ఏప్రిల్ ఫూల్.. జస్ట్ జోక్ చేశా! ఏ జట్టు కొనడం లేదు.. మస్క్ మావా ట్విస్టా మజాకా!

న్యూఢిల్లీ: ఫుట్‌బాల్‌తో అత్యంత ప్రజాధరణ కలిగిన మాంచెస్టర్ యూనైటెడ్ జట్టును కొనుగోలు చేస్తున్నానంటూ ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ చేసిన ట్వీట్ ఉత్తదేనని తేలింది. గతంలో మాదిరే తాను ఈ విషయంలోనూ జోక్ చేశానని, తాను ఏ జట్టు కొనడం లేదని ఎలన్ మస్క్ స్పష్టం చేశాడు. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) లో పాపులర్ టీమ్ అయిన మాంచెస్టర్ యూనైటెడ్‌ను కొనుగోలు చేస్తున్నానంటూ బుధవారం ఉదయం ఎలన్ మస్క్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ క్రీడా వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఇది నిజమేనని అంతా నమ్మారు. ప్రధాన మీడియా చానెళ్లన్ని ఈ విషయాంపై ప్రత్యేక కథనాలను కూడా ప్రచురించాయి.

మస్క్ మావ ట్వీట్..

ఎలన్ మస్క్ ముందుగా ' యూకే ఎన్నికల్లో నేను రిపబ్లికన్, డెమొక్రటిక్.. ఈ రెండు పార్టీలకు మద్దతునిస్తున్నాను' అని ట్వీట్ చేశాడు. మళ్లీ కొద్దిసేపటికే.. 'అంతేగాక నేను త్వరలోనే మాంచెస్టర్ యూనైటెడ్ ను కూడా కొనుగోలు చేస్తున్నా..' అని ట్వీట్ చేశాడు. మస్క్ ప్రకటనతో వ్యాపార ప్రముఖులతో పాటు ఫుట్‌బాల్ అభిమానులు కూడా షాకయ్యారు. అయితే మస్క్ గురించి తెలిసిన పలువురు మాత్రం.. 'ఇది కూడా పాత ట్వీట్ల మాదిరిగానే జోక్ అయి ఉంటుందిలే' అని భావించారు. మస్క్ ట్వీట్ మీద సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియా చానెల్లో కూడా చర్చలు నడిచాయి.

ఫుల్ ఎంజాయ్ చేసిన మస్క్..

ఫుల్ ఎంజాయ్ చేసిన మస్క్..

మస్క్ రాకతో మాంచస్టర్ యూనైటెడ్ జట్టు రూపురేఖలు మారతాయని ఒకరు.. అబ్బే లేదు, మరింత పతనానికి వెళ్లడం ఖాయమని మరికొందరు.. ఎవరికి తోచిన విధంగా వాళ్లు విశ్లేషణలు, విమర్శలు, వితండవాదాలు చేశారు. ఇక సోషల్ మీడియాలో అయితే దీనిపై మీమ్స్, జోక్స్ పేలాయి. ఇవన్నీ చూసి కావాల్సినంత ఫన్ ను పొందిన తర్వాత మస్క్ మావ మెల్లిగా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు చావు కబురు చల్లగా చెప్పాడు. తాను కేవలం జోక్ చేశానని పేర్కొని అందర్నీ ఫూల్ చేశాడు.

 చాలా కాలంగా ఉన్న జోక్..

చాలా కాలంగా ఉన్న జోక్..

ఇదే విషయమై టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ అనే పేరు ఉన్న ట్విటర్ యూజర్.. ఎలన్ మస్క్ ను జట్టు కొనుగోలు చేయడంపై ప్రశ్నించాడు.'మీరు చెబుతున్నది నిజమేనా..?'అని మస్క్‌ను అడిగాడు. దానికి మస్క్.. 'లేదు. అది (మస్క్ మాంచెస్టర్ జట్టును కొనుగోలు చేస్తున్నాడని) ట్విటర్ లో చాలా కాలంగా జోక్ ప్రచారంలో ఉంది. నేను ఏ స్పోర్ట్స్ టీమ్ ను కొనుగోలు చేయడం లేదు..' అని ట్వీట్ చేశాడు. మస్క్ స్పష్టతనిచ్చాక కూడా ట్విటర్ లో అతనిపై మీమ్స్ వర్షం కురుస్తూనే ఉంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, August 17, 2022, 18:49 [IST]
Other articles published on Aug 17, 2022

Latest Videos

  + More
  + మరిన్ని
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Yes No
  Settings X