న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

చిన్నతనంలో సిగ్గరి, వార్ జోన్‌లో శరణార్థిగా: క్రొయేషియాను పైనల్‌కు చేర్చిన మోడ్రిచ్

By Nageshwara Rao
FIFA World Cup 2018: The story of Croatias mid-field maestro Luka Modric

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో క్రొయేషియా ఫైనల్ చేరి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, క్రొయేషియా జట్టు వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించిన ఆటగాడు లుకా మోడ్రిచ్. దీంతో క్రొయేషియాలో లుకా మోడ్రిచ్‌ పేరు మారుమ్రోగిపోతోంది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

గురువారం లుజ్నికీ స్టేడియంలో జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై 2-1 తేడాతో గెలిచి తొలిసారిగా ఫైనల్‌కు చేరింది. దీంతో వరల్డ్ కప్ ఫైనల్లో తలపడే రెండు జట్లు ఏవో తెలిసిపోయింది. ఆదివారం మాస్కోలని లుజ్నికి స్టేడియంలో జరిగే పైనల్లో ఫ్రాన్స్‌తో క్రొయేషియా తలపడనుంది.

క్రొయేషియా జట్టు అత్యుత్తమ ప్రదర్శన

క్రొయేషియా జట్టు అత్యుత్తమ ప్రదర్శన

1998 వరల్డ్ కప్‌లో సెమీఫైనల్‌ చేరుకోవడమే క్రొయేషియా జట్టు అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. క్రొయేషియాను తొలిసారి ఫైనల్‌కు చేర్చిన లుకా మోడ్రిచ్ చిన్నతనంలో పేలగా ఉండటంతో పాటు బంతిని తన్నేందుకు సిగ్గుపడటంతో కోచ్‌లు పుట్‌బాల్ ఆడేందుకు అతడు పనికిరాడని అన్నారంట. లుకా మోడ్రిచ్‌కు 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతడి గ్రాండ్‌ఫాదర్ కాల్చివేయబడ్డాడు. దీంతో వార్ జోన్‌లో వీరి కుటుంబం శరణార్థులుగా ఉంది.

లుకా మోడ్రిచ్ బాల్యం అంతా యుద్ధవాతావరణంలోనే

అతడి బాల్యం మొత్తం యుద్ధవాతావరణంలో గడిచింది. అలాంటి క్రొయేషియాలో పుట్‌బాల్‌‌కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. వాస్తవానికి క్రొయేషియాలో క్రీడలకు ఆదరణ కలిగించడంలో ఉమ్మడి యుగొస్లేవియా కీలకపాత్ర పోషించింది. యుగొస్లేవియా నుంచి విడిపోక ముందు క్రొయేషియా రీజియన్‌ల క్రీడలకు ఎక్కువ నిధులు ఖర్చు చేయడంలో అద్భుతమైన మౌలిక వసతులు సమకూరాయి.

అద్భుతమైన ఆటగాళ్లు వెలుగులోకి ఇలా

అద్భుతమైన ఆటగాళ్లు వెలుగులోకి ఇలా

ఆ తర్వాత స్వతంత్ర దేశంగా క్రొయేషియా ఏర్పడిన అనంతరం ఆర్థికవనరులు లేకున్నా క్రీడలకు సముచిత ప్రాధాన్యం కల్పించడంతో ఆ దేశం నుంచి అద్భుతమైన ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. అలా వెలుగులోకి వచ్చిన ఆటాగళ్లలో లుకా మోడ్రిచ్ ఒకడు. క్రొయేషియా నుంచి ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లో రియల్ మాడ్రిడ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. క్రొయేషియాలో ఫుట్‌బాల్‌కు ఎంత ఆదరణ ఉందంటే వారి దేశ జనాభా 40 లక్షలు.

 క్రొయేషియాలో రిజిస్టరైన ఫుట్‌బాల్ క్రీడాకారులు 1.2 లక్షలు

క్రొయేషియాలో రిజిస్టరైన ఫుట్‌బాల్ క్రీడాకారులు 1.2 లక్షలు

అయితే, అక్కడ రిజిస్టరైన ఫుట్‌బాల్ క్రీడాకారులు 1.2 లక్షలు.. ఇది ఆ దేశ జనాభాలో 3 శాతం కాగా.. బ్రెజిల్‌లో రిజిస్టరైన ఫుట్‌బాల్ క్రీడాకారులు 1శాతం లోపే. అందుకే క్రొయేషియా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో సంచలన విజయాలు సాధించి ఫైనల్ చేరింది. క్రొయేషియాలో స్థిరపడిన ఇతరదేశాల ఆటగాళ్ల ఆటతీరుతోనే ఆ జట్టు వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరింది. స్థానికంగా ఆడే ఒకరిద్దరు ఆటగాళ్లు మాత్రమే జట్టులో చోటు చేసుకోగా ఎక్కడినుంచో వచ్చి స్థిరపడిన ఆటగాళ్లతో క్రొయేషియా బలమైన జట్టుగా తయారైంది.

ఫైనల్‌కు చేరడం ద్వారా క్రొయేషియా ఖాతాలో మరో రికార్డు

ఫైనల్‌కు చేరడం ద్వారా క్రొయేషియా ఖాతాలో మరో రికార్డు

రష్యా వేదికగా జరుగుతున్న ఫిపా వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు చేరడం ద్వారా క్రొయేషియా మరో రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌ చేరిన చిన్నదేశంగా (జనాభా పరంగా) క్రొయేషియా నిలిచింది. క్రొయేషియా జనాభా సుమారు నలభై లక్షలు. దీంతో 1950లో వరల్డ్‌కప్ ఫైనల్‌ చేరిన చిన్న దేశంగా ఉరుగ్వే చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత అంటే 68 ఏళ్ల తర్వాత 2018 ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌ చేరిన చిన్న దేశంగా క్రొయేషియా చరిత్ర సృష్టించింది.

Story first published: Friday, July 13, 2018, 13:44 [IST]
Other articles published on Jul 13, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X