న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

మెస్సీకి తీరని ఆవేదన... రొనాల్డోకి బాధను మిగిల్చిన రష్యా వరల్డ్ కప్

By Nageshwara Rao
FIFA World Cup 2018: Lionel Messi, Cristiano Ronaldo walk into sunset

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఒక్క రాత్రిలో మొత్తం జరిగిపోయింది. వరల్డ్‌కప్‌ని ముద్దాడాలనే చిరకాల వాంఛతో వరల్డ్ కప్ కోసం 2000 కిలోమీటర్లు ప్రయాణించారు. భారీ అంచనాలతో టోర్నీలోకి అడుగుపెట్టిన పుట్‌బాల్ దిగ్గజాలు లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో ఆ ఆశ తీరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించారు.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ఈ వరల్డ్ కప్‌లో అర్జెంటీనా, పోర్చుగల్ జట్ల ఓటమి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానుల్ని కలచివేస్తోంది. శనివారం ఫ్రాన్స్‌తో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో అర్జెంటీనా 3-4 తేడాతో ఓడి మెస్సీకి తీరని వేదనను మిగల్చగా.... ఉరుగ్వే చేతిలో 1-2 తేడాతో పోర్చుగల్ ఓడటంతో రొనాల్డో కూడా ఇంటిదారి పట్టారు.

వయసు రీత్యా 31 ఏళ్ల మెస్సీ, 33 ఏళ్ల రొనాల్డోకి ఇదే చివరి వరల్డ్ కప్ కావడంతో ఈ దిగ్గజ ప్లేయర్లు రిక్త హస్తాలతో మరోసారి స్వదేశానికి పయనమయ్యారు. గ్రూప్‌ స్టేజిలో వరుస విజయాలందుకున్న ఫ్రాన్స్‌ తన జైత్రయాత్రను కొనసాగించింది. అద్భుత ఫామ్‌లో ఉన్న కైలియన్ మొబప్పె వరుసగా రెండు అద్భుత గోల్స్‌ అందించి తమ జట్టుకు విజయాన్ని అందించాడు.

మెస్సీ జట్టుని ఇంటికి పంపిన 19 ఏళ్ల కైలియన్ మొబప్పె పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతుంది. లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలు తమ కెరీర్‌లో ఎన్నో టోర్నీలను సొంతం చేసుకున్నప్పటికీ వరల్డ్ కప్ మాత్రం అందని ద్రాక్షగానే మిగులిపోయింది. 2006 నుంచి ఈ ఇద్దరూ వరల్డ్ కప్ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు.

 2006 నుంచి అలుపెరగని పోరాటం

2006 నుంచి అలుపెరగని పోరాటం

2006 ప్రపంచకప్‌ నుంచి మెస్సీ, రొనాల్డోలు వరల్డ్‌కప్‌ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. 2006లో అర్జెంటీనా క్వార్టర్స్‌లో వెనుదిరగగా.. పోర్చుగల్ సెమీ ఫైనల్స్‌లో ఇంటిదారి పట్టింది. జర్మనీ వేదికగా జరిగిన ఈ వరల్డ్ కప్‌లో ఇద్దరూ చెరొక గోల్ మాత్రమే చేశారు.

నాకౌట్ దశలో నిష్క్రమించిన పోర్చుగల్

నాకౌట్ దశలో నిష్క్రమించిన పోర్చుగల్

2010లో జరిగిన ఈ వరల్డ్‌కప్‌‌లో అర్జెంటీనా క్వార్టర్స్‌లో వెనుదిరగగా.. పోర్చుగల్ నాకౌట్ దశలోనే నిష్క్రమించింది. దక్షిణాఫ్రికా వేదికగా ఈ వరల్డ్ కప్‌లో రొనాల్డో ఒక ఒక్క గోల్‌ చేయగా లియోనల్ మెస్సీ కనీసం ఖాతా కూడా తెరవలేదు.

 2014లో ఫైనల్‌కు చేరిన అర్జెంటీనా

2014లో ఫైనల్‌కు చేరిన అర్జెంటీనా

2014‌లో అర్జెంటీనా అద్భుత ప్రదర్శన చేసింది. ఆ టోర్నీలో అద్భుతంగా రాణించిన మెస్సీ మొత్తం 4 గోల్స్‌ చేశాడు. దీంతో జర్మనీతో జరిగిన ఫైనల్లో అర్జెంటీనాదే కప్‌ అని అంతా భావించారు. బ్రెజిల్‌లోని రియో డి జనీరో వేదికగా జరిగిన ఈ వరల్డ్ కప్ ఫైనల్లో జర్మనీ విజయం సాధించింది. ఇక, పోర్చుగల్ గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది.

మెస్సీతో పోలిస్తే క్రిస్టియానో రొనాల్డో అద్భుత ప్రదర్శన

మెస్సీతో పోలిస్తే క్రిస్టియానో రొనాల్డో అద్భుత ప్రదర్శన

2018లో రష్యా వేదికగా జరిగిన వరల్డ్ కప్‌లో మెస్సీతో పోలిస్తే క్రిస్టియానో రొనాల్డో అద్భుతంగా రాణించాడు. తొలి మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ చేసిన రొనాల్డో ఆ తర్వాత గ్రూప్‌ దశలోనూ మరో గోల్‌ కొట్టి పోర్చుగల్‌ను నాకౌట్‌కు చేర్చాడు. అయితే, కీలకమైన ఉరుగ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఫెయిలయ్యాడు. మరోవైపు మెస్సీ కూడా తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనా.. నాకౌట్‌ అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గోల్ చేసి.. అర్జెంటీనాను గెలిపించాడు. నాకౌట్‌లో ఫ్రాన్స్‌తో మ్యాచ్‌లో ఒక గోల్‌ కూడా నమోదు చేయలేదు.

Story first published: Monday, July 2, 2018, 16:04 [IST]
Other articles published on Jul 2, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X