కెరీర్‌లో లోటుగా ఉన్న ప్రపంచకప్ కూడా గెలవడంతో అతని వీడ్కోలు లాంఛనమేనని అంతా భావించారు. కానీ మెస్సీ మాత్రం సంచలన ప్రకటన చేశాడు.

రిటైర్మెంట్ లేదు..

రిటైర్మెంట్ లేదు..

తాను జాతీయ ఫుట్ బాల్ జట్టు నుంచి రిటైర్ కావడం లేదని, విశ్వవిజేతగా మరికొన్ని మ్యాచ్‌లు ఆడి..ఛాంపియన్‌గా ఆ అనుభూతిని పొందాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఫ్రాన్స్‌తో విజయానంతరం మాట్లాడిన మెస్సీ.. రిటైర్మెంట్‌ ఇప్పట్లో లేదని స్పష్టం చేశాడు.'నేను నా కెరీర్‌ను దీంతో ముగిద్దామని అనుకున్నాను. ఇప్పటి వరకు నా కెరీర్‌లో అందనది ఇదే. ఇకపై నేను ఏమీ అడగను. నేను కోపా సాధించగలిగాను. ఇప్పుడు ప్రపంచకప్‌ కోసం తీవ్రంగా పోరాడాను. నా కెరీర్‌ చరమాంకంలో దీన్ని సాధించాను. కానీ నేను ఫుట్‌బాల్‌ను ప్రేమిస్తాను. ప్రపంచ చాంపియన్‌గా మరికొన్ని గేమ్స్‌ ఆడాలనుకుంటున్నాను'అని మెస్సీ చెప్పుకొచ్చాడు.

కలనుసాకారం...

కలనుసాకారం...

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫిఫా ప్రపంచకప్ విజయంపై మెస్సీ సంతోషం వ్యక్తం చేశాడు. 'ప్రపంచ చాంపియన్‌ కావాలని చాలా సార్లు కలలుగన్నాను. సాధించలేకపోయాను. కానీ, ఇప్పుడు దీన్ని నమ్మలేకపోతున్నా. మమ్మల్ని నమ్మిన వారికి, నాకు మద్దుతు ఇచ్చినవారికి, నా కుటుంబానికి ధన్యవాదాలు. అర్జెంటీనా సమష్టిగా పోరాడితే అనుకొన్న లక్ష్యాన్ని సాధించగలదని మరోసారి నిరూపితమైంది. వ్యక్తుల కంటే ఎక్కువగా ఈ ఘనత జట్టుకే చెందుతుంది. అర్జెంటీనా వాసుల కల కోసం సమష్టిగా పోరాడటంలో ఉన్న బలం ఇది'అని రాసుకొచ్చాడు.

 అన్ని టైటిళ్లు గెలిచిన..

అన్ని టైటిళ్లు గెలిచిన..

ఫిఫా ప్రపంచకప్ టైటిల్ లోటును తీర్చుకున్న మెస్సీ.. కెరీర్‌లో అన్ని ఘనతలను సాధించిన ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ప్రపంచకప్‌ టోర్నీల్లో రెండుసార్లు గోల్డెన్‌ బాల్‌ అవార్డు అందుకొన్న ఏకైక ఆటగాడు మెస్సీనే. ఏడు సార్లు బాలెన్‌ డి ఓర్‌ అవార్డు అందుకొన్న మెస్సీఅండర్‌ -20 ప్రపంచకప్‌, ఒలింపిక్‌ గోల్డ్‌, కోపా అమెరికా, ఫిఫా ప్రపంచకప్‌ టైటిళ్లు కూడా సాధించాడు.

 రికార్డులే రికార్డులు..

రికార్డులే రికార్డులు..

ఈ సీజన్‌లో భీకరమైన ఫామ్‌ కనబర్చిన మెస్సీ.. మొత్తం 29 మ్యాచ్‌లు ఆడి 24 గోల్స్‌ చేశాడు. 18 గోల్స్‌కు అసిస్ట్‌ చేయడం విశేషం. అంటే మొత్తం 42 గోల్స్‌లో మెస్సీ పాత్ర ఉంది. ఈ సీజన్‌లో 23 సార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌లను అందుకొన్నాడు. 8వ సారి బాలెన్‌ డీ ఓర్‌ రేసులో ముందున్నాడు. తాజా ప్రపంచకప్‌లో అత్యధిక మ్యాచ్‌లు(26), అత్యధిక మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌(11)లు, అత్యధిక గోల్డెన్‌ బాల్‌ అవార్డు(2)లు పొందిన ఆటగాడిగా పలురికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

Story first published: Monday, December 19, 2022, 14:16 [IST]
Other articles published on Dec 19, 2022
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X