న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫిఫా వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్ బోణీ: ఆస్ట్రేలియాపై 2-1తో విజయం

By Nageshwara Rao
FIFA World Cup 2018: France beat Australia 2-1

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్ శుభారంభం చేసింది. టోర్నీలో భాగంగా గ్రూపు-సి మ్యాచ్‌లో శనివారం కజన్ నగరంలోని కజన్ ఎరీనా ఫ్రాన్స్, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌ ఆద్యంతం తన ఆధిక్యాన్ని కనబర్చిన ఫ్రాన్స్ జట్టు ఆస్ట్రేలియాపై 2-1తేడాతో విజయం సాధించింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

మ్యాచ్‌ ఆరంభం నుంచి హోరాహోరీగా ఇరు జట్లు తలపడ్డాయి. అయితే, మ్యాచ్ తొలి అర్ధభాగంలో బంతి ఫ్రాన్స్ ఆటగాళ్ల ఆధీనంలోనే ఉన్నప్పటికీ ఒక్క గోల్‌ కూడా చేయలేక పోయింది. దీంతో తొలి అర్ధభాగం ఎలాంటి గోల్స్ నమోదు కాకుండానే ముగిసింది. ఇక, రెండో అర్ధభాగంలో ఆస్ట్రేలియాను ఒత్తిడికి నెడుతూ ఫ్రాన్స్ ఆటగాళ్లు దూకుడుగా ఆడారు.

అనంతరం మొదలైన రెండో అర్ధభాగంలో 58 నిమిషంలో పెనాల్టీ కిక్‌ లభించడంతో ఫ్రాన్స్‌ ఆటగాడు ఆంటోనియో గ్రేజ్‌‌మెన్‌ గోల్‌గా మలిచి ఫ్రాన్స్‌కు తొలి గోల్‌ను అందించాడు. దీంతో ఫ్రాన్స్ శిబిరంలో ఆనందం నెలకొంది. అయితే, ఈ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. 62వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ లభించడంతో ఆస్ట్రేలియా ప్లేయర్ జెడినాక్ గోల్ చేసి స్కోరుని సమం చేశాడు.

ఆ తర్వాత మళ్లీ గోల్ చేసేందుకు ఇరు జట్లు చాలా సమయాన్ని తీసుకున్నాయి. మ్యాచ్‌ని వీక్షిస్తున్న అభిమానులంతా మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని అంతా భావించారు. మరికొన్ని నిమిషాల్లో ఆట ముగుస్తుందనుకున్న సమయంలో ఫ్రాన్స్ ఆటగాడు పాల్ పోబా 81 నిమిషంలో అద్భుతమైన గోల్‌తో ఫ్రాన్స్‌ ఆధిక్యాన్ని పెంచాడు.

1
958034

ఆ తర్వాత నుంచి ఇరు జట్ల ఆటగాళ్లు గోల్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఫలితంలో ఎలాంటి మార్పు రాలేదు. మరోవైపు మ్యాచ్‌ సమయం కూడా ముగిసిపోవడంతో ఫ్రాన్స్‌ విజేతగా నిలిచింది. డిఫెన్స్‌ లోపాలతో ఆస్ట్రేలియా పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఆటగాళ్లు ప్రత్యర్ధి గోల్‌పోస్టుపై 13సార్లు దాడులు చేయగా.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు కేవలం 4 సార్లు మాత్రమే ప్రత్యర్థి గోల్‌పోస్టును సమీపించారు. మరోవైపు ఫ్రాన్స్ 15 సార్లు అనవసర తప్పిదాలకు పాల్పడగా... ఆస్ట్రేలియా 19 సార్లు అనవసర తప్పిదాలకు పాల్పడింది.

Story first published: Saturday, June 16, 2018, 18:27 [IST]
Other articles published on Jun 16, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X