న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

FIFA World Cup 2022: గెలిచి నిలిచిన అర్జెంటీనా.. మెక్సికో, సౌదీ అరేబియా ఔట్!

FIFA World Cup 2022: Argentina, Poland progress to last 16; Mexico miss out on goal difference

దోహా: ఫిఫా ప్రపంచకప్ 2022లో నాకౌట్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అర్జెంటీనా అదరగొట్టింది. బుధవారం గ్రూప్ సీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 2-0తో పోలాండ్‌ను ఓడించి ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఆట 46వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు అలెక్స్ మాక్ అలిస్టర్ గోల్ చేసి 1-0 ఆధిక్యం అందించగా.. 67వ నిమిషంలో జులియన్ అల్వరెజ్ మరో గోల్‌ కొట్టి 2-0‌తో ఆధిక్యాన్ని డబుల్ చేశాడు. ఈ ఆధిక్యాన్ని చివరివరకూ కాపాడుకున్న అర్జెంటీనా విజయంతో నాకౌట్ చేరింది. దాంతో ఆఖరి ప్రపంచకప్ ఆడుతున్న అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ టైటిల్ గెలవాలనే ఆశలు సజీవంగా ఉన్నాయి.

గ్రూప్‌ సీలో జరిగిన మరో మ్యాచ్‌లో మెక్సికో 2-1తో సౌదీ అరేబియాని ఓడించింది. ఈ ఫలితంతో అర్జెంటీనా‌తో పోలాండ్‌కు మార్గం సుగుమం చేసింది.సౌదీ అరేబియాతో మ్యాచ్‌లో 2-1 తేడాతో ఓడిపోయిన అర్జెంటీనా.. ఆ తర్వాత 2-0తో మెక్సికోపై గెలుపొందింది. అయితే సౌదీ అరేబియా- మెక్సికో మధ్య మ్యాచ్‌ ఫలితం మీద అర్జెంటీనా ప్లేఆఫ్స్ ఆశలు ఆధారపడి ఉండడంతో లియోనెల్ మెస్సీకి పోలాండ్‌తో జరిగే మ్యాచ్ ఆఖరి వరల్డ్ కప్ మ్యాచ్ అవుతుందని అనుకున్నారంతా. అయితే మెక్సికో, సౌదీని ఓడించి అర్జెంటీనాకి లైన్ క్లియర్ చేసింది. లియోనెల్ మెస్సికీ ఇది 999వ మ్యాచ్ కాగా 22వ ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్ కావడం గమనార్హం.

FIFA World Cup 2022: Argentina, Poland progress to last 16; Mexico miss out on goal difference

ఆఖరి ఫిఫా వరల్డ్ కప్ ఆడబోతున్న లియోనెల్ మెస్సీ, ఈసారి టైటిల్ గెలవాలనే భారీ ఆశలతో టోర్నీలో అడుగుపెట్టాడు. అయితే సౌదీ అరేబియాతో మ్యాచ్‌లో గోల్ చేసిన మెస్సీ, మెక్సికోతో జరిగిన మ్యాచ్‌లో కూడా గోల్ సాధించాడు. ఈ విజయంతో గ్రూప్ సీలో 6 పాయింట్లతో అర్జెంటీనా టాపర్‌గా నిలవగా.. 4 పాయింట్లతో పోలాండ్ రెండో స్థానాన్ని అందుకుంది. నాలుగు పాయింటే అందుకున్న మెక్సికో గోల్స్ తేడాతో నాకౌట్ బెర్త్ అందుకోలేకపోయింది. మూడు పాయింట్లతో చివరి స్థానంలో నిలిచిన సౌదీ అరేబియా టోర్నీలో ముందడుగు వేయలేకపోయింది.

సూపర్ 16 రౌండ్‌లో అర్జెంటీనా జట్టు, ఆస్ట్రేలియాతో తలపడనుంది. నెదర్లాండ్స్ జట్టు, యూఎస్‌ఏతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ రెండు మ్యాచుల్లో గెలిచిన జట్లు, ప్రత్యర్థులుగా సూపర్ 8 రౌండ్‌కి చేరుకుంటాయి. సూపర్ 16 రౌండ్‌లో పోలాండ్ జట్టు, ఫ్రాన్స్‌తో తలపడనుండగా.. ఇంగ్లండ్ జట్టు, సెనెగల్‌తో ప్రిక్వార్టర్స్ మ్యాచ్ ఆడనుంది.

Story first published: Thursday, December 1, 2022, 12:05 [IST]
Other articles published on Dec 1, 2022
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X