న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

చివరిదశకు గ్రూప్ స్టేజి: ఫిఫా వరల్డ్ కప్‌లో నాకౌట్‌కు చేరే జట్లివే!

By Nageshwara Rao
FIFA World Cup 2018: Knockout round qualifying scenarios explained

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న 21వ ఫిఫా వరల్డ్ కప్ గ్రూప్ స్టేజి మ్యాచ్‌లు సోమవారంతో ముగియనున్నాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్-2లో ఉన్న రెండు జట్లు రౌండ్ 16కు అర్హత సాధించనున్నాయి. ఈ టోర్నీలో మొత్తం 32 జట్లు తలపడగా గ్రూప్ స్టేజి నుంచి నాకౌట్‌కు 16 జట్లు వెళ్లనున్నాయి.

FIFA World Cup 2018 పాయింట్ల పట్టిక

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

దీంతో నాకౌట్‌కు ఏయే జట్లు వెళతాయనే ఆతృత సగటు సాకర్ అభిమాని మదిలో మెదులుతోంది. గ్రూప్ స్టేజిలో ఏవైనా రెండు జట్ల పాయింట్ల సమం అయితే గోల్ తేడాతో పాటు గ్రూప్ స్టేజిలో ఆయా జట్లు నమోదు చేసిన అన్ని గోల్స్‌ను ఫిఫా పరగణనలోకి తీసుకోనుంది.

గ్రూప్ స్టేజి నుంచి రౌండ్-16కు ఏయే జట్లు అర్హత సాధిస్తాయో ఒక్కసారి పరిశీలిస్తే:

గ్రూప్ ఏ:

గ్రూప్ ఏ:

రష్యా, ఉరుగ్వే జట్లు దాదాపుగా నాకౌట్‌కు చేరినట్లే. సోమవారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు నెగ్గితే ఆ జట్టు నాకౌట్‌ బెర్తుని ఖరారు చేసుకుంటుంది. ఉరుగ్వే జట్టుతో పోలిస్తే రష్యా గోల్స్‌ తేడాతో ముందంజలో ఉంది.

గ్రూప్ బి:

గ్రూప్ బి:

స్పెయిన్, పోర్చుగల్ జట్లు నాలుగు పాయింట్లతో ఈ గ్రూపులో అగ్రస్థానంలో ఉన్నాయి. గోల్స్ తేడాలో కూడా స్పెయిన్, పోర్చుగల్ సమానంగా ఉన్నాయి. ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్ డ్రాగా ముగిస్తే, ఫెయిర్ ప్లే పాయింట్లు విజేతను ఎవరో నిర్ణయిస్తాయి. ఇరాన్ మూడు పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. మొరాకో ఇప్పటికే టోర్నీ నుంచ నిష్క్రమించింది.

గ్రూప్ సి:

గ్రూప్ సి:

ఆరు పాయింట్లతో ఫ్రాన్స్ ఇప్పటికే నాకౌట్‌కు బెర్తుని ఖరారు చేసుకుంది. నాలుగు పాయింట్లతో ఉన్న డెన్మార్క్ లీగ్‌లో తన చివరి మ్యాచ్‌ను ఆడనుంది. చివరి మ్యాచ్‌లో డెన్మార్క్ విజయం సాధిస్తే నేరుగా నాకౌట్‌కు అర్హత సాధిస్తుంది. అదే డెన్మార్క్ ఈ మ్యాచ్‌లో ఓడిపోతే, పెరూపై ఆస్ట్రేలియా విజయం సాధిస్తే నాకౌట్‌కు ఆర్హత సాధిస్తుంది.

గ్రూప్ డి:

గ్రూప్ డి:

ఈ గ్రూపులో క్రొయేషియా ఆరు పాయింట్లతో నాకౌట్‌కు చేరినట్లే. మిగిలిన ఒక్క స్పాట్ కోసం మిగతా మూడు జట్లు కూడా రేసులో ఉన్నాయి. టోర్నీలో భాగంగా క్రొయేషియా తన చివరి మ్యాచ్‌లో ఐస్‌ల్యాండ్‌తో తలపడనుంది.

అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడంతో నైజీరియా మూడు పాయింట్లతో నాకౌట్ రేసులోకి వచ్చింది. క్రొయేషియాపై ఐస్‌ల్యాండ్ విజయం సాధిస్తే నైజీరియా నాకౌట్‌కు మార్గం సుగమనం అవుతుంది. అయితే, ఇక్కడ గోల్ తేడా కీలకం కానుంది.

అర్జెంటీనా నాకౌట్‌కు అర్హత సాధించాలంటే నైజీరియాపై విజయం సాధించాలి. అదే విధంగా క్రొయేషియా-ఐస్‌ల్యాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో ఐస్‌ల్యాండ్ ఓడాలి లేదా డ్రాగా ముగియాలి. అర్జెంటీనా, ఐస్‌ల్యాండ్ రెండూ విజయం సాధిస్తే ఇరు జట్లు గోల్ తేడా కీలకం అవుతుంది.

గ్రూప్ ఇ:

గ్రూప్ ఇ:

ఇప్పటికే కోస్టారికా నాకౌట్ నుంచి నిష్క్రమించింది. బ్రెజిల్, స్విట్జర్లాండ్ జట్లు చెరో నాలుగు పాయింట్లతో టాప్-2లో కొనసాగుతుండగా, సెర్బియా మూడు పాయింట్లతో ఉంది. దీంతో బ్రెజిల్‌తో జరిగే మ్యాచ్‌లో సెర్బియా విజయం సాధిస్తే నేరుగా నాకౌట్‌కు చేరుకుంటుంది.

గ్రూప్ ఎఫ్:

గ్రూప్ ఎఫ్:

ఆరు పాయింట్లతో మెక్సికో దాదాపుగా నాకౌట్‌కు చేరింది. జర్మనీ, స్వీడన్ చెరో మూడు పాయింట్లతో పోటీగా ఉన్నాయి. స్వీడన్‌తో జరిగే మ్యాచ్‌లో మెక్సికో విజయం సాధించినా లేక మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా నేరుగా నాకౌట్‌కు అర్హత సాధిస్తుంది. అదే, ఈ మ్యాచ్‌లో మెక్సికో ఓడిపోతే... దక్షిణకొరియాతో జరిగే మ్యాచ్‌లో జర్మనీ తప్పక గెలవాలి లేదా డ్రా చేసుకోవాలి. అప్పుడే జర్మనీ నాకౌట్‌కు అర్హత సాధిస్తుంది.

గ్రూప్ జీ:

గ్రూప్ జీ:

ఇంగ్లాండ్, బెల్జియం జట్లు దాదాపుగా తమ నాకౌట్ బెర్తులను ఖరారు చేసుకున్నాయి. అయితే, ఇరు జట్ల మధ్య గురువారం జరిగే మ్యాచ్‌లో ఏ జట్టు ముందు నాకౌట్‌కు వెళ్తుందో తెలుస్తుంది. ఈ రెండు జట్లు ఆరు పాయింట్లతో ఈ గ్రూప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి.

గ్రూప్ హెచ్:

గ్రూప్ హెచ్:

ఈ గ్రూప్‌లో జపాన్, సెనెగల్ జట్లు నాకౌట్‌కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రెండు జట్లు పోలెండ్, కొలంబియాతో ఆడిన మ్యాచ్‌లను డ్రా చేసుకున్నాయి. ఇక, ఫెయిర్ ప్లే విషయానికి వస్తే జపాన్ ఆటగాళ్లు మూడు సార్లు ఎల్లో కార్డుని అందుకోగా, సెనెగల్ ఆటగాళ్లు ఐదు సార్లు ఎల్లో కార్డుని అందుకున్నారు. సెనెగల్‌తో జరిగే మ్యాచ్‌లో కొలంబియా విజయం సాధిస్తే నేరుగా నాకౌట్‌కు అర్హత సాధిస్తుంది. అలా కాకుండా ఈ మ్యాచ్ డ్రాగా ముగిస్తే మాత్రం జపాన్‌పై పోలెండ్ విజయం సాధించాల్సి ఉంటుంది. పోలెండ్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, June 25, 2018, 16:01 [IST]
Other articles published on Jun 25, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X